Andhra Pradesh: ఎమ్మెల్యే కారుపై నాటు బాంబుతో దాడి.. తృటిలో తప్పిన పెను ప్రమాదం..

సత్యసాయి జిల్లాలో భయానక ఘటన చోటు చేసుకుంది. పెనుగొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి శంకర్ నారాయణపై హత్యాయత్నం జరిగింది. ఆయన కారుపై గుర్తు తెలియని దుండగులు డిటోనేటర్ బాంబు విసిరాడు. అదృష్టవశాత్తు ఆ బాంబు పేలలేదు. దాంతో ఆయన క్షేమంగా బయటపడ్డారు.

New Update
Andhra Pradesh: ఎమ్మెల్యే కారుపై నాటు బాంబుతో దాడి.. తృటిలో తప్పిన పెను ప్రమాదం..

Detonator at MLA Shankar Narayana: ఆంధ్రప్రదేశ్‌లో సంచలన ఘటన వెలుగు చూసింది. ఓ ఎమ్మెల్యేపై బాంబు దాడికి యత్నించారు దుండగులు.. అదృష్టావశాత్తు ఆ బాంబు పేలకపోవడంతో ప్రాణాలతో బయటపడ్డారు సదరు ఎమ్మెల్యే. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే.. ఎక్కడ బాంబు వేశారు? అసలీ ఘటన ఎక్కడ జరిగింది? ఎందుకు జరిగింది? ఫుల్ డీటెయిల్స్ ఇప్పుడు తెలుసుకుందాం..

సత్యసాయి జిల్లాలో భయానక ఘటన చోటు చేసుకుంది. పెనుగొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి శంకర్ నారాయణపై హత్యాయత్నం జరిగింది. ఆయన కారుపై గుర్తు తెలియని దుండగులు డిటోనేటర్ బాంబు విసిరాడు. అదృష్టవశాత్తు ఆ బాంబు పేలలేదు. దాంతో ఆయన క్షేమంగా బయటపడ్డారు. ఆదివారం సాయంత్రం చోటు చేసుకున్న ఈ షాకింగ్ ఘటన.. ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేకెత్తిస్తోంది.

ఎమ్మెల్యే శంకర నారాయణ ఆదివారం నాడు సత్యసాయి జిల్లా గోరంట్ల మండలంలోని గడ్డం తండా పంచాయతీ పరిధిలో ‘గడపగడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం ప్రారంభించారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఎమ్మెల్యే శంకర నారాయణ తన అనుచరులు, ప్రభుత్వ అధికారులతో కలిసి గడపగడపకు తిరుగుతున్నాయి. ఈ సమయంలో ఓ వ్యక్తి ఎమ్మెల్యే వాహనంపై డిటోనేర్ విసిరాడు. అయితే, ఆ డిటోనేటర్ గురి తప్పి పొదల్లో పడటంతో ప్రమాదం తప్పింది. దాంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

అయితే, నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అక్కడ ఉన్న నాయకులు, ప్రజలు నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఎమ్మెల్యేపై బాంబు దాడికి గల కారణాలు ఏంటనేదానిపై విచారిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలను విచారణ అనంతరం వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

Also Read:

ఎదురుతిరగడంతో యువతిని కాల్చిన కిరాతకులు..ఇజ్రాయెల్‌లో ఇంత దారుణమా..!

Bandla Ganesh: కూకట్‌పల్లి టికెట్ నాకే..బండ్ల గణేశ్ సంచలన ట్వీట్..!

Advertisment
Advertisment
తాజా కథనాలు