Roasted Garlic: కాల్చిన వెల్లుల్లితో కలిగే ప్రయోజనాలు తెలిస్తే వామ్మో అంటారు!

కాల్చిన వెల్లుల్లిలో కొలెస్ట్రాల్‌ను తగ్గించే లక్షణాలు ఉంటాయి. ఇది ఇమ్యూనిటీ పవర్ పెంచడంలో ఉపయోగపడుతుంది. కాల్చిన వెల్లుల్లి రక్త ప్రసరణను మెరుగుపరచడానికి, రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తుంది. నోటి వ్యాధులకు వెల్లుల్లి బాగా పనిచేస్తుంది.

New Update
Roasted Garlic: కాల్చిన వెల్లుల్లితో కలిగే ప్రయోజనాలు తెలిస్తే వామ్మో అంటారు!

Roasted Garlic: ఆయుర్వేదలో వెల్లుల్లికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. వెల్లుల్లితో 22 రోగాలని కుదిర్చే పద్ధతులన్నాయిని ప్రాచీన వైద్య గ్రంథాలు చెబుతున్నారు. శతాబ్దాలుగా అనేక రకాల వ్యాధులకు వెల్లుల్లిని చికిత్స చేయడానికి ఔషధంగా వాడుతున్నారు. వెల్లుల్లి వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆధునిక శాస్త్రం చెబుతుంది. వెల్లుల్లిని కాల్చడం వల్ల దాని రుచి పెరగటంతోపాటు ఎన్నో లాభాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. వెల్లుల్లి తింటే జీర్ణక్రియ, నోటి ఆరోగ్యం, గుండె ఆరోగ్యానికి, మూత్రపిండాల పనితీరుకు సహాయపడుతుంది. అయితే..పచ్చి వెల్లుల్లి కంటే కాల్చిన వెల్లుల్లిలో ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. కాల్చిన వెల్లుల్లి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి, హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. యాంటీఆక్సిడెంట్లతో నిండిన.. కాల్చిన వెల్లుల్లి తింటే రోగనిరోధక శక్తి పెంచి, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. ఆరోగ్యకరమైన జీర్ణక్రియ, ప్రేగు పనితీరు,కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గించడంలో ఇవి పాత్ర పోషిస్తుంది. కాల్చిన వెల్లుల్లి తింటే ఎలాంటి ప్రయోజనాలున్నాయో ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.

కాల్చిన వెల్లుల్లి వల్ల కలిగే ప్రయోజనాలు:

--> కాల్చిన వెల్లుల్లిలో అల్లిసిన్ అనే సమ్మేళనం కొలెస్ట్రాల్-తగ్గించే లక్షణాలను కలిగి ఉంది.

--> ఇది ఇమ్యూనిటీ పవర్ పెంచడంలో ఉపయోగపడుతుంది. ఇందులో అల్లిసిన్ యాంటీ బ్యాక్టీరియల్, యాంటీవైరల్ లక్షణాలున్నాయి.

--> కాల్చిన వెల్లుల్లి రక్త ప్రసరణను మెరుగుపరచడానికి, రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తుంది. తీనికి ప్రధాన కారణం ఇందులో క్వెర్సెటిన్, కెంప్ఫెరోల్ వంటి సమ్మేళనాలను కలిగి ఉండటం.

--> వెల్లుల్లిలో జింక్, విటమిన్-సి ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి, రోగనిరోధక శక్తిని పెంచుటుంది.

--> కాల్చిన వెల్లుల్లి విటమిన్ సి, మాంగనీస్, విటమిన్ B6 వంటి అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.

--> ప్రతీరోజూ 3 కాల్చిన వెల్లుల్లిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తింటే ఎక్కువ ప్రయోజనాలున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

--> అస్తమా, శ్వాస పీల్చుకోవడం, ఊపిరితిత్తుల రుగ్మతలను తగ్గించడానికి వెల్లుల్లి చక్కగా పని చేస్తుంది.

--> నోటి వ్యాధులకు వెల్లుల్లి బాగా పనిచేస్తుంది. మధుమేహగ్రస్తుల రక్తంలో చక్కెరస్థాయిలను నియంత్రిస్తుంది.

ఇది కూడా చదవండి: నల్ల ద్రాక్షతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు.. అవేంటో తెలుసుకోండి!

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
తాజా కథనాలు