ఇవేం ధరలు బాబోయ్‌.. ఐఫోన్‌ 15సిరీస్‌ రేటు చూస్తే మైండ్ బ్లాక్‌..!!

త్వరలో రిలీజ్ కానున్న కొత్త ఐఫోన్ ధరలు షాక్ కి గురిచేస్తున్నాయి. ఐఫోన్ 15 సిరీస్ ధరలు భారీగా పెంచేందుకు కంపెనీ ప్లాన్ చేస్తోంది. ఐఫోన్ ప్రో మోడల్స్ పై 200 డాలర్లు పెరిగే ఛాన్స్ ఉన్నట్లు బ్లూమ్ బెర్గ్ రిపోర్టు తెలిపింది.

New Update
ఇవేం ధరలు బాబోయ్‌.. ఐఫోన్‌ 15సిరీస్‌ రేటు చూస్తే మైండ్ బ్లాక్‌..!!

publive-image

ఐఫోన్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్. ఐఫోన్ 15 సిరీస్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని పలు నివేదికలు వెల్లడించాయి. ఆపిల్ నుంచి త్వరలోనే లాంచ్ కాబోతున్న ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15ప్రో మ్యాక్స్ ధరలు పెరిగే అవకాశం ఉందని బ్లూమ్ బెర్గ్ రిపోర్టు తెలిపింది. 2018లో ఐఫోన్ 11ప్రోను ప్రారంభించినప్పటి నుంచి ఐఫోన్ ప్రో మోడల్ ప్రారంభ ధర 999డాలర్లుగా ఉంది. అయితే యాపిల్ ఇప్పడు తన స్మార్ట్ ఫోన్ అమ్మకాల ద్వారా ఆదాయాన్ని పెంచుకునేందుకు ప్లాన్ చేస్తుంది. ఈ నేపథ్యంలో త్వరలో లాంచ్ కానున్న ఐఫోన్ 15సిరీస్ ధరలు పెంచే యోచనలో ఉన్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి.

Apple ఈ ఏడాది 85 మిలియన్ల iPhone 15 యూనిట్లను ఉత్పత్తి చేయాలని యోచిస్తుండగా, 2022లో దాని సరఫరాదారుల నుండి iPhone 14, 90 మిలియన్ యూనిట్లను ఆర్డర్ చేసింది. ఇలాంటి గణాంకాలు ఉన్నప్పటికీ, అధిక ధరల కారణంగా Appleస్మార్ట్‌ఫోన్ విక్రయ ఆదాయం పెరుగుతుందని బ్లూమ్‌బెర్గ్ తన రిపోర్టులో తెలిపింది. 9to5mac నుండి వచ్చిన మరొక నివేదిక ప్రకారం, ఎంట్రీ-లెవల్ iPhone 15, iPhone 15 Plus ఇదివరకు ఉన్న ధరలే... వరుసగా $799, $899 ధరలను కలిగి ఉంటాయని పేర్కొంది.

అయితే ఐఫోన్ 15 సిరీస్ ఆగస్టులో లాంచ్ అవుతుందని మొదట ప్రకటించినప్పటికీ...డిస్ ప్లే ప్యానెల్ ల కారణంగా ఐఫోన్ సిరీస్ ఉత్పత్తిలో పలు సమస్యలు ఉన్నాయని కంపెనీ ప్రకటించింది. అయితే సెప్టెంబర్ ఈ ఫోన్ లాంచ్ చేస్తున్నట్లు తెలిపింది. గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ షిప్‌మెంట్‌లలో ఊహాజనిత 3.2 శాతం క్షీణత కారణంగా కంపెనీ అదనంగా 6 మిలియన్ల ఐఫోన్ 14 సిరీస్ ఆర్డర్‌ను స్క్రాప్ చేస్తుందని తెలిపింది. ఈ నివేదికల ప్రకారం..ఐఫోన్ ప్రేమికులకు ఆందోళన కలిగించే అంశంగా మారింది. ఐఫోన్ 15 ప్రో మోడల్స్ ధర 200 డాలర్లు అంటే 16,490 రూపాయలు పెరిగే ఛాన్స్ ఉంది. దీని ప్రకారం భారత్ లో ఐఫోన్ 15 ప్రో ధర రూ. 1,44,900రూపాయలు ఉండవచ్చని నివేదికల ద్వారా తెలుస్తోంది.

ఫిబ్రవరి 2023 ఎర్నింగ్స్ కాల్ సందర్భంగా, టిమ్ కుక్ రాబోయే iPhone ప్రో మోడల్‌ల కోసం సాధ్యమయ్యే ధరల పెంచి...కంపెనీ ఆదాయాన్ని పెంచుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు