Tiger Nageswara Rao: హేమలత లవణంగా రేణు దేశాయ్

మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు వంశీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌ క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘టైగర్ నాగేశ్వరరావు’ అక్టోబర్ 20న గ్రాండ్‌గా విడుదల కానుంది. గ్రిప్పింగ్ టీజర్, చార్ట్‌బస్టర్ పాటలతో  టైగర్ నేషనల్ వైడ్ గా హ్యూజ్ బజ్ క్రియేట్ చేస్తోంది.

New Update

తాజాగా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న రేణు దేశాయ్ ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు మేకర్స్. ఈ చిత్రంలో హేమలత లవణం అనే స్ఫూర్తిదాయకమైన పాత్రలో కనిపించబోతున్నారు రేణు దేశాయ్. ఓ పసిబిడ్డని పట్టుకున్నట్లు కనిపిస్తున్న ఫస్ట్ లుక్ పోస్టర్ చాలా ఆసక్తికరంగా ఉంది.

రేణుదేశాయ్ రీఎంట్రీ సినిమా ఇది. బద్రితో ఆమె టాలీవుడ్ కు పరిచయమైంది. ఆ తర్వాత జానీ అనే సినిమా చేసింది. మధ్యలో ఓ తమిళ సినిమా చేసింది. అక్కడితో కెరీర్ కు ఫుల్ స్టాప్ పెట్టి పవన్ కల్యాణ్ ను పెళ్లి చేసుకుంది. ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. ఆ తర్వాత విబేధాలొచ్చి పవన్-రేణు విడిపోయారు. మళ్లీ ఇన్నాళ్లకు టైగర్ నాగేశ్వరరావు సినిమాతో సినిమాల్లోకి వచ్చింది రేణు దేశాయ్.

అక్టోబర్ 3న ఈ చిత్రం ట్రైలర్‌ని రిలీజ్ చేయనున్నారు మేకర్స్. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున ఈ చిత్రం నుంచి ఇప్పటికే 2 పాటలు బయటకొచ్చాయి. త్వరలోనే మిగతా పాటల్ని కూడా విడుదల చేయబోతున్నారు. నూపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ ఈ చిత్రంలో హీరోయిన్స్.

ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ ఆర్‌ మదీ ఐఎస్‌సి, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్. శ్రీకాంత్ విస్సా డైలాగ్ రైటర్ కాగా, మయాంక్ సింఘానియా సహ నిర్మాత. రవితేజ కెరీర్ లోనే ప్రాపర్ పాన్ ఇండియా సినిమా ఇది. ఒకేసారి సౌత్ లోని అన్ని భాషలతో పాటు, హిందీలో ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాపై రవితేజ చాలా హోప్స్ పెట్టుకున్నాడు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Lakshmi Rai: బికినీ అందాలతో రెచ్చిపోయిన హీరోయిన్!

నటి లక్ష్మి రాయ్ బికినీ అందాలతో రెచ్చిపోయింది. తాజాగా బికినీలో ఈ బ్యూటీ షేర్ చేసిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలను మీరు చూశారా?

New Update
Advertisment
Advertisment
Advertisment