ఉమ్మడి ఏపీ భవన్‌ వివాదంపై స్పందించిన మంత్రి కోమటిరెడ్డి.. ఏమన్నారంటే

ఢిల్లీలోని ఉమ్మడి ఏపీ భవన్ వాటా వివాదంపై మంత్రి కోమటిరెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఉమ్మడి ఏపీ భవన్‌కు చెందిన ఆస్తుల వివరాలు తెలుసుకున్నాం. తెలుగు రాష్ట్రాల మధ్య ఎలాంటి వివాదం లేదు. తెలంగాణ కొత్త భవనానికి మార్చిలోగా శంకుస్థాపన చేసి ఏడాదిలోగా పూర్తిచేస్తామన్నారు.

New Update
ఉమ్మడి ఏపీ భవన్‌ వివాదంపై స్పందించిన మంత్రి కోమటిరెడ్డి.. ఏమన్నారంటే

Komatireddy Venkat Reddy : ఉమ్మడి రాష్ట్రం ఆధ్వర్యంలో దేశ రాజధాని ఢిల్లీ(Delhi) లో నిర్మించిన ఏపీ భవన్ వాటాపై కొంతకాలంగా వివాదం కొనసాతున్నట్లు వస్తున్న వార్తలపై తెలంగాణ రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ కాంగ్రెస్ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి(Komatireddy Venkat Reddy) స్పందించారు. త్వరలోనే ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణ పనులు చేపట్టబోతుండగా ఇందుకు సంబంధించిన పనుల పరిశీలనకు ఢిల్లీకి వెళ్లిన ఆయన మీడియాతో మాట్లాడారు.

ఈ మేరకు వచ్చే ఏడాది ఏప్రిల్‌ నాటికి తెలంగాణ భవన్ నిర్మాణ పనులు చేపట్టాలనుకుంటున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. ఇదే క్రమంలో ఉమ్మడి ఏపీ భవన్‌కు వెళ్లిన మంత్రి.. అక్కడ పలు బ్లాక్‌లను పరిశీలించారు. అనంతరం ఉమ్మడి ఏపీ భవన్‌ ఆస్తుల వివరాలు, రాష్ట్ర వాటాను అధికారులు మ్యాప్‌ ద్వారా ఆయనకు వివరించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన ఉమ్మడి ఏపీ భవన్‌కు చెందిన ఆస్తులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకున్నట్లు తెలిపారు. అలాగే ఉమ్మడి ఏపీ భవన్‌ విషయంలో తెలుగు రాష్ట్రాల మధ్య ఎలాంటి వివాదం లేదని స్పష్టం చేశారు. ఆ తర్వాత తెలంగాణ భవన్‌ నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన కోమటిరెడ్డి.. తెలంగాణ భవన్‌ నిర్మాణం ఇప్పటికే ఆలస్యమైందన్నారు. కొత్త భవనానికి మార్చిలోగా శంకుస్థాపన చేయాలన్నది టార్గెట్ అని తెలిపారు. ఢిల్లీ పర్యటననుంచి రాగానే భవన పూర్తి వివరాలను సీఎం రేవంత్ రెడ్డికి వివరిస్తానని చెప్పారు.

ఇది కూడా చదవండి : TSPSC:టీఎస్పీఎస్ ఛైర్మన్ రాజీనామాను ఆమోదించని గవర్నర్.

ఇక దాదాపు పదేళ్లుగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడంతో ఈ వివాదం అపరిష్కృతంగా ఉండిపోయింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించి భవన్ ఆస్తులను పంచుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ సందర్భంగా ఎంపీ పదవికి రాజీనామా కూడా చేశారు.

Also Read : అసెంబ్లీ రూపు రేఖలు మార్చేస్తాం - Komatireddy Venkat Reddy First Signature

Advertisment
Advertisment
తాజా కథనాలు