Herbal Tea Benefits: హెర్బల్ 'టీ'తో ఎన్నో ప్రయోజనాలు.. అనేక ఆరోగ్య సమస్యలు పరార్..! చాలామంది చలికాలంలో ఎక్కువ అంటువ్యాధులతో ఇబ్బంది పడుతూ ఉంటారు. హెర్బల్ 'టీ'తో చాలా సమస్యలకు చెక్ పెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. జలుబు, దగ్గు, గొంతు నొప్పి, ఇన్ఫెక్షన్ లాంటి వ్యాధులను అరికట్టడంలో ఈ హెర్బల్ టీ చాలా బాగా పని చేస్తుంది. By Vijaya Nimma 25 Nov 2023 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Herbal Tea Benefits: సీజన్ మారింది అంటే చాలు రకరకాల అలవాట్లు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. ఓవైపు చలికాలంలో ఎక్కువ అంటునాధులతో ఇబ్బంది పడుతూ ఉంటారు చాలామంది. అంతేకాకుండా ఉష్ణోగ్రతలు తగ్గిపోవడం వల్ల ఎక్కువమంది టీ తాగడానికి ఇష్టపడుతుంటారు. అయితే.. చలి నుంచి రక్షించుకోవడానికి చాలామంది రోజుకు నాలుగు నుంచి ఐదు సార్లు సమయం సందర్భం లేకుండా టీను తాగిస్తూ ఉంటారు. కానీ.. అలా ఎక్కువ సార్లు టీ తాగడం వల్ల చలి నుంచి ఉపశమనం కలగడంతో పాటు మనం అనారోగ్యానికి హాని కలుగుతుందని ఎవరు గుర్తించరు. చలికాలంలో అయితే మామూలుగా టీ తాగుతారు దాని బదులు హెర్బల్ టీ తాగితే మంచి ఫలితాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. అంతేకాకుండా చలి నుంచి ఉపశమనం కలగడంతో పాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది రోజు తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయని అంటున్నారు. హెర్బల్ టీ తయారీ విధానం మన ఆరోగ్యానికి హెర్బల్ టీ ఎంతో మేలు చేస్తుంది. దీనిని రోజు తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. వాటిని ఇప్పుడు కొన్ని తెలుసుకుందాం. ఈ హెర్బల్ టీని చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఒక గిన్నెలో కొంచెం దాల్చిన చెక్క మొక్కలు, మూడు యాలుకలు, ఐదు మిరియాలు వేసి మెత్తని పొడిలా చేయాలి. తర్వాత గిన్నెలో కొన్ని నీళ్లు పోసి వేడి చేసి అందులో కొంచెం ఈ పొడిని వేయాలి. దీంతోపాటు అశ్వగంధ పొడి కొంచెం, సొంటిపొడి కొద్దిగా వేసి పది నుంచి 15 నిమిషాలు దీనిని మరిగించాలి. తర్వాత ఒక కప్పులో దీనిని వడపోసి తాగాలి. ఇలా రోజు ఒక కప్పు చొప్పున తీసుకుంటే మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు లభిస్తాయి. ఇది కూడా చదవండి: సబ్జా గింజలతో ఎన్నో లాభాలు.. తప్పక తెలుసుకోవాల్సిన విషయాలివే! ఈ హెర్బల్ టీనే తాగితే జీర్ణ వ్యవస్థ మెరుగు పడడంతో పాటు గ్యాస్, కడుపుబ్బరం వంటి సమస్యలు దూరం అవుతాయి. అంతేకాకుండా శరీరంలో రోగనిరోధక శక్తి ఎక్కువగా పెరుగుతుంది. చలికాలంలో వచ్చే అనారోగ్య సమస్యలను తగ్గించడానికి ఇది బెస్ట్ ఐటమ్. జలుబు, దగ్గు, గొంతు నొప్పి, ఇన్ఫెక్షన్ వంటి వ్యాధులను అరికట్టడంలో ఈ హెర్బల్ టీ చాలా బాగా పనిచేస్తుంది. రాత్రి సమయంలో కాగటం వల్ల నిద్ర సమస్య అనేది దూరమై చక్కగా నిద్ర పడుతుందని చెబుతున్నారు. బరువు తగ్గాలనుకునేవారు ఈ టీని తాగితే సులభంగా బరువు తగ్గుతారు. అంతేకాకుండా శరీరంలో అధికంగా ఉండే కొవ్వు కరగటానికి ఈ టీ బాగా పనిచేస్తుంది. దీంతోపాటు ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు దూరం అవుతాయి. చలికాలంలో హెర్బల్ టీని చేసుకొని తాగితే చలి నుంచి ఉపశమనంతో పాటు ఆరోగ్యానికి మంచి ఫలితాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. #health-benefits #herbal-tea మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి