Telangana Congress: కాంగ్రెస్ లో లొల్లి పెట్టిన మైనంపల్లి చేరిక.. మరో కీలక నేత రాజీనామా?

New Update
Telangana Congress: కాంగ్రెస్ లో లొల్లి పెట్టిన మైనంపల్లి చేరిక.. మరో కీలక నేత రాజీనామా?

మైనంపల్లి హన్మంతరావు (Mynampally Hanmantharao) కాంగ్రెస్ లో చేరిక.. ఆ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆయన చేరికను వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ నేత నందికంటి శ్రీధర్ (Nandikati Sreedhar) పార్టీకి రాజీనామా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన ఈరోజు తన అనుచరులతో సమావేశమయ్యారు. మౌలాలి క్లాసిక్‌ గార్డెన్ ఫంక్షన్‌ హాల్‌లో ఈ రోజు నందికంటి శ్రీధర్ నిర్వహించిన సమావేశానికి దాదాపు వేయి మంది ముఖ్య కార్యకర్తలు హాజరైనట్లు తెలుస్తోంది. పార్టీ తనకు ద్రోహం చేసిందని నందికంటి ఆగ్రహం చేసినట్లు తెలుస్తోంది. తాను తల్లిలా భావించిన కాంగ్రెస్ పార్టీనే తనను మోసం చేసిందని ఆయన కన్నీళ్లు పెట్టకున్నారు. బీసీలకు కాంగ్రెస్‌లో స్థానం లేదంటూ ఆయన భావోద్వేగంగా ప్రసంగించారు. రాహుల్‌ని కలిసినా ఫలితం శూన్యమని అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో పార్టీకి రాజీనామా చేద్దామని కార్యకర్తలు నినాదాలు చేసినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Telangana BJP: ఈ నెల 6న బీజేపీ అభ్యర్థుల జాబితా.. ఆ స్థానాలకు అభ్యర్థులు ఖరారు?

మైనంపల్లి కుటుంబానికి రెండు టిక్కెట్లు ఇచ్చి బీసీకి అన్యాయం చేస్తున్నారని ఈ సమావేవానికి హాజరైన పలువురు కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల నందికంటి శ్రీధర్ రాహుల్ గాంధీని ఢిల్లీలో ప్రత్యేకంగా కలిశారు. నియోజకవర్గ రాజకీయ పరిస్థితులను వివరించారు.  అయినా కూడా మల్కాజిగిరి టిక్కెట్ పై స్పష్టత రాకపోవడంతో నందికంటి శ్రీధర్ ఆందోళనకు గురైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పార్టీకి రాజీనామా చేయడనికి నందికంటి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ రోజు సాయంత్రం ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయనున్నట్లు సమావేశం. అనంతరం మీడియా సమావేశం నిర్వహించి తన రాజకీయ భవిష్యత్ పై నందికంటి ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అయితే ఆయన బీఆర్ఎస్ లో చేరుతారా? లేదా బీజేపీ కండువా కప్పుంటారా? అన్నది రాజకీయ వర్గాల్లో ఉత్కంఠగా మారింది.

మైనంపల్లి హన్మంతరావు, ఆయన కుమారుడు రోహిత్ రాకను వ్యతిరేకిస్తూ మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తిరుపతి రెడ్డి సైతం నిన్న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. మొదటి నుంచి పార్టీలో కష్టపడి పని చేసిన తన లాంటి వారికి గుర్తింపు లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మైనంపల్లి రోహిత్ కు కాంగ్రెస్ టికెట్ ఇస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనంపల్లి కుటుంబానికి రెండు టికెట్లు ఇవ్వడంపై కాంగ్రెస్ పార్టీకి చెందిన అనేక మంది లీడర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మైనంపల్లి రాకను వ్యతిరేకిస్తూ రాజీనామా చేసే వారి సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు