Mini Washing Machine: ఈ వాషింగ్ మిషన్స్ ఎక్కడికైనా తీసుకుపోవచ్చు.. చాలా చౌక.. 

క్యాంపులకు వెళ్లాల్సి వచ్చినపుడు.. హాస్టల్స్ లో ఉండేవారికి.. బట్టలు ఉతకడం పెద్ద సమస్య. దీనికోసం ఇప్పుడు బుల్లి వాషింగ్ మిషిన్స్ అందుబాటులోకి వచ్చేశాయి. రెండు వేల రూపాయల  నుంచి ఐదు వేల రూపాయల మధ్యలో దొరికే ఈ చిన్న వాషింగ్ మిషిన్స్ తక్కువ బట్టలు ఉతుక్కోవడానికి మంచి ఆప్షన్

New Update
Mini Washing Machine: ఈ వాషింగ్ మిషన్స్ ఎక్కడికైనా తీసుకుపోవచ్చు.. చాలా చౌక.. 

Mini Washing Machine: బట్టలు ఉతకడం అంటే ఎంతో కష్టమైనా పనే కాదు.. టైమ్ టేకింగ్ మేటర్ కూడా. అందుకే ఇప్పుడు అందరూ వాషింగ్ మిషన్ ఎక్కువగా వాడుతున్నారు. బట్టలు మిషన్ లో వేసి స్విచ్ వేస్తే చాలు ఉతికేస్తుంది. వాటిని తీసుకెళ్లి ఆరబెట్టుకోవడమే అంతే. కొన్ని మిషిన్స్ అయితే బట్టలను ఆరవేస్తాయి కూడా. పిండి కొలదీ రొట్టె కదా.. అలా ఎంత డబ్బు పెడితే అంత ఎక్కువ ఫీచర్లు ఉన్న వాషింగ్ మిషిన్స్ వస్తాయి. హాస్టల్స్ లో ఉండే పిల్లలు.. ఉద్యోగరీత్యా వేరే వూరిలో ఉండాల్సి వచ్చేవారు.. ఒక్కసారి పది పదిహేను రోజులు టూర్ వెళ్లాల్సిన సందర్భం వచ్చినపుడు.. బట్టలు ఉతుక్కోవడం పెద్ద సమస్య. అక్కడ పెద్దగా ఉండే వాషింగ్ మిషిన్ పట్టుకెళ్ళలేం.. దీంతో ఎక్కువ బట్టలు మోసుకెళ్ళడం.. విప్పిన బట్టలు అలానే తెచ్చుకోవడం ఇలా చాలా ఇబ్బందులు. ఇప్పుడు ఆ ఇబ్బందులను దూరంచేసి మినీ వాషింగ్ మిషిన్స్ (Mini Washing Machine)వచ్చేశాయి. తక్కువ బట్టలు ఉతుక్కోవాలంటే.. ఈ మిషిన్స్ చక్కగా సరిపోతాయి. అంతేకాదు.. వీటిని మన లగేజీతో పాటు ఎక్కడికైనా తీసుకుని వెళ్లిపోయే అవకాశమూ ఉంటుంది.   మీరు మీతో ఎక్కడికైనా తీసుకెళ్లగల వీటిలో సులభంగా ఉతకవచ్చు. ఇది మీ ఇంట్లో ఎక్కువ స్థలాన్ని కూడా తీసుకోదు.

ROMINO తాజా మినీ వాషింగ్ మెషిన్

క్యాంపింగ్‌లో ఉన్నప్పుడు కూడా మీరు ఈ మినీ వాషింగ్ మెషీన్‌(Mini Washing Machine)ని కూడా తీసుకువెళ్ళవచ్చు.  ఇందులో మీరు మీ బట్టలు ఉతికి ఆరబెట్టుకోవచ్చు. ఈ వాషింగ్ మెషీన్ ఎక్కువ బరువు ఉండదు. దీని అసలు ధర రూ. 9,999 అయితే మీరు దీన్ని 71 శాతం తగ్గింపుతో కేవలం రూ. 2,899కి కొనుగోలు చేయవచ్చు.

టాక్సిక్ మినీ వాషింగ్ మెషిన్

పోర్టబుల్ వాషింగ్ మెషీన్(Mini Washing Machine) మీ పనిని చాలా సులభతరం చేస్తుంది. మీరు దీనిని ఎక్కడైనా మీతో తీసుకెళ్లవచ్చు. ఈ వాషింగ్ మెషీన్ హాస్టల్స్ లేదా క్యాంపింగ్ కోసం మరింత ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పవచ్చు. గొప్పదనం ఏమిటంటే దీని ధర కూడా మీ బడ్జెట్‌లోనే ఉంటుంది. దీని అసలు ధర రూ. 4,999 అయినప్పటికీ, మీరు దీన్ని 60 శాతం తగ్గింపుతో కేవలం రూ. 1,985కి కొనుగోలు చేయవచ్చు.

Also Read: హోమ్ లోన్ తీసుకున్నారా? మీకో గుడ్ న్యూస్.. వడ్డీరేట్లు తగ్గే ఛాన్స్! ఎందుకంటే.. 

tmwilla వాషింగ్-మెషిన్

ఈ వాషింగ్ మెషీన్ మడతపెట్టి చిన్నదిగా చేసుకునే వీలున్న మిషిన్(Mini Washing Machine).  మీరు దానిని మీ బ్యాగ్‌లో ఉంచుకోవచ్చు. ఇందులో మీ బట్టలు ఉతకడంతోపాటు ఆరబెట్టవచ్చు కూడా.  రూ.2 వేల లోపు ఉండే ఈ వాషింగ్ మెషీన్ ను రూ.1,890కే పొందుతున్నారు.

DMR మోడల్ పోర్టబుల్ మినీ వాషింగ్

ఈ వాషింగ్ మెషీన్(Mini Washing Machine) రూ. 6499కి వచ్చినప్పటికీ, ఈ రోజుల్లో ఇది అమెజాన్‌లో 17 శాతం తగ్గింపుతో రూ. 5,399కి మాత్రమే అందుబాటులో ఉంది. ఈ వాషింగ్ మెషీన్ తక్కువ బట్టలు ఉతికే వారికి గొప్ప ఆప్షన్ గా ఉంటుందని చెప్పవచ్చు.  కానీ మీరు ఎక్కువ బట్టలు ఉతకడానికి వాషింగ్ మెషీన్(Mini Washing Machine) కోసం చూస్తున్నట్లయితే మాత్రం, మీరు మీ బడ్జెట్‌ను కొంచెం పెంచుకోవాలి.. పెద్ద మెషీన్ వైపు వెళ్లాల్సి ఉంటుంది. 

Watch this interesting Video:

Advertisment
Advertisment
తాజా కథనాలు