మిచౌంగ్ తుపాను ఎఫెక్ట్.. తెలంగాణకు రెడ్ అలెర్ట్.! మిచౌంగ్ తుపాను తెలంగాణపై ప్రభావం చూపనుంది. రేపు మధ్యాహ్నం పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈశాన్య తెలంగాణ జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేశారు. By Jyoshna Sappogula 04 Dec 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Michoung typhoon effect: మిచౌంగ్ తీవ్ర తుపాను ఏపీ ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో నైరుతి బంగాళాఖాతాన్ని ఆనుకుని కొనసాగుతున్న ఈ తుపాను ఏపీ తీరం దిశగా పరుగులు పెడుతోంది. గంటకు 8 కిలోమీటర్ల వేగంతో వాయవ్య దిశగా పయనిస్తోంది. ఇది ప్రస్తుతం నెల్లూరుకు ఆగ్నేయంగా 140 కిలోమీటర్ల చేరువలోకి వచ్చేసింది. ఇది బాపట్ల వద్ద తీరం చేరుతుందన్న నేపథ్యంలో ఏపీ సర్కారు అప్రమత్తమైంది. తుపాను ప్రభావిత జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించింది. Also read: తెలంగాణలో మూడో శాసనసభ ఏర్పాటు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ ఇదిలా ఉండగా..మిచౌంగ్ తుపాను ఎఫెక్ట్ తెలంగాణపై ప్రభావం చూపనుంది. రేపు మధ్యాహ్నం నెల్లూరు-మచిలీపట్నం మధ్య తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాలలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాల నేపథ్యంలో నేడు ఎల్లో అలెర్ట్ జారీ చేయగా రేపు రెడ్ అలర్ట్ ప్రకటించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. రైతులందరూ అలర్ట్ గా ఉండాలని..వరిపంటను ఇప్పుడే కోయకూడదని సూచిస్తున్నారు. ఈదురుగాలులు గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని అప్రమత్తం చేశారు. Also read: రెచ్చిపోయిన కౌశిక్‌రెడ్డి.. సీరియస్ యాక్షన్ తీసుకున్న సీపీ.! మహబూబాబాద్, వరంగల్ , హన్మకొండ జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలతో పాటు ఈదురు గాలులు గంటకు 40 నుండి 50 కి.మీల వేగంతో వీచే అవకాశం ఉందని వెల్లడించారు. మిగిలిన జిల్లాల్లో ఉరుములు, మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. తెలంగాణ వ్యాప్తంగా చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు. దట్టమైన పొగ మంచు ఉండే అవకాశం ఉందని వ్యాఖ్యనిస్తున్నారు. #andhra-pradesh #telangana మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి