Job : నేను పెళ్లి చేసుకోవాలి.. ఉద్యోగం ఇవ్వండి ప్లీజ్!

ఉద్యోగం ఉంటేనే కూతురిని ఇచ్చి పెళ్లి చేస్తానని ఓ యువకుడికి ఆమె తండ్రి పెట్టిన కండీషన్ గురించి ఓ యువకుడు తన రెస్యూమ్‌ లో పేర్కొవడంతో ఈ విషయం కాస్త సోషల్‌మీడియాలో వైరల్‌ గా మారింది.

New Update
Job : నేను పెళ్లి చేసుకోవాలి.. ఉద్యోగం ఇవ్వండి ప్లీజ్!

Man Applies For Job : ఉద్యోగం (Job) లో చేరేముందు కచ్చితంగా అభ్యర్థికి సంబంధించిన వివరాలను జోడిస్తూ.. ఆకర్షణీయంగా రెస్యూమ్‌ (Resume) ని తీర్చిదిద్దుతుంటారు. అయితే అందరిలా ఉంటే నా ప్రత్యేకత ఏం ఉంటుందని చాలా మంది కొత్త పద్దతుల్లో రెస్యూమ్‌ ని తయారు చేస్తుంటారు. కొందరు అయితే డైరెక్ట్‌ గానే ఎంత డబ్బు కావాలని అడిగే వారు కూడా ఉంటారు.

అయితే తాజాగా ఓ అభ్యర్థి తన ఉద్యోగ అభ్యర్థనలో పెళ్లి (Marriage) ప్రస్తావించడం కంపెనీ సీఈఓ దృష్టికి వెళ్లింది. దీంతో దానిని కాస్తా ఆ సీఈవో సోషల్‌ మీడియాలో పెట్టడంతో వైరల్ గా మారింది. చిన్నప్పటి నుంచి ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే ఉద్యోగం ఉండి తీరాలనే కండీషన్‌ పెట్టాడు పిల్ల తండ్రి.

దీంతో ఎలాగైనా ఉద్యోగం సంపాదించాలనుకుని ఇదే విషయాన్ని రెస్యూమ్‌ లో కూడా ప్రస్తావించాడు. ఉద్యోగం వస్తేనే కూతురిని ఇస్తానని ప్రియురాలి తండ్రి చెప్పారని..ఈ ఉద్యోగం రాకపోతే ఎప్పటికీ పెళ్లి కాదు అంటూ చెప్పుకొచ్చాడు.

ఉద్యోగం కోసం వచ్చిన అప్లికేషన్స్ ను పరిశీలించిన అర్వా హెల్త్‌ వ్యవస్థాపకురాలు సీఈఓ డిపాలీ బజాజ్‌ (Dipali Bajaj) ఈ విషయం చూసి షాక్‌ అయ్యారు. జాబ్‌ రోల్‌ కు సంబంధించిన ఫోటోను ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు. ఉద్యోగ నియామకం కూడా సరదా అయిపోయిందని ఆమె రాసుకోచ్చారు. దీంతో ఈ పోస్ట్‌ కూడా నెట్టింట వైరల్‌ అయ్యింది.

Also read:  బంగారం కోసం కన్నవారినే చంపిన కర్కోటకుడు!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pahalgam Attack: ఆ దుర్మార్గులను వదిలిపెట్టం.. దేశం మొత్తానికి ఇదే నా హామీ.. అమిత్ షా సంచలన ప్రకటన!

పహల్గాం ఉగ్రదాడిపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందించారు. ఉగ్రదాడిని చూసి ప్రతీ భారతీయుడు బాధను అనుభవిస్తున్నాడని.. దీన్ని వర్ణించలేమని అన్నారు. అమాయక ప్రజలను చంపిన ఉగ్రవాదులందరినీ వదిలిపట్టేది లేదని స్పష్టం చేశారు.

New Update
Amit Shah

Amit Shah

పహల్గాం ఉగ్రదాడిపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందించారు. దీనికి బాధ్యులైన వాళ్లని విడిచిపెట్టేది లేదని స్పష్టం చేశారు. '' పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో పౌరులు ప్రాణాలు కోల్పోవడాన్ని చూసి ప్రతీ భారతీయుడు ఆ బాధను అనుభవిస్తున్నాడు. ఈ బాధ మాటల్లో వర్ణించలేనిది. బాధిత కుటుంబాలకు, దేశ ప్రజలను నేను మాటిస్తున్నాను. అమాయక ప్రజలను చంపిన ఉగ్రవాదులందరినీ వదిలిపట్టేది లేదని'' అమిత్‌ షా ప్రకటించారు.  

ఇది కూడా చూడండి: J&K TerrorAttack:ఉగ్రదాడిలో హైదరాబాద్ వాసి మృతి.. శివమొగ్గ కు చెందిన వ్యాపారవేత్త ...!

మరోవైపు పహల్గాంలోని బైసరాన్‌లో జరిగిన ఉగ్రదాడి ప్రాంతాన్ని అమిత్‌ షా పరిశీలించారు. అలాగే దాడి నుంచి బయటపడ్డ వాళ్లని, మృతులు కుటుంబాలను కలిశారు. ఈ దాడికి బాధ్యులైన వాళ్లని చట్టం ముందు నిలబెడతామని హామీ ఇచ్చారు. అలాగే అంతకుముందు ఉగ్రదాడిలో మరణించిన వారికి నివాళులర్పించారు. బుధవారం సాయంత్రం ప్రధానీ మోదీ అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ జరగనుంది. ఈ సమావేశంలో ఉగ్రస్థావరాలపై సర్జికల్ స్ట్రైక్‌కు నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ప్రధాని మోదీతో పాటు హోం మంత్రి అమిత్ షా, రక్షణశాఖ మంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్‌, నేషనల్ సెక్యూరిటీ సలహాదారుడు అజిత్‌ దోవల్‌ ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. 

ఇది కూడా చూడండి: PM Modi: సౌదీ పర్యటన మధ్యలోనే ముగించుకుని వెనక్కు వచ్చేసిన ప్రధాని మోదీ

 ఇదిలా టూరిస్ట్‌లపై జరిగిన టెర్రర్ ఎటాక్‌‌లో 28 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ దాడిలో మృతి చెందిన వారి కుటుంబాలకు జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. అలాగే తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.లక్ష చొప్పున అందజేస్తామని తెలిపింది. 

telugu-news | national-news 

Advertisment
Advertisment
Advertisment