మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఈ రోజు కుటుంబ సభ్యులతో కలిసి వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కోడె మొక్కు తీర్చుకున్నారు. ఆలయ నిర్వాహకులు రఘునందన్ రావుకు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వదించారు.
Accident: దారుణం.. ఆర్టీసీ బస్సు కింద పడి మహిళ మృతి
హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌లో మంగళవారం దారుణం జరిగింది. ఓ మహిళపై ఆర్టీసీ బస్సు వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. బషీర్‌బాగ్ నుంచి అబిడ్స్ వైపు తన కూతురుతో కలిసి స్కూటీపై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌లో మంగళవారం దారుణం జరిగింది. ఓ మహిళపై ఆర్టీసీ బస్సు వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఓ మహిళ బషీర్‌బాగ్ నుంచి అబిడ్స్ వైపు తన కూతురుతో కలిసి స్కూటీపై వెళ్తోంది. అయితే గోల్కొండ హ్యాండిక్రాఫ్ట్స్ ఎదుటు స్కూటీ అదుపుతప్పడంతో ఇద్దరు కింద పడ్డారు. ఆ మహిళ తలపై నుంచి బస్సు చక్రాలు వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. ఆమె కుమార్తెకు స్వల్ప గాయాలయ్యాయి.
ఇటీవలే హైదరాబాద్‌లోని ఇలాంటి ఘటనే జరిగింది. బాలానగర్‌లో ఆర్టీసీ బస్సు కింద పడి బైక్ ఓ వాహనాదారుడు మృతి చెందాడు. ఈనెల 13వ తేదీన ట్రాఫిక్ పోలీసులు తనిఖీల్లో భాగంగా బైక్‌ను ఆపేందుకు యత్నించారు. అయితే బైక్ అదుపు తప్పింది. దీంతో వాహనాదారుడు కిందపడ్డాడు. ఇదే సమయంలో వచ్చిన ఒక్కసారిగా వచ్చిన ఆర్టీసీ బస్సు అతడి తలపై నుంచి వెళ్లింది.
దీంతో ఆ బైక్ వాహనాదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఆ వ్యక్తి మృతి చెందాడని వాహనాదారులు ఆందోళనకు దిగారు. దీంతో జీడిమెట్ల నుంచి బాలానగర్ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. పెద్దఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. రోడ్డుపై పలువురు వాగ్వాదానికి దిగారు. చివరికి పోలీసులు వాళ్లని చెదరగొట్టారు. ఆ తర్వాత ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.