చిరంజీవిపై క్రిమినల్ కేసు.. ఎవరినీ వదిలిపెట్టనంటున్న మన్సూర్

నటి త్రిష ఇష్యూలో తనను మానసిక వేదనకు గురిచేసిన వారిపై మన్సూర్ కేసులు పెడుతున్నట్లు తెలిపారు. నటులు చిరంజీవి, ఖుష్బులపై పరువు నష్టం దావా, క్రిమినల్, మాటలతో హింసించడం, రెచ్చగొట్టి దాడికి ఉసిగొల్పడం వంటి అంశాలపై కేసులు నమోదు చేయబోతున్నట్లు ప్రకటించారు.

New Update
చిరంజీవిపై క్రిమినల్ కేసు.. ఎవరినీ వదిలిపెట్టనంటున్న మన్సూర్

నటి త్రిషపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు మన్సూర్‌ అలీఖాన్‌ క్షమాణలు కోరిన విషయం తెలిసిందే. అయితే ఇంతటితో ఈ వ్యవహారం సద్దుమణిగిపోయిందనుకునేలోపే మన్సూర్ మరో అంశాన్ని లేవనెత్తారు. జాతీయ మహిళా కమిషన్‌ ఆదేశం మేరకు నమోదు చేసిన కేసు విషయంలో ఎలా ముందుకెళ్లాలన్న అంశంపై పోలీసులు తర్జనభర్జన పడుతుండగానే.. తనను మానసికంగా వేధింపులకు గురిచేసిన వారిపై పలు కేసులు పెట్టబోతున్నట్లు మన్సూర్ తెలిపారు.

ఈ మేరకు మన్సూర్ రీసెంట్ గా మాట్లాడుతూ త్రిష విషయంలో తనను తప్పుగా అర్థం చేసుకున్నారని, ఎవరో కావాలనే దీనిని తప్పుదోవ పట్టించారన్నారు. 'నా వ్యాఖ్యలను ఎడిట్ చేశారు. కావాలనే నాపై బురదజల్లే ప్రయత్నం చేశారు. నన్ను కావాలనే ఇరికించారు. త్రిషపై కాంట్రవర్సీ కామెంట్స్ చేసినట్లు క్రియేట్ చేశారు. దీన్ని గమనించకుండా నన్ను మానసికవేదనకు గురిచేసిన వారిని ఎవరినీ వదిలిపెట్టను' అన్నారు. ఈ క్రమంలోనే నటుడు చిరంజీవిపై పరువు నష్టం దావా, క్రిమినల్ కేసు వేయనున్నట్లు తెలిపారు. చిరుతోపాటు నటి ఖుష్బు, త్రిలపై కూడా పరువునష్టం, పరిహారం, క్రిమినల్, సివిల్ దావా, ముందస్తు అల్లర్లు, నగరంలో 10 రోజులపాలు ప్రజా శాంతికి విఘాతం కలిగించడం, తమ మాటలతో హింసించడం, ఇతరులను రెచ్చగొట్టి తనపై ఉసిగొల్పడం వంటి అంశాల కిందకు వచ్చే కేసులు నమోదు చేయబోతున్నట్లు ప్రకటించారు. అలాగే తన అడ్వకేట్ గురు ధనంజయన్ ద్వారా కోర్టులో కేసు వేయబోతున్నానని, ఈ ముగ్గురికి నోటీసులు జారీ చేస్తానని మన్సూర్ తెలిపారు. అలాగే తాను వేయబోయే కేసులో నిజమైన వీడియోను కోర్టుకు పంపించానని, మరిన్ని ఆధారాలు కూడా ఇందులో ఉన్నాయని మన్సూర్ తెలిపారు.

Also read :ఇండస్ట్రీని కుదిపేస్తున్న అలియ బోల్డ్ వీడియో.. ఏకంగా బెడ్ రూమ్ లోనే

ఇక దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన చిరు.. 'మన్సూర్ వాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మంచిది కాదు. ఒక ఆర్టిస్ట్ మాత్రమే కాదు ఏ స్త్రీని కూడా అనకూడదు. వక్రబుద్ధితో ఇలా మాట్లాడటం సరైనది కాదు. త్రిషకు మాత్రమే కాదు అమ్మాయిలందరికీ సపోర్టుగా నిలబడతాను' అని చిరు చెప్పుకొచ్చారు. అలానే ఖుష్బు దీనిపై తనదైన స్టైల్ లో రియాక్ట్ అవుతూ మన్సూర్ ను చూస్తే సిగ్గేస్తుందని, ఇతరుల గురించి మాట్లాడేముందు తనను తాను పరీక్షించుకోవాలంటూ ఘాటుగ చురకలంటించారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Suriya 796CC వెంకీ అట్లూరి- సూర్య క్రేజీ అప్డేట్..

వెంకీ అట్లూరి - సూర్య కాంబోలో తెరకెక్కనున్న '796CC' మూవీకి సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. ఇందులో ఫీమేల్ లీడ్ గా కీర్తి సురేష్ ని ఎంపిక చేసేందుకు పరిశీలిస్తున్నారట మేకర్స్ డైరెక్టర్ వెంకీ ఆమెకు స్క్రిప్ట్ వినిపించగా సానుకూలంగా స్పందించారట.

New Update
keerthi suresh with suriya in venky atluri movie

keerthi suresh with suriya in venky atluri movie

Suriya 796CC టాలీవుడ్ మహానటి కీర్తిసురేష్ పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తూ కెరీర్ లో బిజీగా ముందుకెళ్తోంది. ఈ క్రమంలో కీర్తి నెక్స్ట్ ప్రాజెక్ట్ కి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వైరల్ అవుతోంది. వెంకీ అట్లూరి - సూర్య కాంబోలో '796CC' వర్కింగ్ టైటిల్ తో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. 

సూర్య జోడీగా.. 

అయితే ఈ సినిమాలో కథానాయికగా కీర్తి సురేష్ ని ఎంపిక చేసేందుకు పరిశీలిస్తున్నారట మేకర్స్. ఇప్పటికే  డైరెక్టర్ వెంకీ ఆమెకు స్క్రిప్ట్ వినిపించగా సానుకూలంగా స్పందించారట. దీంతో ఆమె ఫైనల్ కాల్ కోసం వెయిట్ చేస్తున్నారని సమాచారం.  కీర్తి పాన్ ఇండియా ఆకర్షణ, నటన నైపుణ్యం కారణంగా ఈ ప్రాజెక్ట్ కి  ఆమె అనువైన ఎంపిక అని భావించారట మేకర్స్. 

ఒక్కోసారి ఒక్కో కొత్త కాన్సెప్ట్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న వెంకీ.. ఈసారి 80s బ్యాక్ డ్రాప్ ఆటో మొబైల్ ఇంజనీరింగ్ కథ నేపథ్యంలో సినిమాను రూపొందించబోతున్నారట. ఇండియాస్ ఫస్ట్ మారుతి కారు వచ్చిన సమయంలో జరిగే కథ. అందుకే ఈ సినిమాకు  ‘796CC’ టైటిల్ అనుకుంటున్నారు.. కానీ ఇంకా ఫిక్స్ చేయలేదు. ఇందులో సూర్య యంగ్ ఇంజనీరింగ్ గా కనిపించబోతున్నారు. ఇప్పటికే సూర్య- కీర్తి సురేష్ 'Thaanaa Serndha Koottam' అనే తమిళ్ చిత్రంలో కలిసి నటించారు. ఇందులో వీరిద్దరి కాంబినేషన్ బాగా వర్కౌట్ అయ్యింది. ‘సర్‌’, ‘లక్కీ బాస్కర్‌’ సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకున్నారు డైరెక్టర్ వెంకీ అట్లూరి. 

ఇదిలా ఉంటే ప్రస్తుతం సూర్య 'రెట్రో' మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. కార్తీక్ సుబ్బరాజు తెరకెక్కించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మే 1న విడుదల కానుంది. ఇందులో సూర్య జోడీగా పూజ హెగ్డే నటించింది. 'కంగువా' నిరాశ చెందిన ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.   

cinema-news | latest-news | telugu-news | keerthi-suresh

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు