Mission Gaganyaan: ఇస్రో నుంచి అదిరే అప్‌డేట్.. మరో కొత్త చరిత్రకు ఇండియా రెడీ!

గగన్‌యాన్‌ మిషన్‌లో ఇస్రో మరో ముందడుగు వేసింది. గగన్‌యాన్ మిషన్‌కు చెందిన CE20 క్రయోజెనిక్ ఇంజిన్ సిద్ధంగా ఉందని ట్వీట్ చేసింది. ఇస్రో చేపట్టిన గగన్‌యాన్‌ మిషన్‌ విజయవంతమైతే అమెరికా, చైనా, సోవియట్‌ యూనియన్‌ తర్వాత ఈ ఘన సాధించిన భారత్‌ నాలుగో దేశంగా అవతరిస్తుంది.

New Update
Mission Gaganyaan: ఇస్రో నుంచి అదిరే అప్‌డేట్.. మరో కొత్త చరిత్రకు ఇండియా రెడీ!

Isro Update on Mission Gaganyaan: చంద్రయాన్-3 విజయం తర్వాత ఇస్రో మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇప్పుడు ఇస్రో సైంటిస్టుల ఫోకస్‌ అంతా గగన్‌యాన్ మిషన్‌పైనే ఉంది. గగన్‌యాన్‌ మిషన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇది దేశపు మొట్టమొదటి మానవ అంతరిక్ష యాత్ర. ఈ మిషన్ భారత్‌కు చాలా ప్రత్యేకం. ఈ మిషన్‌ సక్సెస్‌ అయితే అమెరికా, చైనా, రష్యా తర్వాత ఈ ఫీట్‌ సాధించిన నాల్గొ దేశంగా ఇండియా రికార్డు సృష్టిస్తోంది. ఇక ఈ క్రమంలోనే ఇస్రో నుంచి ఓ కీలక్ అప్‌డేట్ వచ్చింది. గగన్‌యాన్‌ మిషన్‌లో ఇస్రో మరో ముందడుగు వేసింది. గగన్‌యాన్ మిషన్‌కు చెందిన CE20 క్రయోజెనిక్ ఇంజిన్ సిద్ధంగా ఉందని ట్వీట్ చేసింది.


చెప్పిందే చేస్తున్నారు:
భారత అంతరిక్ష సంస్థ(ఇస్రో) చైర్మన్ సోమనాథ్ ఈ ఏడాది ప్రారంభంలోనే తమ టార్గెట్‌ ఏంటో చెప్పారు. 2024ను గగన్‌యాన్‌కు సన్నాహక సంవత్సరంగా భావిస్తున్నట్టు తెలిపారు. ఈ ఏడాదిలోనే హెలికాప్టర్ నుంచి డ్రాప్ టెస్ట్ కూడా నిర్వహిస్తామన్నారు. ఇందులో పారాచూట్ వ్యవస్థను పరీక్షిస్తారు. ఇలాంటి అనేక డ్రాప్ పరీక్షలు నిర్వహించిన తర్వాత పలు వాల్యుయేషన్ పరీక్షలు కూడా నిర్వహించనున్నారు. ఈ ఏడాది జీఎస్‌ఎల్‌వీని కూడా ప్రయోగిస్తామని సోమనాథ్‌ స్పష్టం చేశారు. ఈ ఏడాది కనీసం 12 మిషన్లను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఇస్రో చీఫ్ చెప్పారు. హార్డ్‌వేర్ లభ్యతను బట్టి ఈ సంఖ్య పెరగవచ్చని అంచనా వేశారు సోమనాథ్‌.

గగన్‌యాన్ మిషన్ అంటే ఏమిటి?
మానవులను అంతరిక్షంలోకి పంపడమే గగన్‌యాన్ మిషన్ ప్రధాన లక్ష్యం. ముగ్గురు వ్యక్తుల బృందాన్ని అంతరిక్షంలోని భూమి కక్ష్యలోకి పంపుతారు. తర్వాత వారు సురక్షితంగా భూమిపైకి తిరిగి రావాలి. ఈ మిషన్‌ను 2025లోపు పూర్తి చేయాలన్నది ఇస్రో టార్గెట్. నిజానికి 2022లోనే ఇది పూర్తికావాల్సి ఉంది. అయితే కరోనా మహమ్మారి కారణంగా ఇది ఆలస్యం అయింది.

Also Read: మాతృభాష అంటే సాంస్కృతిక వారధి.. దానిని కాపాడుకోవడం అందరి విధి..

WATCH:

Advertisment
Advertisment
తాజా కథనాలు