TTD: తిరుమలలో నకిలీ ఐఏఎస్..ఏకంగా వీఐపీ బ్రేక్ దర్శనం..కట్ చేస్తే కటకటాలపాలు..!

తిరుమలలో నకిలీ ఐఏఎస్ అధికారిని టీటీడీ విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. జాయింట్ సెక్రటరీ హోదారలో శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనానికి సిఫార్సు లేఖ ఇచ్చారు. అతని వైఖరిపై అనుమానంతో ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది. అసలేం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లండి.

New Update
TTD: తిరుమలలో నకిలీ ఐఏఎస్..ఏకంగా వీఐపీ బ్రేక్ దర్శనం..కట్ చేస్తే కటకటాలపాలు..!

TTD: తిరుమలలో నకిలీ ఐఏఎస్ అధికారిని టీటీడీ విజిలెన్స్ అధికారులు అరెస్టు చేశారు. నరసింహారావు అనే వ్యక్తి ఐఏఎస్ అని చెప్పి గురువారం స్వామివారి దర్శనానికి వచ్చాడు. టీటీడీ ఈవో కార్యాలయంలో సిఫార్సు లేఖను అందించాడు. తాను జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నానని చెప్పాడు. అతను ఇచ్చిన లేఖను క్షుణ్ణంగా పరిశీలించిన ఈవో కార్యాలయ అధికారులు అనుమానంతో అతన్ని ప్రశ్నించారు. అయితే నరసింహారావు తడబడటంతో పాటు అతని నుంచి సరైన సమాధానం రాకపోవడంతో అతడి వైఖరిపై అనుమానం వచ్చింది.

వెంటనే ఈవో కార్యాలయం సిబ్బంది విజిలెన్స్ అధికారులకు సమాచారం అందించడంతో వారు ఆరా తీశారు. నకిలీ ఐఏఎస్ అధికారి నరసింహారావుపై పోలీసులకు టీటీడీ విజినెల్స్ అధికారులు ఫిర్యాదు చేశారు. అతన్ని అదుపులోకి తీసుకున్నారు. గతంలోనూ గుంటూరు, విజయవాడలో కూడా ఇదే తరహాలో నరసింహారావు మోసాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. నరసింహారావును ప్రశ్నిస్తున్న పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తునకు సిద్ధం అవుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇది కూడా చదవండి: చంపేసిన మూడనమ్మకం..గ్రహణ భయంతో తన భర్తను,పిల్లలను ఎలా చంపిదో తెలుసా?

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Ap Rain Alert:ఏపీకి వాతావరణశాఖ చల్లని కబురు.. ఈ జిల్లాల్లో వానలు!

ఉత్తరాంధ్రలో శని, ఆదివారాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అయితే, శ్రీకాకుళం, విజయనగరంలో వడగాలులు తీవ్రంగా ఉంటాయి. ఐదు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 నుంచి 45 డిగ్రీల మధ్య నమోదవుతాయని తెలిపారు.

New Update
Rains

Rains

ఏపీ ప్రజలకు ఎండల నుంచి కాస్త ఉపశమనం కలిగిస్తూ వాతావరణశాఖ చల్లని కబురు మోసుకొచ్చింది. రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని ఐఎండీ చెప్పింది. శని, ఆదివారాల్లో ఉత్తరాంధ్రలో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో-4, విజయనగరం జిల్లాలో-5, పార్వతీపురం మన్యం జిల్లాలో-8.. మొత్తం 17 మండలాల్లో తీవ్రవడగాలులు, 21 మండలాల్లో వడగాలులు ప్రభావంచూపే అవకాశం ఉన్నట్లు తెలిపారు. 

Also Read: Pahalgam Attack: పహల్గామ్ ఉగ్రదాడిలో హమాస్ హస్తం..ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్

దోర్నిపాడులో 43.8 , పెద్దదోర్నాలలో 43.8 , కడపలో 43.6 , విజయనగరంలో 42.8 డిగ్రీల చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలిపారు. అలాగే 139 ప్రాంతాల్లో 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డు అయినట్లు సమాచారం. వచ్చే ఐదు రోజుల్లో రాయలసీమలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 నుంచి 45 డిగ్రీల మధ్యలో నమోదవుతాయని అధికారులు చెబుతున్నారు. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Also Read: Telangana: నిప్పుల కుంపటిల రాష్ట్రం.. రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

మరోవైపు మే తొలి వారంలో అల్పపీడన ద్రోణి, ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ చెబుతుంది. వాతావరణశాఖ. వచ్చే నెల రోజుల్లో ఎల్‌నినో తటస్థంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయని చెబుతున్నారు. మే మొదటి వారంలోనే సాధారణం లేదా సాధారణం కంటే ఎక్కువ వానలు పడే అవకాశాలు ఉన్నాయి.  ఏపీలోని ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి వానలకు అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఉమ్మడి కర్నూలు జిల్లాలో భానుడి భగభగలకు జనాలు అల్లాడిపోతున్నారు. గత కొద్దిరోజులుగా ఉష్ణోగ్రతలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. గురువారం దొర్నిపాడులో 43.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. 'పాణ్యం 42.5, గడివేముల 42.4, కర్నూలు అర్బన్, కొత్తపల్లి, నంద్యాలలో 42.3 , గోస్పాడు, రుద్రవరంలో 43.4, బండి ఆత్మకూరు 42.2, బనగానపల్లి, కోవెలకుంట్ల, ఉయ్యాలవాడ 42.0, డోన్, ప్యాపిలి 41.9, బేతంచెర్ల 41.6, కోడుమూరు, ఆళ్లగడ్డ 42.8, కౌతాళం 42.7,  నమోదైనట్లు అధికారులు తెలిపారు. నందికొట్కూరు, శిరివెళ్ల 41.3, శ్రీశైలం 41.2, కోసిగి, మద్దికెర, పగిడ్యాల 41.1, ఓర్వకల్లు, తుగ్గలి, చాగలమర్రి,మంత్రాలయం,  సంజామల, ఆత్మకూరు, కొలిమిగుండ్ల, పాములపాడు 41.7, కల్లూరు,  మిడుతూరులో 41.0 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి' అని అధికారులు తెలిపారు. 

Also Read: Ap Govt:ఏపీలో వారికి జీతాలు పెంచిన ప్రభుత్వం..

Also Read: ఆయుధాలతో శ్రీనగర్‌లోకి భారీగా విదేశీయులు.. ఎవిడెన్స్ ఉన్నాయంటున్న పాక్

 

ap | rain-alert | ap rain alert | heavy rain alert ap | rains | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates

Advertisment
Advertisment
Advertisment