Ponnam Prabhakar : గోదావరి నీటిని గజ్వేల్, సిద్దిపేటలకు ఎందుకు తరలిస్తున్నారు: పొన్నం ప్రభాకర్

గోదావరి నీటిని గజ్వేల్, సిద్దిపేట, తదితర ప్రాంతాలకు ఎందుకు మళ్లిస్తున్నారంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నీటి తరలింపుకు అయ్యే కరెంట్ బిల్లు జలమండలి భరించాల్సి వస్తోందని.. గజ్వేల్, సిద్దిపేటలో నీటి సమస్యను పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు.

New Update
Ponnam Prabhakar: ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తాం: మంత్రి పొన్నం

Godavari Water : మంత్రి, హైదరాబాద్‌(Hyderabad) జిల్లా ఇన్‌ఛార్జి పొన్నం ప్రభాకర్‌(Ponnam Prabhakar) కీలక వ్యాఖ్యలు చేశారు. గోదావరి నీటిని(Godavari Water) గజ్వేల్, సిద్దిపేట, తదితర ప్రాంతాలకు ఎందుకు మళ్లిస్తున్నారంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయా ప్రాంతాల్లో మిషన్ భగీరథ(Mission Bhagiratha) పనులు పూర్తయినట్లు గత ప్రభుత్వం ప్రకటించిందని.. అయినా కూడా ఇంకా గోదావరి నీటిని ఎలా తీసుకుంటున్నారని ప్రశ్నించారు. జీహెచ్‌ఎంసీ(GHMC), జలమండలి పరిధిలోని పౌర సేవలపై మంత్రి పొన్నం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో నగర మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి, ఉప మేయర్‌ శ్రీలతరెడ్డి, జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ తదితరులతో కలిసి ఆయన సమీక్ష జరిపారు.

Also Read : 2లక్షల ఉద్యోగాలిస్తాం.. రేవంత్‌రెడ్డి సంచలన హామీ!

హైదరాబాద్‌ నీటిని నగరానికే వాడాలని.. రాజధానికి వచ్చే నీటిని మధ్యలో 40 ఎంజీడలను దారి మళ్లించడం సరైంది కాదంటూ అభిప్రాయపడ్డారు. వెంటనే ఈ విషయంపై పంచాయతీరాజ్‌ ఉన్నతాధికారులతో మాట్లాడాలంటూ ఆదేశాలు జారీ చేశారు. అయితే గోదావరి నుంచి నిరంతరం నగరానికి 172 ఎంజీడీలను తరలిస్తుండగా.. అందులో 40 ఎంజీడీల వరకు గజ్వేల్, సిద్దిపేటలకు కేటాయిస్తున్నారు.

దీంతో ఈ నీటి తరలింపుకు అయ్యే కరెంట్ బిల్లుల భారాన్ని జలమండలి భరించాల్సి వస్తోంది. అందుకే ఈ గజ్వేల్, సిద్దిపేటలో నీటి సమస్యను పరిష్కరించి.. గోదావరి నీటిని 100 శాతం వినియోగించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు.

Also Read : తెలంగాణ నీటి పారుదల శాఖలో భారీ ప్రక్షాళన.. ఆ ఇద్దరు తొలగింపు!

Advertisment
Advertisment
తాజా కథనాలు