Viral Video: పడుకున్న దాన్ని లేపి తన్నించుకోవడం అంటే ఇదే.. ఏం జరిగిందో చూడండి

నిద్రపోతున్న ఆవులను కదిలించుకుని తన్నిన ఓ వ్యక్తి వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. యువకుడు చిల్లర పనులు చేస్తూ పడుకున్న ఆవులను కొట్టుకుంటూ, కాలితో తన్నుతూ వెళ్తున్నాడు. ఓ ఆవు దగ్గరికి వచ్చి దానిపై చేయివేసే సరికి ఎగిరి వెనుక కాళ్లతో లాగిపెట్టి తన్నింది.

New Update
Viral Video: పడుకున్న దాన్ని లేపి తన్నించుకోవడం అంటే ఇదే.. ఏం జరిగిందో చూడండి

Viral Video: నిద్రపోతున్న ఆవులను కదిలించుకుని తన్నిన ఓ వ్యక్తి వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కర్మఫలం అనేది ఒకటి ఉంటుంది ఎవరికైనా చెడు తలపెట్టాలని చూస్తే వెంటనే దాని ప్రతిఫలం అనుభవిస్తారనేదానికి ఈ ఘటన నిదర్శనం. ట్విట్టర్‌లో వైరల్‌గా మారిన ఈ వీడియోలో ఒక యువకుడు, స్నేహితులతో కలిసి రైల్వే ఓవర్‌ బ్రిడ్జిపై నడుచుకుంటూ వెళ్తుండగా అక్కడ కొన్ని ఆవులు పడుకొని ఉన్నాయి. యువకుడు చిల్లర పనులు చేస్తూ పడుకున్న ఆవులను కొట్టుకుంటూ, కాలితో తన్నుతూ వెళ్తున్నాడు.

ఓ ఆవు దగ్గరికి వచ్చి దానిపై చేయివేసే సరికి అది వెంటనే ఎగిరి వెనుక కాళ్లతో లాగిపెట్టి తన్నింది. దీంతో యువకుడు అదే ఊపులో ఎగిరి అవతల పడ్డాడు. ఇదంతా కెమెరాలో రికార్డ్‌ అయింది. అర్హంత్ షెల్బీ అనే ట్విట్టర్‌ హ్యాండిల్ ద్వారా షేర్ చేయబడిన వీడియో వైరల్‌గా మారింది. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలినప్పటికీ సోషల్‌ మీడియాలోవైరల్‌గా మారింది. జంతువులను ప్రేమగా చూసుకుంటే అవి కూడా మనల్ని ఆదరిస్తాయని, క్రూరంగా ప్రవర్తిస్తే అంతే వైల్డ్‌గా మారతాయని ఇది చూసిన నెటిజన్లు అంటున్నారు.

publive-image

ఈ వీడియోకి అనేక కామెంట్లు కూడా వస్తున్నాయి. దీనినే కర్మఫలం అంటారని కొందరు కామెంట్‌ చేస్తుంటే.. జంతువులను అలా హింసిస్తున్న యువకుడికి తగిన శాస్త్రి జరిగిందంటూ నెటిజన్లు అంటున్నారు. ఇలాంటి తెలివితక్కువ వ్యక్తిని చూడలేదంటూ మండిపడుతున్నారు. జంతువుల జోలికి పోవడం ఎందుకు..లేపి మరీ తన్నించుకోవడం ఎందుకంటూ ట్వీట్‌కి రిప్లే ఇస్తున్నారు. అది కాబట్టి తన్ని ఊరుకుందని, ఇకేమైనా చేసి ఉంటే బాగుండు అంటూ..మొత్తానికి మంచి గుణపాఠం చెప్పిందంటూ ఆవులను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు నెటిజన్లు. మరోసారి ఇలాంటి ఆకతాయి పనులు చేసేవారు జాగ్రత్తగా ఉంటారని అంటున్నారు.

ఇది కూడా చదవండి: వైరల్‌ ఫీవర్‌ను తగ్గించే ఇంటి చిట్కాలు ఇవే

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.

Advertisment
Advertisment
తాజా కథనాలు