Maoist : కోవర్టులపై మావోయిస్టుల డేగ కన్ను.. మేడ్చల్ జిల్లా వాసి హత్య!

కోవర్టులపై మావోయిస్టు పార్టీ ప్రత్యేక నిఘా పెట్టింది. పోలీసు బలగాలకు తమ సమాచారం అందిస్తున్న వారిని హతమారుస్తోంది. కోవర్టుగా మారిన సెంట్రల్ కమిటీ ప్రొటెక్షన్ ఆర్మీ కమాండర్‌ పల్లెపాటి రాధ అలియాస్ నీల్సోను చంపేసినట్లు లేఖ విడుదల చేసింది. రాధ మేడ్చల్ జిల్లా కాప్రా వాసి.

New Update
Maoist : కోవర్టులపై మావోయిస్టుల డేగ కన్ను.. మేడ్చల్ జిల్లా వాసి హత్య!

Maoist Special Focus On Covert Radha Murder : మావోయిస్టులు (Maoists) కోవర్టులపై ప్రత్యేన నిఘా పెట్టారు. పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు, దళాల సమాచారంతో పలువురు పోలీసులకు చిక్కడంతో అప్రమత్తమయ్యారు. ఇందులో భాగంగానే పోలీసులకు సహకరిస్తున్న కోవర్టులను హతమార్చేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల భద్రతాబలగాలకు సమాచారం అందిస్తున్న కోవర్టులను గుర్తించిన మావోయిస్టు పార్టీ.. సెంట్రల్ కమిటీ ప్రొటెక్షన్ ఆర్మీ కమాండర్‌గా పనిచేస్తున్న పల్లెపాటి రాధ అలియాస్ నీల్సోను అంతమొందించింది. చర్ల మండలం చెన్నాపురం సమీపంలో నీల్సోను చంపి ఈ హత్య తామె చేసినట్లు మావోయిస్టుపార్టీ లేఖ విడుదల చేసింది.

నర్సింగ్ విద్య పూర్తి చేసి విప్లవోద్యమంలోకి.. 
మేడ్చల్ జిల్లా (Medchal District) కాప్రాకు చెందిన పల్లెపాటి రాధ అలియాస్ నీల్సో నర్సింగ్ విద్య పూర్తి చేసిన తర్వాత 2018లో విప్లవోద్యమంలో చేరింది. తీవ్ర అనారోగ్యంతో ఉన్న దళసభ్యులకు నీల్సో వైద్యం అందిస్తోంది. అయితే ఇటీవల నీల్సో కదలికలపై అనుమానం వ్యక్తం చేసిన పార్టీ ప్రత్యేక నిఘా పెట్టింది. అనుమానం నిజం కావడంతో నీల్సోను బాధ్యతల నుంచి తొలగించింది. ఇదిలా ఉంటే.. కొంతకాలంగా తన కూతురు కనిపించడం లేదని పెద్దబయలు పీఎస్‌లో నీల్సో తల్లి ఫిర్యాదు చేసింది. దీంతో పల్లెపాటి రాధ మిస్సింగ్ కేసును ఎన్ ఐఏ దర్యాప్తు చేస్తోంది. ఈ క్రమంలోనే నీల్సో హత్యకు గురైంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Also Read : ‘మా నాన్నని జైల్లో వేయండి’.. ఓ ఇదేళ్ల బుడ్డోడి ఫిర్యాదు..!

Advertisment
Advertisment
తాజా కథనాలు