Marri Janardhan Reddy బీఆర్‌ఎస్‌ కు పెద్ద షాక్‌..మర్రి జంప్‌!

మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్థన్‌ రెడ్డి బీఆర్‌ఎస్‌ కు గుడ్‌ బై చెప్పేందుకు సిద్దమయ్యారు.పార్లమెంట్ టికెట్ ఆశిస్తూ ఆయన కాంగ్రెస్‌ పార్టీతో ఇప్పటికే మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తుంది.కాంగ్రెస్‌ పార్టీ నుంచి మల్కాజ్‌ గిరి లోక్‌ సభ ఎంపీ స్థానానికి పోటీ చేసేందుకు మర్రి ప్రయత్నాలు చేస్తున్నారు.

New Update
Marri Janardhan Reddy బీఆర్‌ఎస్‌ కు పెద్ద షాక్‌..మర్రి జంప్‌!

Marri Janardhan Reddy: బీఆర్‌ఎస్‌ (BRS) కు మరో పెద్ద షాక్‌ తగిలింది...ఇప్పటికే కారు దిగి చాలా మంది నేతలు హస్తం గూటికి చేరుతున్న తరుణంలో మరో నేత కారు దిగడానికి సిద్దంగా ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్థన్‌ రెడ్డి (Marri Janardhan Reddy) బీఆర్‌ఎస్‌ కు గుడ్‌ బై చెప్పేందుకు సిద్దమయ్యారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో ఓటిమి పాలైన ఆయన రానున్న లోక్‌ సభ (LokSabha) ఎన్నికల్లో పోట చేసేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు.

అందుకే మర్రి మల్కాజ్‌ గిరి నుంచి పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. పార్లమెంట్ టికెట్ ఆశిస్తూ ఆయన కాంగ్రెస్‌ పార్టీతో ఇప్పటికే మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తుంది. ఒకవేళ కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ కానీ మర్రికి వస్తే ఆయన హస్తం పార్టీ నుంచి పార్లమెంట్‌ బరిలోకి దిగబోతున్నారు. అయితే మర్రి పార్టీ మారుతున్నారన్న సమాచారంతో నాగర్‌ కర్నూలు జిల్లా బీఆర్‌ఎస్‌ నేతలు అయోమయంలో పడ్డారు.

కార్యకర్తలు, అనుచరులతో మర్రి జనార్థన్‌ రెడ్డి మరి కాసేపట్లో సమావేశం కానున్నారు. ఈ సమావేశం తరువాత ఆయన పార్టీ మార్పు గురించి స్పష్టత రానుంది. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మర్రి జనార్థన్‌ రెడ్డి నాగర్‌ కర్నూలు నియోజకవర్గం నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు.

ఆయన పై కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీ చేసిన కూచుకుళ్ల రాజేష్‌ రెడ్డి 87, 161 ఓట్లతో మెజారిటీతో గెలిచారు. ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పటికీ కూడా రానున్న లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజ్‌ గిరి ఎంపీ టికెట్‌ ఆశిస్తున్నారు. బీఆర్‌ఎస్‌ నుంచి ఎంపీ టికెట్‌ కష్టమేనని భావిస్తున్ందుకే ఆయన పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

Also read: పేటియం పని చేస్తూనే ఉంటుంది: పేటీఎం సీఈవో!

Advertisment
Advertisment
తాజా కథనాలు