ఎన్నికల వేళ భద్రాద్రి జిల్లాలో కలకలం.. 25 మందిని కిడ్నాప్ చేసిన మావోయిస్టులు..!!

ఎన్నికల వేళ భద్రాద్రి జిల్లాలో కలకలం రేగింది. 25మంది వ్యాపారులను మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. తమకు వ్యతిరేకంగా పనిచేస్తూప పోలీసులకు సహకరిస్తే హతమారుస్తామంటూ వార్నింగ్ ఇచ్చి వదిలిపెట్టారు.

New Update
ఎన్నికల వేళ భద్రాద్రి జిల్లాలో కలకలం.. 25 మందిని కిడ్నాప్ చేసిన మావోయిస్టులు..!!

ఎన్నికల నేపథ్యంలో ఛత్తీస్ గఢ్, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దులో మావోయిస్టుల కదలిక కలకలం రేపింది. 25మంది వ్యాపారులను మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. తమకు వ్యతిరేకంగా పనిచేస్తూ పోలీసులకు సహకరిస్తే చంపేస్తామంటూ వార్నింగ్ ఇచ్చి వదిలిపెట్టారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలానికి చెందిన 25మంది వ్యాపారులను బుధవారం 7గంటల సమయంలో ఛత్తీస్ గఢ్ లోని సుక్నా జిల్లా గొల్లపల్లిలో జరిగే మార్కెటుకు ఆటోలు, ద్విచక్ర వాహనాల్లో వ్యాపారులు బయలుదేరారు. భద్రాద్రి కొత్తగూడెం, సుక్మా జిల్లాల సరిహద్దులో ఉన్న తాళ్లగూడెం, గొల్లపల్లి క్రాస్ రోడ్డ దగ్గర మావోయిస్టులు వాహనాలను అడ్డుకుని వ్యాపారులను కిందికి దించారు. ఆటోలు, వాహనాల్లోని నిత్యావసర సరుకులు, మద్యం సీసాలను విసిరిపారేశారు. వారి మొబైల్ ఫోన్లను లాక్కొని అటవీ ప్రాంతాలకు తీసుకెళ్లారు.

వారిలో కొంతమంది మహిళలు కూడా ఉణ్నారు. నిత్యావసర సరుకులు సరఫరా చేస్తూ పోలీసులకు ఇన్ ఫార్మర్లుగా పనిచేస్తున్నారంటూ ఆరోపిస్తూ వారిపై దాడికి దిగారు. అయితే అలాంటిదేమీ చేయడం లేదని తాము వ్యాపారం చేసుకుంటున్నామని..తమను వదిలిపెట్టమని వేడుకోవడం వారిని వదిలిపెట్టినట్లు తెలుస్తోంది. తమకు వ్యతిరేకంగా పనిచేస్తే చంపేస్తామంటూ బెదిరింపులకు దిగారు. అదే సమయంలో మరో ఇద్దరు వ్యాపారులు వాహనాల్లో పోలీసులకు సరుకులు తీసుకెళ్తున్నారు.

ముందు వెళ్లిన వారిని మావోలు అపహరించినట్లు తెలుసుకున్న వ్యాపారులు తమ వాహనాలను వెనక్కి తిప్పారు. వారిని గమనించిన మావోయిస్టులు వారివెంటపడ్డారు. దీంతో వారు తప్పించుకుని పారిపోయారు. ఈ క్రమంలో ఇద్దరు మావోయిస్టులు కిందపడటంతో వారికి గాయాలయ్యాయి. తప్పించుకున్న వ్యాపారులు పోలీస్ ఇన్ ఫార్మర్లుగా మారారని..వారు కనిపిస్తే హతమార్చుతామంటూ వార్నింగ్ ఇచ్చారు మావోయిస్టులు. ఈ సంఘటనతో ఒక్కసారి ఆందోళన నెలకొంది.

ఇది  కూడా చదవండి: హైదరాబాద్ నుంచి అదనపు బస్సులు నడపకపోవడంతో ఎంజీబీఎస్ లో ప్రయాణికుల పాట్లు…!!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pahalgam terror attack : ఉగ్రదాడి.. ముస్లింలకు అసదుద్దీన్ ఒవైసీ కీలక పిలుపు

ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ముస్లింలకు కీలక పిలుపునిచ్చారు. రేపు అంటే  ఏప్రిల్ 25వ తేదీ శుక్రవారం రోజున ముస్లింలంతా శుక్రవారం నమాజ్ సమయంలో నల్ల రిబ్బన్లు ధరించి నమాజ్ చేయాలని కోరారు

New Update
Wear black bands

Wear black bands

పహల్గాంలో టెర్రరిస్టులు సృష్టించిన విధ్వంసలో 26మంది టూరిస్టులు చనిపోయిన నేపథ్యంలో ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ముస్లింలకు కీలక పిలుపునిచ్చారు. రేపు అంటే  ఏప్రిల్ 25వ తేదీ శుక్రవారం రోజున ముస్లింలంతా శుక్రవారం నమాజ్ సమయంలో  నల్ల రిబ్బన్లు ధరించి నమాజ్ చేయాలని సోషల్ మీడియా ద్వారా కోరారు. ఉగ్రదాడికి నిరసనగా దీన్ని పాటించాలని చెప్పారు.

అన్యాయానికి వ్యతిరేకంగా

 " కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో పాకిస్తాన్‌కు చెందిన లష్కరే తోయిబా (ఎల్‌ఇటి) ఉగ్రవాదులు మన దేశ ప్రజలను ఎలా చంపారో మీ అందరికీ తెలుసు. చాలా మంది గాయపడి ప్రాణాల కోసం పోరాడుతున్నారు. ఈ ఉగ్రవాద చర్యకు, అన్యాయానికి వ్యతిరేకంగా, రేపు (శుక్రవారం) మీరు నమాజ్ కోసం మసీదులకు వెళ్ళేటప్పుడు నల్లటి బ్యాండ్ ధరించి వెళ్లాలని నేను మీ అందరినీ అభ్యర్థిస్తున్నాను " అని ఒవైసీ అన్నారు.   భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో ఒవైసీ ఈ విజ్ఞప్తి చేయడం గమనార్హం.  కాగా ఉగ్రదాడిని తీవ్రంగా పరిగణించిన కేంద్రం తదుపరి కార్యాచరణపై కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించగా అందులో ఒవైసీ పాల్గొన్నారు. 

Also Read :  ఆయుధాలతో శ్రీనగర్‌లోకి భారీగా విదేశీయులు.. ఎవిడెన్స్ ఉన్నాయంటున్న పాక్

Also read : Mukesh Ambani : ఎంత ఖర్చైనా భరిస్తా.. వారికి ఫ్రీ ట్రీట్మెంట్.. ముఖేష్ అంబానీ సంచలన ప్రకటన!

Advertisment
Advertisment
Advertisment