ఒక్క ఆన్‌లైన్‌ పోస్ట్‌తో భారీగా నష్టపోయిన మామిడి రైతు!

ఒక్కోసారి ఆన్ లైన్ పోస్టులతో ఫేమస్ అవడమే కాదు. ఒక్కోసారి ఆన్‌లైన్‌లో మోసాలు కూడా జరుగుతాయని ఈ ఘటన నిరూపించింది. ఒక్క పోస్ట్‌తో ఏకంగా రైతు లక్షల్లో నష్టపోవాల్సి వచ్చింది. అంతర్జాతీయ మార్కెట్‌లో కిలోకి రూ.2.5 లక్షల పలికే మామిడి పండ్లు చోరికి గురయ్యాయి. తెల్లారే సరికి దొంగలు మామిడి తోటలోకి ప్రవేశించి హాంఫట్ చేశారు.

New Update
ఒక్క ఆన్‌లైన్‌ పోస్ట్‌తో భారీగా నష్టపోయిన మామిడి రైతు!

mangoes-worth-rs-2-5-lakh-kg-stolen-from-odisha-orchard-after-owner-posts-pics-online

  • రూ. 2.5 లక్షల ధర పలికిన మామిడిపండ్లు
  • ఆన్‌లైన్‌ మోసం, భారీగా నష్టం
  • 38 రకాల మామిడి పండ్ల సాగు
  • చోరీకి గురైన మామిడి పండ్లు

ఇక అసలు వివరాల్లోకి వెళ్తే.. ఒడిశా రాష్ట్రంలోని నువాపాడా జిల్లాలో లక్ష్మీనారాయణ అనే రైతు నివసిస్తున్నాడు. తన తోటలో కాస్తున్న మామిడికి అంతర్జాతీయ మార్కెట్ లో కిలోకు మంచి ధర పలకడంతో అది రూ. 2.5 లక్షల ధర పలుకుతుండటంతో రైతు లక్ష్మీనారాయణ ఉబ్బితబ్బిబ్బు అవుతూ.. తన తోటలోని మామిడి కాయలను చూపిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తన పొలంలో దాదాపుగా 38 రకాల మామిడి పండ్లను సాగు చేశాడు. తన తోటలోని మామిడి ధరను తెలియజేస్తూ ఉద్వేగానికి లోనయ్యాడు. ఈ వార్తను ప్రపంచంతో పంచుకోవడానికి సోషల్ మీడియాను ఎంచుకొని తన మామిడిపండ్లను పోస్టు చేశాడు. ఇంకేముంది దొంగలకు తాళాలు అప్పజెప్పినట్టైంది. ఏకంగా మామిడి తోటను లూటీ చేసి పడేశారు.

ఇదిలా ఉంటే.. అతను పోస్ట్ చేసిన ఒక రోజు తర్వాత తోటనుంచి విలువైన నాలుగు మామిడి కాయలు చోరీకి గురయ్యాయి. దీంతో లక్ష్మీనారాయణ సోషల్ మీడియా పోస్టు కారణంగానే తన మామిడికాయలను చోరి చేయడంతో తన ఆదాయాన్ని కోల్పోయినట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. దీంతో తన చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసించే స్థానికులను నమ్మలేని పరిస్థితి ఏర్పడిందని వాపోయాడు.

Advertisment
Advertisment
తాజా కథనాలు