Telangana BJLP Leader: తెలంగాణ బీజెఎల్పీ నేతగా ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి బీజేఎల్పీ నేతను ఎట్టకేలకు డిసైడ్ చేసింది తెలంగాణ బీజేపీ. నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డిని బీజేఎల్పీ నేతగా నియమించింది. డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి లు నియమితులయ్యారు. By Manogna alamuru 14 Feb 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Alleti Maheshwar Reddy : తెలంగాణ బీజేపీ మొత్తానికి ఒక గాడిన పడ్డాది. అసెంబ్లీ ఎన్నికలు అయి ఇన్నాళ్ళు అవుతున్న ఫ్లోర్ లీడర్ (Floor Leader) లేక...నాయకత్వం లేక సతమతమవుతున్న బీజేపీ (Telangana BJP) ఎట్టకేలకు కుదురుకుంది. ఈ పార్టీ బీజేఎల్పీ నేతగా నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్రెడ్డిని నియమించారు. డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి (Katipally Venkata Ramana) లు నియమితులయ్యారు. ఇక బీజేపీ చీఫ్ విప్ పాల్వాయి హరీష్, విప్ గా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుత్తాలు...బీజేఎల్పీ ట్రెజరీ గా ఆర్ముర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిలను నియమించారు. బీజేఎల్పీ సెక్రటరీ గా రామరావు పటేల్ అపాయింట్ చేస్తూ అధికార పత్రాలను అసెంబ్లీ అధికారులకు అందించారు. అధికారిక పత్రాలను అసెంబ్లీ కి మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు తీసుకువచ్చి సమర్పించారు. Also Read:Telanagana: రారా చూసుకుందాం.. కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ ఫ్లోర్ లీడర్ పదవికి పోటీ పడ్డ ఆ ఇద్దరూ... అంతకు ముందు ఫ్లోర్ లీడర్ పదవిని ఎమ్మెల్యేల్లో వెంకటరమణా రెడ్డి, ఏలేటి మహేశ్వర రెడ్డి ఆశించారు. అంతకు ముందు రాజాసింగ్‌కు (MLA Raja Singh) ఇస్తామంటే వద్దని చెప్పేశారు. దీంతో వీరిద్దరూ పోటీలోకి వచ్చారు. కేసీఆర్‌ను ఓడించిన వెంకట రమణారెడ్డి ఫ్లోర్ లీడర్ పదవి తనకే వస్తుందని మొన్నటి వరకు చెప్పుకున్నారు. అయితే పార్టీ మాత్రం ఈ విషయం మీద స్పందించలేదు. ఇదే టైమ్‌లో నిర్మల్ ఎమ్మల్యే మహేశ్వర్రెడ్డి కూడా బీజేఎల్పీ పదవికి పోటీ పడ్డారు. వీరిద్దరిలో ఎవరికో ఒకరికి ఇవ్వాలని మిగతా నేతలు అందరూ కూడా పట్టుబట్టారు. ఎట్టకేలకు మహేశ్వర్రెడ్డిని (Alleti Maheshwar Reddy) పార్టీ అధిష్టానం బీజేఎల్పీ నేతగా నియమించింది. #alleti-maheshwar-reddy #telangana-bjlp #bjlp #katipally-venkata-ramana మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి