Minister Peddireddy: హిందూపురంలో అందుకే ఓడిపోతున్నాం: మంత్రి పెద్దిరెడ్డి ఎమ్మెల్యే బాలకృష్ణ స్థానికేతరుడు కావడంతోనే హిందూపురం అభివృద్ధి జరగలేదన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అందుకే స్థానికరాలైనా మహిళా అభ్యర్థిని పోటీలో దింపుతున్నట్లు వెల్లడించారు. హిందూపురంలో గ్రూపు తగాదాల వల్లే వైసీపీ అభ్యర్థులు వరుసగా ఓడిపోతున్నారని కామెంట్స్ చేశారు. By Jyoshna Sappogula 12 Jan 2024 in ఆంధ్రప్రదేశ్ అనంతపురం New Update షేర్ చేయండి Minister Peddireddy Ramachandra Reddy: శ్రీ సత్య సాయి జిల్లా చిలమత్తూరు మండలం వీరాపురం బహిరంగ సభలో మంత్రి పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో హిందూపురం, కుప్పంలో టిడిపిని ఓడిస్తామన్నారు. గత మూడు రోజులుగా హిందూపురంలో వైసిపి గెలుపే లక్ష్యంగా మంత్రి పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి గ్రామ గ్రామానికి వెళ్లి బహిరంగ సభల్లో పార్టీ క్యాడర్ తో మాట్లాడుతున్నారు. Also Read: వైసీపీ నుండి మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ఔట్? ఈసారి హిందూపురంలో టిడిపిని ఓడించకపోతే తన మర్యాద పోతుందన్నారు. అందుకోసమే వైసిపి గెలుపే లక్ష్యంగా ఇంత కష్టపడుతున్నట్లు తెలిపారు. హిందూపురంలో గెలవడానికి మహిళా అభ్యర్థిని బరిలో దింపుతున్నట్లు వెల్లడించారు. ఒక్క చిలమత్తూరు మండలంలోనే 15 వేల మెజారిటీ వస్తుందని ఇక్కడి వైసిపి నేతలు అన్నారన్నారు. అదే జరిగితే ఇక్కడి వైసిపి కార్యకర్తలను సీఎం జగన్ వద్దకు తీసుకెళ్లి సన్మానం చేయిస్తానని తెలిపారు. ఎమ్మెల్యే బాలకృష్ణ స్థానికేతరుడు కావడంతో అభివృద్ధి జరగలేదన్నారు మంత్రి పెద్దిరెడ్డి. అందుకే విద్యావంతురాలు స్థానికరాలు బీసీ వర్గానికి చెందిన మహిళా అభ్యర్థిని హిందూపురం నుండి పోటీలో దింపుతున్నామన్నారు. Also Read: ‘కేశినేని కౌన్ కిస్కా గొట్టం, క్యారెక్టర్ లెస్, ఊసరవెల్లి’ ఇందుకోసమే నానికి టిక్కెట్ ఇచ్చారు.. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ఓట్ల కోసం బంగారు ఇస్తానని కూడా అనొచ్చు ఆయన బూటకపు మాటలు విని ఓట్లేస్తే అభివృద్ధి శూన్యం అవుతుందన్నారు. హిందూపురంలో గ్రూపు తగాదాల వల్ల మా అభ్యర్థులు వరుసగా ఓడిపోవడం జరిగిందన్నారు. వైసీపీలో గ్రూపులన్నీ ఏకం చేశా.. ఇక గెలుపే లక్ష్యంగా హిందూపురంలో పార్టీ క్యాడర్ పనిచేస్తుందన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. #andhra-pradesh #jagan #bala-krishna #ap-minister-peddireddy-ramachandra-reddy #hindhupuram మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి