Telangana: ఎన్టీఆర్ శిష్యుడు కేసీఆర్.. హ్యాట్రిక్ కొట్టడం ఖాయం.. కేటీఆర్ ఇంట్రస్టింగ్ కామెంట్స్.. ఎంతమంది నాయకులు వచ్చినా నందమూరి తారక రామారావుకు(NTR) సాటిలేరని.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి ఎన్టీఆర్ ఆదర్శమని వ్యాఖ్యానించారు కేటీఆర్(KTR). ఎన్టీఆర్ శిష్యుడు కేసీఆర్ తెలంగాణ అస్తిత్వాన్ని యావత్ దేశానికి చాటి చెప్పారని అన్నారు. By Shiva.K 30 Sep 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Minister KTR Comments on NTR: ఎంతమంది నాయకులు వచ్చినా నందమూరి తారక రామారావుకు(NTR) సాటిలేరని.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి ఎన్టీఆర్ ఆదర్శమని వ్యాఖ్యానించారు కేటీఆర్(KTR). ఎన్టీఆర్ శిష్యుడు కేసీఆర్ తెలంగాణ అస్తిత్వాన్ని యావత్ దేశానికి చాటి చెప్పారని అన్నారు. ఖమ్మం జిల్లా నగరంలోని లకారం ట్యాంక్ బండ్ వద్ద రూ.1.37 కోట్లతో నిర్మించిన ఎన్టీఆర్ పార్క్, విగ్రహాన్ని మంత్రి అజయ్ కుమార్‌తో కలిసి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన కేసీఆర్. ఎన్టీఆర్ పై ప్రశంసల జల్లు కురిపించారు. రాముడు, కృష్ణుడు ఎలా ఉంటారో మనకు తెలియదు కానీ, ఎన్టీఆర్ లాగానే ఉంటారని మనమంతా అనుకుంటాం అన్నారు. తనకు ఎన్టీ రామారావు విగ్రహాన్ని ఆవిష్కరించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఇదే సమయంలో ఎన్టీఆర్ శిష్యుడు కేసీఆర్ అంటూ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు మంత్రి కేటీఆర్. ఎన్టీఆర్ సీఎంగా హ్యాట్రిక్ కొట్టలేకపోయారని, ఆయన శిష్యుడు సీఎం కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ కొడతారని ధీమా వ్యక్తం చేశారు. తద్వారా గురువు చేయలేని పనిని శిష్యుడు కేసీఆర్ సాధ్యం చేయబోతున్నారని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. తారకరామారావు అనే పేరులోనే ఏదో శక్తి ఉందన్నారు. అయితే, ఎన్టీఆర్ విగ్రహాన్ని ఖమ్మం నగరంలో ఏర్పాటు చేయడం.. దీన్ని ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొని ఎన్టీఆర్‌పై ప్రశంసల జల్లు కురిపించడం ఇటు తెలంగాణతో పాటు అటు ఏపీ రాజకీయాల్లోనూ హాట్ టాపిక్‌గా మారింది. అంతకు ముందు మంత్రి కేటీఆర్ ఖమ్మం జిల్లాలో కొణిజర్ల మండలం అంజనాపురం వద్ద ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేశారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పలు కార్యక్రమాల వలన రాష్ట్రంలో ఐదు విప్లవాలు ఆవిష్కృతం అవుతున్నాయి. 🌾 రెండవ హరిత విప్లవం 🐄 శ్వేత విప్లవం 🐟 నీలి విప్లవం 🐔🐏గులాబీ విప్లవం 🌴 పసుపు విప్లవం తెలంగాణలో పసుపు విప్లవంలో భాగం అయిన ఆయిల్ పామ్ సాగును పెంచేందుకు వివిధ కార్యక్రమాల… pic.twitter.com/IsmcuzC9Kj — Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) September 30, 2023 సత్తుపల్లిలో బహిరంగ సభలో పాల్గొన్న మంత్రి కేటీఆర్.. సత్తుపల్లి గడ్డపై జన ప్రభంజనం వందలాది వాహనాలు, బైక్‌లతో ర్యాలీగా అమాత్యుడు రామన్నకు సత్తుపల్లిలో అడుగడుగునా స్వాగతించారు.@KTRBRS @SandraMLA pic.twitter.com/RUEfNyXfKO — KTR News (@KTR_News) September 30, 2023 Minister @KTRBRS addressing the gathering after participating in various development programs in Khammam https://t.co/Of2mGGA7zZ — Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) September 30, 2023 Also Read: Nara Bhuvaneshwari: భువనేశ్వరి నిరాహార దీక్ష.. బాలకృష్ణ సంచలన ప్రకటన Ktr: తెలంగాణ ఎన్నికల కోసం కర్నాటకలో కాంగ్రెస్ పన్ను.. కేటీఆర్ సంచలన ట్వీట్ #telangana #khammam #minister-ktr #it-minister-ktr మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి