Manchu Manoj: మంచు వారి అబ్బాయి గేమ్ షో..ఫస్ట్‌ గెస్ట్‌ ఏ హీరో అంటే!

మంచు మనోజ్‌ హోస్ట్‌ గా తర్వలో ఓ గేమ్ షో నిర్వహించబోతున్నారు. దీనికి మొదటి గెస్ట్‌ గా నేచురల్ స్టార్‌ నాని రాబోతున్నట్లు సమాచారం.

New Update
Manchu Manoj: మంచు వారి అబ్బాయి గేమ్ షో..ఫస్ట్‌ గెస్ట్‌ ఏ హీరో అంటే!

మంచు వారి ఇంటి నుంచి ఇప్పటికే లక్ష్మీ ప్రసన్న(Manchu Lakshmi)  హోస్ట్ గా కొన్ని షోలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆ ఇంటి నుంచి మరో షో రాబోతుంది. ఈసారి దీనికి హోస్ట్‌ గా మంచు మనోజ్‌  (Manchu Manoj) ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మనోజ్‌ సినిమాలకు చాలా గ్యాప్‌ తీసుకున్నాడు. కొంత కాలం క్రితమే మనోజ్‌ వివాహం చేసుకున్నాడు.

గత కొంతకాలంగా వ్యక్తిగత సమస్యల వల్ల సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. ప్రస్తుతం మనోజ్‌ చేతిలో వాట్‌ ది ఫిష్‌ అనే సినిమా ఉంది. దానితో వెండితెర మీద రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ క్రమంలోనే వెండితెర తో పాటు బుల్లి తెర మీద కూడా తన సత్తాను చాటేందుకు మనోజ్‌ రెడీ అవుతున్నాడు.

ఈ క్రమంలోనే ఈటీవీ విన్‌ లో మంచు మనోజ్‌ హోస్ట్‌ గా ఉస్తాద్‌...ర్యాప్‌ ఆడిద్దాం అనే షో త్వరలోనే మొదలు కాబోతుంది. ఇది ఒక గేమ్‌ షో. ప్రముఖులను, సెలబ్రిటీలను ఆడించడంతో పాటు వారి పర్సనల్ విషయాలను కూడా బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ మధ్యనే ఈ షోకు సంబంధించిన పోస్టర్స్‌, టీజర్‌ రిలీజ్‌ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలోనే మంచు మనోజ్‌ షో అంటే ముందుగా మొదటి గెస్ట్‌ ఎవరొస్తారు అనే సందేహం అందరిలోనూ ఉంటుంది. చాలా మంది మంచు వారి అబ్బాయి షో కాబట్టి కచ్చితంగా గెస్ట్‌ కూడా మంచు వారి ఇంటి నుంచే ఉంటారు అని అనుకోకుండ ఉండరు.

అయితే మోహన్‌ బాబు కానీ, లేకపోతే లక్ష్మీ ప్రసన్న కానీ అయి ఉంటారనే భావన అందరిలోనూ ఉంటుంది. కానీ ఎవరి ఊహాలకు అందకుండ మనోజ్‌ షోకి వేరే గెస్ట్‌ రాబోతున్నట్లు తెలుస్తుంది. ఈ విషయం గురించి మనోజ్‌ టీజర్‌ రిలీజ్‌ ఈవెంట్లోనే ఓ క్లారిటీ ఇచ్చాడు. తన అక్క లక్ష్మీతో ఇప్పటి వరకు ఒక్క షో కూడా అనుకోలేదని..భవిష్యత్తులో ఏమైనా చేసే అవకాశాలున్నాయని వివరించాడు.

దీంతో మంచు ఫ్యామిలీ ఫస్ట్‌ గెస్ట్‌ లుగా రావడం లేదని క్లారిటీ వచ్చేసింది. మరి మొదటి అతిథి ఎవరూ అనుకుంటున్న సమయంలో ఆ గెస్ట్‌ ఎవరో కూడా తెలిసిపోయింది. ఎలాగంటే..మనోజ్‌ ఓ హీరోని హత్తుకుని ఉన్న ఫోటోను షేర్‌ చేసి..గేస్‌ ది హీరో అంటూ సోషల్‌ మీడియాలో రాసుకొచ్చాడు.

దీంతో ఆ పిక్చర్‌ చూసిన వారికి ఎవరికైనా సరే ఆ హీరో నాని అని ఇట్టే అర్థం అయిపోతుంది. మనోజ్‌ షోకి ఫస్ట్‌ గెస్ట్‌ గా రాబోతుంది నాచురల్‌ స్టార్‌ నాని అని. హాయ్‌ నాన్న ప్రమోషన్స్ కోసం నాని ఈ షోకి వస్తున్నట్లు తెలుస్తుంది. మరి ఈ షోలో మనోజ్.. నానిని ఎలా ఆడుకుంటాడో చూడాలి.

also read: తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు అలెర్ట్.. ఎగ్జామ్స్ ఎప్పుడంటే?

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Priyanka Chopra: "క్రిష్ 4" లో ప్రియాంక చోప్రా ఫిక్స్.. .

హృతిక్ రోషన్ హీరోగా నటించి, దర్శకత్వం వహించనున్న "క్రిష్ 4" సినిమా వచ్చే ఏడాది మొదట్లో చిత్రీకరణ ప్రారంభంకానుంది. ఈ సినిమాలో ప్రీతీ జింటా, వివేక్ ఓబెరాయ్ నటించగా, ప్రియాంకా చోప్రా కూడా ఇందులో భాగం అవుతారని ప్రచారం జరుగుతోంది.

New Update
Priyanka Chopra

Priyanka Chopra

Priyanka Chopra: హృతిక్‌ రోషన్‌ ప్రధాన పాత్రలో నటించిన బాలీవుడ్‌ సూపర్‌ హీరో ఫ్రాంచైజీ "క్రిష్"లో నాలుగవ భాగంగా "క్రిష్ 4"(Krrish 4) సినిమా రాబోతోంది. ఈ సినిమాతో హృతిక్‌ కేవలం హీరోగా మాత్రమే కాదు, దర్శకత్వం కూడా వహించబోతున్నారు. 

Also Read: మేటర్ పెద్దదే..! ఇంట్లో వాళ్ళతో మాత్రం అస్సలు చూడకండి..

రాకేష్‌ రోషన్, ఆదిత్యా చోప్రా నిర్మించనున్న ఈ సినిమా, వచ్చే ఏడాది ప్రారంభంలో చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఇప్పటికే ప్రీతీ జింటా, వివేక్‌ ఓబెరాయ్‌ వంటి ప్రముఖులు ఈ చిత్రంలో నటించనున్నట్లు వార్తలు వచ్చాయి. 

Also Read: ఆ నరుకుడు ఏంది సామి.. రక్తం ఏరులైపారిందిగా..! హిట్-3' ట్రైలర్ రిలీజ్..

"క్రిష్ 4"లో ప్రియాంకా చోప్రా..

తాజాగా, ప్రియాంకా చోప్రా కూడా "క్రిష్ 4"లో భాగస్వామి అవుతారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. హృతిక్‌, ప్రియాంకా, నిక్‌ జోనస్‌ కలిసి అమెరికాలో సమావేశమైనప్పుడు, ఈ సినిమాను గురించి చర్చించినట్లు తెలుస్తోంది. ప్రియాంక చోప్రా కూడా ఈ మూవీ చేయడానికి ఇష్టపడుతున్నట్టు టాక్ నడుస్తోంది.

Also Read: భారీ యాక్షన్ అడ్వెంచర్‌కు సిద్ధమైన కమల్ హాసన్

Also Read: అక్టోబర్ నుండి ఛార్జ్ తీసుకోనున్న సిన్సియర్ పోలీస్ ఆఫీసర్..

Advertisment
Advertisment
Advertisment