HBD Ram Charan Teja : మెగా పవర్ నుంచి గ్లోబల్ స్టార్.. రామ్ చరణ్ సినీ ప్రస్థానం ఇదే! మెగాస్టార్ వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన రామ్ చరణ్ తేజ్ నటన రాదు..ఎక్స్‌ప్రెషన్స్ లేవు... అని విమర్శించిన వారి చేతనే యాక్టింగ్ అంటే చరణ్ లా ఉండాలి అనే స్థాయికి ఎదిగాడు.ఎప్పటికప్పుడు తనలోని నటుడ్ని మరింతగా ప్రేక్షకుల ముందుకు తీసుకుని వస్తూ తానేంటో చూపిస్తున్నాడు. By Bhavana 27 Mar 2024 in సినిమా వైరల్ New Update షేర్ చేయండి HBD Charan : రామ్ చరణ్ తేజ్(Ram Charan Tej) కొణిదెల.. మెగాస్టార్(Megastar) వారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమకు ''చిరుత''(Chirutha) సినిమాతో పరిచయం అయ్యాడు. మొదటి సినిమాలోనే తన డైలాగ్ డెలివరీతో అందర్ని ఆకట్టుకున్నాడు. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. అయితే పాత్రకు సంబంధం లేకుండా హవాభావాలు ఇస్తున్నాడంటూ కెరీర్ మొదట్లో విమర్శలు ఎదుర్కొన్నాడు. మెగాస్టార్ కుమారుడు కదా అని అభిమానులేమి నెత్తిన పెట్టుకోలేదు. మొదటి చిత్రమే పూరి జగన్నాథ్(Puri Jagannath) లాంటి మాస్ యాక్షన్ డైరెక్టర్ చేతిలో పడినప్పటికీ చరణ్ కొన్ని విమర్శలు ఎదుర్కొక తప్పలేదు. చిరుత సినిమాలో ఎక్స్‌ప్రెషన్స్ బాలేదు అన్నవారు... చరణ్ డ్యాన్స్ లకు ఫిదా అయ్యారు.డ్యాన్స్ లో మాత్రం చిరంజీవిని మించి పోయాడనే అన్నారు. చిరుత సినిమా తరువాత చరణ్ రాజమౌళి చేతిలో పడ్డాడు. మగధీర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా చూసిన వారంతా కూడా చిరంజీవి కొడుకు చరణ్ అని చెప్పడం కాకుండా చరణ్ తండ్రి మెగా స్టార్ అంటూ పొగిడేశారు. రాజమౌళి(Rajamouli) చేతిలో పడిన తరువాత చరణ్ ఆ సినిమాలో ఓ పక్క రాజుల కాలం నాటి వ్యక్తిగా... మరోపక్క మోడ్రన్ యువకుడిగా నటించి సినీ లవర్స్ ని థియేటర్లకు క్యూ కట్టించాడు. ఈ సినిమాలో కాలభైరవ పాత్ర ఇప్పటికీ అందరికీ కళ్ల ముందు కదులుతుందంటే అతి శయోక్తి కాదు. సినిమా సినిమాకి తనలోని నటుడ్ని బయటకు తీస్తూ మెగా పవర్ స్టార్(Mega Power Star) అయిపోయాడు. ఆ తరువాత సినిమా సినిమాకి తనలోని నటుడ్ని బయటకు తీసుకుని వస్తూ అభిమానులకు ఏం కావాలో...ఎలా కావాలో తనను తానే మార్చుకున్నాడు చరణ్. డ్యాన్స్‌లు, ఫైటులు చిరంజీవిని మించి చేసి మెగాస్టార్ వారసుడు అనిపించుకున్నాడు. కెరీర్ తొలినాళ్లలో చరణ్ సినిమాలన్ని కూడా ఒకే మూస పద్దతిలో నడిచాయి. ఆ తరువాత చరణ్ తన లోని కొత్త కొత్త వెరియేషన్స్ ని బయటకు తీసి నటుడిగా తాను అభిమానులను ఎలా అలరించగలడో చూపించాడు. అయినప్పటికీ కూడా చరణ్ కొత్త ప్రయోగాలంటే భయపడతాడు అని ఇండస్ట్రీలో టాక్ మొదలైంది. దీంతో దర్శకుడు సుకుమార్ లాంటి వ్యక్తి చేతిలో పడి రంగస్థలం చేశాడు. అందులో చిట్టిబాబు గా ఆయన చేసిన యాక్షన్ ఎన్నో అవార్డులను తెచ్చి పెట్టింది. కథానాయకుడికి చెవుడు అనే కాన్సెప్ట్ కూడా ప్రేక్షకులకు కొత్తగా ఉంది. దీంతో ఈ సినిమాను ప్రేక్షకులు బాగా ఆదరించారు. చిరుత, మగధీరతో ముందుకు దూసుకుపోతున్న చరణ్ కి ఆరెంజ్ సినిమా ఒక్కసారిగా బ్రేక్ వేసింది. చరణ్ ఖాతాలో తొలిప్లాప్ పడింది. ఆ తరువాత చరణ్ బాలీవుడ్ కి వెళ్లి అక్కడ కూడా పరాజయాన్ని మూట