/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/FotoJet-1-jpg.webp)
చంద్రబాబుపై ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చిన మహాత్ముని జన్మదినాన్ని అబాసుపాలు చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గాంధీ జయంతి రోజు చంద్రబాబు దీక్ష చేయడం అంటే మహాత్ముని జయంతి విలువలను దిగజార్బడమే అవుతుందన్నారు. అవినీతికి పాల్పడి అడ్డంగా దొరికిన దొంగ చంద్రబాబు అన్నారు. న్యాయ స్థానాలు చంద్రబాబును దొంగగా ప్రకటించాయన్నారు. న్యాయస్థానాలు దొంగగా ప్రకటించిన వ్యక్తి జైల్లో దీక్ష చేయడం సిగ్గుచేటన్నారు. అంతేకాకుండా చంద్రబాబుకు మద్దతుగా టీడీపీ శ్రేణులు కంచాలు మోగించడం ఏంటని మేరుగు నాగార్జున ప్రశ్నించారు.
టీడీపీ అంటేనే ఓ పిచ్చి పట్టిన పార్టీ అన్న ఆయన.. ఆ పార్టీ నేతలు చంద్రబాబును జైల్లో వేయడంతో ఏం చేయాలో తోచక పిచ్చి పట్టినట్లు వ్యవహరిస్తున్నారన్నారు. కంచాలు మోగించడం కూడా వారి పిచ్చిలో భాగమే అన్నారు. చంద్రబాబుకు మద్దతుగా ఇంట్లో ఆడవాళ్లు సైతం దీక్షలు అంటూ డ్రామాలు ఆడుతున్నారని మంత్రి ఘాటు వ్యాఖ్యలు చేశారు. 175 నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులను నిలబెట్టలేని వ్యక్తి జైల్లో దొంగ దీక్ష చేస్తున్నారని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ పార్టీ డిపాజిట్లు కూడా దక్కించుకోలేదని టీడీపీ నేతలు అంటున్నారన్న ఆయన.. తమ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయే రానున్న ఎన్నికల్లో తెలుస్తోందన్నారు.
మరోవైపు పవన్ కళ్యాణ్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన మేరుగు నాగార్జున.. వపన్ కళ్యాణ్ గతంలో తాను ముఖ్యమంత్రి అవుతానని రాజకీయాల్లోకి వచ్చినట్లు తెలిపారని ఆయన గుర్తు చేశారు. కానీ ఇప్పుడు పవన్ తనకు ముఖ్యమంత్రి పదవి అవసరం లేదని అంటున్నారంటే అతను ఎంతకు అమ్ముడు పోయాడో తెలుస్తోందని విమర్శించారు. పవన్ రాజకీయాల్లో సినిమా డైలాగులు వేస్తున్నారన్న ఆయన.. రాజకీయాల్లో సినిమా డైలాగులు పనికి రావని, ఇలాంటి డైలాగులు వేసే గత ఎన్నికల్లో పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓటమి పాలయ్యారని గుర్తు చేశారు. రానున్న ఎన్నికల్లో పవన్ మళ్లీ ఓడిపోవడం ఖాయమని మేరుగు నాగార్జున స్పష్టం చేశారు.
Aghori: సిగరేట్లు, మందు తాగుతా.. శృంగారం మాత్రం.. అఘోరి సంచలనం!
అఘోరికి సంబంధించి మరిన్ని భయంకర నిజాలు బయటపడ్డాయి. వర్షణి ఇంట్లో ఆశ్రయం పొందినపుడు మద్యం, సిగరేట్లు తాగినట్లు ఒప్పుకుంది. లైంగిక వేధింపులు, కోట్ల రూపాయల ఆస్తుల విషయం మాత్రం అంతా అబద్ధమని చెప్పింది.
Aghori: అఘోరికి సంబంధించి మరిన్ని భయంకర నిజాలు బయటపడ్డాయి. వర్షణి ఇంట్లో ఆశ్రయం పొందినపుడు మద్యం, సిగరేట్లు తాగినట్లు ఒప్పకుంది. లైంగిక వేధింపులు, కోట్ల రూపాయల ఆస్తుల విషయం మాత్రం అంతా అబద్ధమని చెప్పింది.
బలవంతంగానే ఆశ్రయం పొందాను..
ఈ మేరకు వర్షిణి అన్న విష్ణు ఆరోపణలపై RTVతో మాట్లాడిన అఘోరి.. తనకు కావాలనే చెడ్డపేరు తిసుకొస్తున్నారని తెలిపింది. వాళ్ల ఇంట్లో ఉన్నప్పుడు తన డబ్బులతోనే భోజనం చేశానని, వారిని ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయనివ్వలేదని చెప్పింది. తన కారు రిపేర్ వస్తే విష్ణు తన దగ్గరకు వచ్చి ఇంటికి రమ్మని ఆహ్వానించాడని, బలవంతం పెడితేనే తాను ఆశ్రయం పొందేందుకు వెళ్లినట్లు అఘోరి వివరించింది. ఎవరింటికైనా వెళితే భిక్ష చేసుకుని వెళ్లిపోతానని చెప్పింది. తాను కారులోనే పడుకుంటానని, శ్మశానంలోనే పూజలు చేసుకుంటానని తెలిపింది.
Also read : ఏడడుగుల కండక్టర్కు సీఎం రేవంత్ రెడ్డి బంపరాఫర్!
ఇక డబ్బుల వ్యవహారంలో విష్ణు పూర్తిగా తప్పుదారి పట్టిస్తున్నాడని చెప్పింది. తన కారులో లక్షల్లో క్యాష్ ఉందని, కోట్ల రూపాయల్లో ఆస్తులున్నాయనేది పూర్తిగా అవాస్తమని తెలిపింది. విష్ణు తనను, వర్షిణిని రోడ్డు మీదకు లాగినట్లు చెప్పాడు. వర్షిణి తన ఇష్టంగానే వచ్చిందని, సాధన నేర్చుకుంటానని చెబితే ఆమె ఫ్యామిలీ బలవంత పెట్టి తీసుకెళ్లిపోయారని అఘోరి చెబుతోంది. ఇక వర్షిని రూ.3 కోట్లకు ఇస్తాననే మాట అవాస్తవం అన్నారు. తనకు పెట్రోల్ డబ్బులే లేవని, ముప్పై వేలు కూడా లేవని, అలాంటిది మూడు కోట్లు ఎలా ఇస్తానంటూ అఘోరి క్లారిటీ ఇచ్చింది.
Also read : బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. త్వరలో తులం రూ.56 వేలకు?
Aghori for Varshini | vishnu | telugu-news | today telugu news
Ap Aqua -Trump Effect: ఏపీ రైతులపై ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్.. చంద్రబాబు కీలక నిర్ణయాలు
ఏపీ, తెలంగాణలో భారీ వర్ష సూచన.. ఆ జిల్లాల్లో పిడుగుల వర్షం
Telangana: తెగ తాగేసిన మందు బాబులు..గతేడాది కంటే తెలంగాణలో భారీగా పెరిగిన మద్యం అమ్మకాలు!
Horoscope: ఈ రాశి వారు నేడు ఖర్చుల విషయంలో జాగ్రత్త..!
Trump-China: ఆ నిర్ణయం వెంటనే వెనక్కి తీసుకోండి..లేదంటే...చైనాకు ట్రంప్ హెచ్చరికలు!