AP : ఏపీలో ఫ్రీ గ్యాస్ అమలు.. అసెంబ్లీలో కీలక ప్రకటన..!

త్వరలోనే ఏపీలో ఫ్రీ గ్యాస్ ఇవ్వనున్నట్లు అసెంబ్లీలో మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన చేశారు. ఏడాదికి 3 ఉచిత సిలిండర్లు ఇస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నామన్నారు. వినాయకచవితి లేదా దీపావళికి ఫ్రీ గ్యాస్ అమల్లోకి రానున్నట్లు వెల్లడించారు.

New Update
AP : ఏపీలో ఫ్రీ గ్యాస్ అమలు.. అసెంబ్లీలో కీలక ప్రకటన..!

Minister Nadendla Sensational Comments On Free Gas In AP : త్వరలోనే ఏపీ (Andhra Pradesh) లో ఫ్రీ గ్యాస్ ఇవ్వనున్నట్లు అసెంబ్లీలో మంత్రి నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) కీలక ప్రకటన చేశారు. త్వరలోనే ఈ పథకంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నట్లు నాదెండ్ల తెలిపారు. వినాయకచవితి లేదా దీపావళికి ఫ్రీ గ్యాస్ (Free Gas) అమల్లోకి రానున్నట్లు వెల్లడించారు.

ఎన్నికల ప్రచారంలో కూటమి నేతలు సూపర్ సిక్స్‌ పథకాలతో ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సూపర్ సిక్స్‌లో  ఫ్రీ గ్యాస్‌ ఇస్తామని హామీ ఇచ్చారు. ఏడాదికి 3 ఉచిత సిలిండర్లు ఇస్తామని ప్రచారం చేశారు. అయితే, ఈ పథకాం ద్వారా ఏడాదికి ప్రభుత్వంపై ఎన్ని వేల కోట్ల భారం పడుతుంది?  నేరుగా గ్యాస్ కంపెనీలకే సిలిండర్ డబ్బులు చెల్లించాలా లేక..లబ్ధిదారుల అకౌంట్లో డబ్బులు వేయాలా అనేదానిపై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read : ఢిల్లీలో మాజీ సీఎం జగన్ ధర్నా.. ఆ పార్టీ శ్రేణులే టార్గెట్‌గా..


Advertisment
Advertisment
తాజా కథనాలు