Telangana : మళ్లీ కూలిన మానేరు బ్రిడ్జి

పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఓడేడ్‌ దగ్గర మానేరు వాగుపై నిర్మిస్తున్న బ్రిడ్జి గాలి దుమారానికి మరోసారి కూలింది. తొమ్మిదేళ్లుగా నత్తనడకన సాగుతున్న వంతెన నిర్మాణంలో క్వాలీటీ లేదని మరోసారి వెల్లడైంది.

New Update
Telangana : మళ్లీ కూలిన మానేరు బ్రిడ్జి

Peddapalle District : పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఓడేడ్‌ దగ్గర మానేరు వాగు (Maneru Bridge) పై నిర్మిస్తున్న బ్రిడ్జి గాలి దుమారానికి మరోసారి కూలింది. తొమ్మిదేళ్లుగా నత్తనడకన సాగుతున్న వంతెన నిర్మాణంలో క్వాలీటీ లేదని మరోసారి వెల్లడైంది. మంగళవారం సాయంత్రం భారీగా వీచిన గాలులకు గర్మిళ్లపల్లి వైపు వంతెన 17,18 నంబర్‌ పిల్లర్లపై ఐదు గడ్డర్లు పెద్దశబ్దంతో కిందపడ్డాయని స్థానికులు తెలిపారు.

2016లో ఆగస్ట్‌ నెలలో 49 కోట్లతో బ్రిడ్జి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. భూపాలపల్లి జిల్లా (Bhupalapally District) పెద్దపల్లి జిల్లాల మధ్య దూరం తగ్గించేందుకు ఈ వంతెన నిర్మాణం చేపట్టారు. వంతెన నిర్మాణ సమయంలో వచ్చిన వరదలకు సామాగ్రి దెబ్బతినడం, కాంట్రాక్టర్లు మారడంతో పనులు లేట్ అవుతున్నాయి. రెండేళ్లుగా వాగు ఉధృతంగా ప్రవహించడంతో గడ్డర్లు సపోర్టుగా ఉన్న చెక్కలు దెబ్బతిన్నాయి. దీంతో ఈ ఏడాది ఏప్రిల్‌ 22న అర్ధరాత్రి గాలి దుమారానికి 1,2 నంబరు పిల్లర్ల నాలుగు గడ్లర్లు కిందపడ్డాయి. ఇప్పుడు మరో ఐదు గడ్డర్లు కిందపడడంతో ఈ బ్రిడ్జి నిర్మాణం ప్రశ్నార్థకంగా మారింది.

Also read: అది నా బాధ్యత సీఎం గారూ!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Ap Govt: నేడు వారికి సెలవు రద్దూ..ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు!

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రెండో శనివారం కూడా రిజిస్ట్రేషన్ ఆఫీసులు పనిచేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఏపీ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. నేడు ఉదయం నుంచి సాయంత్రం వరకూ అన్ని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు పనిచేయనున్నాయి.

New Update
AP : నేడు ఏపీ కొత్త టెట్‌ నోటిఫికేషన్‌.. దరఖాస్తులు ఎప్పటి నుంచి అంటే!

AP Govt

ప్రతి నెలా రెండో శనివారం ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్లు, కాలేజీలకు సెలవు ఉంటుందనే విషయం తెలిసిందే. కానీ ఈ శనివారం ఏపీలోని రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు సెలవు లేదు. శనివారం ఏపీలోని రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు సెలవు రద్దు చేస్తూ ఏపీ సర్కారు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం నుంచి అధికారిక ఉత్తర్వులు వెల్లడయ్యాయి. ఏప్రిల్‌ 12న రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలు యథావిధిగా పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 

Also Read: Fire Accident: భారీ అగ్ని ప్రమాదం.. బాల్కనీ నుంచి నుంచి దూకిన పిల్లలు, మహిళలు

ఈ మేరకు ఏప్రిల్‌ 12ను వర్కింగ్‌ డేగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ ఉత్తర్వుల ప్రకారం శనివారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసులు పనిచేయనున్నట్లు తెలుస్తుంది.మరోవైపు ఇటీవల ఉగాది, రంజాన్ రోజుల్లోనూ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు పనిచేశాయి. మార్చి నెల 30  ఆదివారం నాడు, 31 సోమవారం నాడు ఉదయం 11.00 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు పనిచేశాయి. ఆర్థిక సంవత్సరం ముగింపు కావటంతో ఏపీలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు, జిల్లా రిజిస్ట్రార్ ఆఫీసులు, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫీసులకు వర్కింగ్ డేలుగా ప్రకటించారు.

Also Read: Afghanistan: ఆఫ్ఘనిస్థాన్ లో మితిమీరుతున్న ఆంక్షలు..మోడ్రన్ హెయిర్ కట్ చేసినా..

తాజాగా రెండో శనివారం రోజైన రేపు కూడా అంటే ఏప్రిల్ 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు పనిచేస్తాయని ఏపీ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ తెలిపింది.మరోవైపు ఏపీ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్ల కోసం స్లాట్ బుకింగ్ విధానం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రజలకు రిజిస్ట్రేషన్ సేవలను మరింత మెరుగ్గా, వేగంగా అందించాలనే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం ఈ స్లాట్ బుకింగ్ విధానం అమల్లోకి తెచ్చింది. అందులో భాగంగానే ప్రయోగాత్మకంగా కొన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్‌ బుకింగ్‌ విధానం అమలు చేస్తున్నారు. 

కొత్త విధానం ప్రకారం ఆస్తులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకునేవారు పని దినాల్లో ఉదయం 10: 30 నుంచి సాయంత్రం 5:30 మధ్యలో స్లాట్‌ను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ  నిర్దేశిత సమయంలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ విధానం ద్వారా రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో గంటల తరబడి నిరీక్షించే ఇబ్బందులు ప్రజలకు తప్పుతాయని ప్రభుత్వం అనుకుంటుంది.. ఇక సెలవు దినాల్లోనూ రూ.5వేలు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అయితే రేపు వర్కింగ్ డే కావటంతో ఐదు వేలు చెల్లించకుండానే రిజిస్ట్రేషన్ చేసుకునే వీలుంది.

Also Read: Egg prices: కోడిగుడ్డుకు రెక్కలు.. కోళ్లను అద్దెకు తెచ్చకుంటున్న అమెరికన్స్

Also Read: Nampally POCSO court : మైనర్ బాలికకు వేధింపులు...నాంపల్లి పోక్సో కోర్టు సంచలన తీర్పు

ap | govt | ap-govt | andhra-pradesh-govt | holiday | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates

 

Advertisment
Advertisment
Advertisment