గట్టుకున్నాడు. ఆ తరువాత తెలుగులో బ్రూస్లీ కూడా చరణ్ కు ఎదురు దెబ్బే అని చెప్పవచ్చు. దాని తరువాత వచ్చిన ధృవ సినిమా విజయాన్ని అందుకుంది. ఈ క్రమంలోనే బోయపాటి డైరెక్షన్ లో చేసిన వినయ విధేయ రామ ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది. దీంతో చరణ్ డల్ అయ్యాడా అనే సందేహం ప్రేక్షకులకు వచ్చింది. కానీ మళ్లీ రాజమౌళి చేతిలో పడ్డాడు. ఆర్‌ఆర్‌ఆర్(RRR) వంటి బ్లాక్ బస్టర్ సినిమా తీసి గ్లోబల్ స్టార్ (Global Star) గా ఎదిగిపోయాడు. యావత్ ప్రపంచాన్ని తన వైపు చూసేలా చేసుకున్నాడు. ఈ సినిమాలో తారక్ తో కలిసి నటించి మంచి మార్కులు కొట్టేశాడు. నాటు నాటు అంటూ స్టెప్పులేసి ఆస్కార్ అవార్డుని ఈజీగా తెలుగు చిత్ర పరిశ్రమకు అందించేశాడు. ఆర్‌ఆర్‌ఆర్ నుంచి నాటు నాటు పాట విడుదలైన తొలి నాళ్లలో ప్రతి ఒక్కరి నోట్లో , ఇంట్లో, మొబైల్స్ లో ఎక్కడ చూసినా ఈ పాటే వినిపించేది. ఇప్పటికీ ఈ పాటకు ఉన్న క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఆ తర్వాత తండ్రితో కలిసి ఆచార్య సినిమాలో చేశాడు. ఈ సినిమాలో చరణ్ చనిపోతాడు. ఈ చిత్రంతో కలిపి చరణ్ చనిపోయే సీన్లు చేసిన సినిమాలు మూడు... మగధీర, ఎవడు, ఆచార్య. సక్సెస్‌ఫుల్ గా కెరీర్ దూసుకుపోతున్న తరుణంలో ఇలాంటి పాత్రలకు చరణ్ ఒప్పుకున్నాడంటే నిజంగా సాహసమనే చెప్పాలి. ఇక్కడికి 14 సినిమాలను పూర్తి చేసుకున్న చరణ్... తన 15 వ సినిమాను కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తో కలిసి గేమ్ ఛేంజర్(Game Changer) అనే సినిమాని చేస్తున్నాడు. ఆ తరువాత ఆర్సీ 16ని కూడా చరణ్ ఎప్పుడో అనౌన్స్ చేసేశాడు. అది ఉప్పెన ఫేం డైరెక్టర్ బుచ్చిబాబు సానతో కలిసి, ఆలనాటి అందాల తార శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ తో నటిస్తున్నాడు. ఈ సినిమాకి పూజా కార్యక్రమాలు కూడా మొన్ననే మొదలైయ్యాయి. ఇది ఇంకా సెట్స్ మీదకు వెళ్లకుండానే... చరణ్ మరోసారి సుకుమార్ తో కలిసి నటిస్తున్నట్లు ప్రకటించారు. ఆర్సీ 17 గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. నటన రాదు.. ఎక్స్‌ప్రెషన్స్ లేవు... అని విమర్శించిన వారి చేతనే యాక్టింగ్ అంటే చరణ్ లా ఉండాలి అనే స్థాయికి ఎదిగాడు. అపోలో హాస్పిటల్స్ వారసురాలు ఉపాసన(Upasana) ని ప్రేమించి వివాహం చేసుకుని గతేడాది తండ్రి కూడా అయ్యాడు. మెగాస్టార్ కుటుంబం నుంచి వచ్చినప్పటకీ చరణ్ సినీ కెరీర్ ఏమి పూలబాటలాగా సాగలేదు.... కొన్ని చిత్రాలు పరాజయాలను కూడా మూటగట్టుకున్నాయి. అయినప్పటికీ చరణ్ మాత్రం వెనకడుగు వేయలేదు. ఎప్పటికప్పుడే తనలోని నటుడ్ని మరింతగా ప్రేక్షకుల ముందుకు తీసుకుని వస్తూ తానేంటో చూపిస్తున్నాడు... మెగా పవర్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్ గా ఎదిగిన చరణ్ బర్త్ డే నేడు... ఈ సందర్భంగా ఆర్టీవీ (RTV) హృదయ పూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు (BirthDay Wishes) తెలుపుతూ...రానున్న సినిమాలు కూడా మంచి విజయాన్ని అందుకోవాలని కాంక్షిస్తుంది. Also Read : కుటుంబంతో కలిసి తిరుమలకు రామ్ చరణ్..! #ram-charan #hbd-ram-charan #ram-charan-tej మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి