Kerala : విరిగిపడ్డ కొండ చరియలు.. ఏడుగురి మృతి..!

కేరళలోని వయనాడ్‌ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. మెప్పాడి సమీపంలో మంగళవారం తెల్లవారుజామున భారీ కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఇంకా వందలాది మంది ప్రజలు ఆ భారీ కొండ చరియల కింద చిక్కుకుని ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు.

New Update
Wayanad Landslides: వాయనాడ్ లో మాటలకందని విషాదం.. 42కు పెరిగిన మృతుల సంఖ్య!

Wayanad : కేరళ (Kerala) లోని వయనాడ్‌ జిల్లా (Wayanad District) లో ఘోర ప్రమాదం జరిగింది. మెప్పాడి సమీపంలో మంగళవారం తెల్లవారుజామున భారీ కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఇంకా వందలాది మంది ప్రజలు ఆ భారీ కొండ చరియల (Landslides) కింద చిక్కుకుని ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు.

ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే... కేరళ విపత్తు నిర్వహణ దళం , అగ్నిమాపక బృందం, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు కొండచరియలు విరిగిపడిన స్థలానికి చేరుకుని సహయక చర్యలు మొదలు పెట్టాయి. ఈ క్రమంలోనే చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా పోలీసులు, సహాయక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం అక్కడ భారీ వర్షాలు కురుస్తుండటంతో సహాయక చర్యలు అంతరాయం కలుగుతున్నట్లు అధికారులు వివరించారు.

Also read: పట్టాలు తప్పిన హౌరా-ముంబై ఎక్స్‌ప్రెస్‌

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

ఎంత దారుణంగా చంపారంటే.. బయటకు వచ్చిన ఉగ్రదాడి ఫస్ట్ వీడియో!

జమ్మూ కాశ్మీర్‌లోని ఉగ్రవాదులు పర్యాటకులపై కాల్పులు జరుగుతున్న వీడియో బయటకు వచ్చింది. కేవలం పర్యాటకులను మాత్రమే టార్గెట్ చేసుకుని కాల్పులు జరిపారు. అందులో కూడా మతం, పేర్లు అడిగి మరి కాల్పులు జరిపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

New Update

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 28 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే పహల్గామ్‌లో ఉగ్రవాదులు పర్యాటకులపై కాల్పులు జరుగుతున్న వీడియో బయటకు వచ్చింది. కేవలం పర్యాటకులను మాత్రమే టార్గెట్ చేసుకుని కాల్పులు జరిపారు. అందులో కూడా మతం, పేర్లు అడిగి మరి కాల్పులు జరిపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ఇది కూడా చూడండి: TG Crime: కోడలిపై మోజుతో కొడుకును లేపేసిన తండ్రి.. రోకలి బండతో కొట్టి చంపి!

ఇది కూడా చూడండి: Betting Apps Pramotion Case : ప్రభుత్వం సంచలన నిర్ణయం..సెలబ్రిటీ బెట్టింగ్ యాప్స్ కేసు సీఐడీకి బదిలీ

మొత్తం 28 మంది..

ఇదిలా ఉండగా మినీ స్విట్జర్లాండ్‌గా పేరుపొందిన పహల్గాంలోని బైసారన్‌ ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం ఉగ్రదాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో 28 మంది టూరిస్టులు మృతి చెందగా.. మరో 20 మందికి పైగా గాయాలపాలయ్యారు. మృతుల్లో ఇద్దరు విదేశీయులు కూడా ఉన్నారు. వాళ్లలో ఒకరు నేపాలీ కాగా మరొకరు యూఏఈ. మిగతావారు భారత్‌లోని మహారాష్ట్ర, గుజరాత్, యూపీ, హర్యానా, బీహార్, కర్ణాటక రాష్ట్రాలకు చెందినవారు ఉన్నారు.  

ఇది కూడా చూడండి: Indus River Agreement: 64 ఏళ్ళ ఒప్పందానికి స్వస్తి..ఎడారిగా మారనున్న పాకిస్తాన

ఇది కూడా చూడండి: Sunstroke: వడదెబ్బకు ఏడుగురు మృతి.. మరో రెండ్రోజులు వడగాల్పులు

Advertisment
Advertisment
Advertisment