Mid Cap Funds: ఈ ఫండ్స్ లో పెట్టుబడి మూడేళ్ళలో రెట్టింపు.. వివరాలివే మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్స్ రిస్క్ తో ఉంటాయి. అయితే, దీర్ఘకాలికంగా పెట్టుబడి పెట్టాలంటే ఇది మంచి ఆప్షన్. ఇందులో మిడ్ క్యాప్ ఫండ్స్ గత సంవత్సరం 36%కి పైగా రాబడి ఇచ్చాయి. మిడ్ క్యాప్ ఫండ్స్ లో రిస్క్ ఉన్నప్పటికీ రాబడికి అవకాశం ఉంటుంది. By KVD Varma 18 Nov 2023 in బిజినెస్ Latest News In Telugu New Update షేర్ చేయండి Mid Cap Funds: ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో ఎప్పుడూ సందేహాలు ఉంటూనే ఉంటాయి. డబ్బు ఎక్కడైనా పెట్టుబడి పెట్టడం ఎప్పుడైనా రిస్క్ తోనే ఉంటాయి. అందుకే ఎప్పుడూ రిస్క్ తక్కువ ఉండి మంచి రాబడి ఇచ్చే పెట్టుబడి ఆప్షన్స్.. ఇన్వెస్టమెంట్స్ కోసం ఎంచుకోవాలి. అటువంటి వాటిలో మిడ్ క్యాప్ ఈక్విటీ ఫండ్స్ మంచి ఎంపిక అని చెప్పవచ్చు. ఈ ఫండ్ వర్గం గత 1 సంవత్సరంలో 36% కంటే ఎక్కువ రాబడిని ఇచ్చింది. మీరు రిస్క్ తీసుకోగలిగితే మిడ్ క్యాప్ ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మంచి లాభాలు పొందవచ్చు. ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం. మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ అంటే ఏమిటి? మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్(Mid Cap Funds) అనేది ప్రధానంగా మిడ్ క్యాప్ కంపెనీల షేర్లలో పెట్టుబడి పెట్టే ఫండ్. మార్కెట్ క్యాప్ రూ.5,000 కోట్ల కంటే ఎక్కువ.. రూ.20,000 కోట్ల కంటే తక్కువ ఉన్న వాటిని మిడ్ క్యాప్ కంపెనీలు అంటారు. మార్కెట్ క్యాప్ పరంగా 101 నుంచి 200వ ర్యాంక్ ఉన్న కంపెనీలను కూడా మిడ్ క్యాప్ కంపెనీలు అని అంటారు. మీకు రిస్క్ తీసుకునే సామర్థ్యం ఉంటే మాత్రమే.. లార్జ్ క్యాప్ ఫండ్ల కంటే మిడ్ క్యాప్ ఫండ్స్ ఎక్కువ రిస్క్ కలిగి ఉంటాయి. స్మాల్ క్యాప్ ఫండ్స్ కంటే తక్కువ రిస్క్ ఉంటాయి. అందువల్ల, తమ పెట్టుబడులలో ఓ మోస్తరు రిస్క్ తీసుకోగల వ్యక్తులు మాత్రమే ఈ ఫండ్‌లో పెట్టుబడి పెట్టాలి. ఇది కాకుండా, దీర్ఘకాలానికి ఇది మంచి పెట్టుబడి. అటువంటి పరిస్థితిలో, మీరు దీర్ఘకాలికంగా అంటే 5 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం పెట్టుబడి పెట్టాలనుకుంటే, మీరు వీటిలో పెట్టుబడి పెట్టవచ్చు. Also Read: ఆ యూపీఐ నెంబర్లు డీయాక్టివేట్ అయిపోతాయి..ఎందుకంటే.. పోర్ట్‌ఫోలియోలో 20 నుంచి 30% .. నిపుణుల అభిప్రాయం ప్రకారం 20 నుంచి 30% పోర్ట్‌ఫోలియోను ఇందులో ఇన్వెస్ట్ చేయడం సరైనది. అంటే, మీరు పెట్టుబడి పెట్టడానికి మొత్తం రూ. 100 ఉంటే, మీరు దానిలో రూ.20 నుంచి 30 వరకు పెట్టుబడి పెట్టవచ్చు. దీర్ఘకాలికంగా ఇందులో ఇన్వెస్ట్ చేయడం లాభదాయకంగా ఉంటుంది. SIP ద్వారా పెట్టుబడి మంచిది.. మ్యూచువల్ ఫండ్స్‌లో ఒకేసారి డబ్బు పెట్టుబడి పెట్టే బదులు, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటే SIP ద్వారా పెట్టుబడి పెట్టాలి. SIP ద్వారా, మీరు ప్రతి నెలా నిర్ణీత మొత్తాన్ని పెట్టుబడి పెట్టవచ్చు. ఇది మార్కెట్ హెచ్చుతగ్గుల వల్ల పెద్దగా ప్రభావితం కాదు. అందువల్ల ఇది రిస్క్ ను తగ్గిస్తుంది. Watch this interesting Video: #investments #mutual-funds మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి