Maldives: మాల్దీవుల్లో సెలబ్రేట్ చేసుకోండి..క్రికెటర్లకు ఆఫర్

టీ20 ప్రపంచకప్‌లో విజయం సాధించిన భారత జట్టును మాల్దీవుల పర్యాటక సంస్థలు ఆహ్వానం పలుకుతున్నాయి. మా దేశానికి వచ్చి మీరు సెలబ్రేషన్స్ చేసుకోండి అంటూ ఆఫర్లు ఇస్తున్నాయి. భారతదేశంతో వివాదం పెట్టుకుని టూరిజం నష్టపోయిన మాల్దీవులు ఈ రకంగా మళ్ళీ ఆకర్షించడానికి ప్రయత్నాలు చేస్తోంది.

New Update
Maldives: మాల్దీవుల్లో సెలబ్రేట్ చేసుకోండి..క్రికెటర్లకు ఆఫర్

Invitation For Indian Cricket Teams: భారత్‌ దౌత్యపరమైన వివాదాలతో మాల్దీవులు తీవ్రంగా నష్టపోయింది. ఇక్కడ నుంచి వెళ్ళే పర్యాటకుల సంఖ్య బాగా తగ్గిపోయింది. దీంతో మాల్దీవులకు చాలా ముఖ్య ఆదాయ వనరు అయిన పర్యాటకం రంగం కుదేలయిపోయింది. అంతకు ముందు విపరీతంగా మాల్దీవులకు వెళ్ళే భారతీయుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. దాంతో ఇప్పుడు ఆ దేశ పర్యాటక సంస్థలు దిద్దుబాటు చర్యలు ప్రారంభించాయి. ఈ క్రమంలో తాజాగా టీ20 ప్రపంచకప్‌ సాధించిన భారత క్రికెట్‌ జట్టును తమ దేశంలో పర్యటించాల్సిందిగా విజ్ఞప్తి చేశాయి. ప్రపంచకప్‌ విజయోత్సవ సంబరాలను మాల్దీవుల్లో సెలబ్రేట్‌ చేసుకోవాలని పిలుస్తున్నాయి. గెలుపు ప్రత్యే క్షణాలను సొంతం చేసుకోవాల్సిందిగా ప్రత్యేకంగా ఆహ్వానం పలికాయి.

మాల్దీవులు అసోసియేషన్ ఆఫ్ టూరిజం ఇండస్ట్రీ (ఎంఏటీఐ), మాల్దీవులు మార్కెటింగ్, పబ్లిక్ రిలేషన్స్ కార్పొరేషన్‌ (ఎంఎంపీఆర్‌సీ)లు సంయుక్తంగా భారత క్రికెటర్లకు ఆహ్వానాు పలికాయి. భారత క్రికెట్ జట్టును స్వాగతించడం, వారి విజయోత్సవంలో పాలుపంచుకోవడం మాల్దీవులకు గొప్ప గౌరవంగా భావిస్తున్నాం. వారికి ఆతిథ్యం ఇచ్చేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం అంటూ ప్రకటన చేశాయి. ఇరుదేశాల మధ్య బలమైన, దీర్ఘకాలిక.. సాంస్కృతిక, క్రీడా సంబంధాలు ఎప్పటినుంచో ఉన్నాయని, వాఇని మరింత బలోపేతం చేసుకోవాలని ఎంఎంపీఆర్‌సీ సీఈవో, ఎండీ ఇబ్రహీం షియురీ, ఎంఏటీఐ సెక్రటరీ జనరల్ అహ్మద్ నజీర్ తెలిపారు.

Also Read:Mumbai: ముంబైకు వాతావరణశాఖ రెడ్ అలెర్ట్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

WHO: మరో మహమ్మారి తప్పదు-WHO చీఫ్

ప్రపంచానికి మరో మహమ్మారి తప్పదని అంటున్నారు డబ్లూహెచ్ వో చీఫ్ టెడ్రోస్. ఇది సైంటిఫిక్ ముప్పు కాదని..అంటువ్యాధులు మళ్ళీ ప్రబలే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరిస్తున్నారు. 

New Update
who

WHO Chief Tedros

ప్రపంచాన్ని మరో మహమ్మారి కబళించే అవకాశం ఉందని...అందరూ దానికి సంసిద్ధంగా ఉండాలని అంటున్నారు డబ్ల్యూహెచ్ వో డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధనోమ్‌ ఘెబ్రెయేసస్‌. అయితే ఈసారి సైన్స్ ప్రయోగాల వల్లనో ఇంక దేని వల్లనే ఈ ముప్పు రాదని..అంటు వ్యాధులే విజృంభిస్తాయని ఆయన చెబుతున్నారు. ఎప్పుడనేది కచ్చితంగా చెప్పలేనప్పటికీ దానికి రెడీగా ఉండాలని ప్రపంచానికి టెడ్రోస్ పిలుపునిచ్చారు. డబ్ల్యూహెచ్‌వో పాండమిక్‌ అగ్రిమెంట్‌పై జెనీవాలో నిర్వహించిన 13వ పునఃప్రారంభ సమావేశాల్లో ప్రారంభోపన్యాసం చేసిన టెడ్రోస్ కోవిడ్ మహమ్మారిని గుర్తు చేశారు. అప్పుడే పై వ్యాఖ్యలను కూడా చేశారు. ఇప్పుడు మరో మహమ్మారి 20 ేళ్ళ లోపు లేదా అంత కంటే ముందే...ఇంకా చెప్పాలంటే రేపు కూడా మొదలవ్వొచ్చని అన్నారు. ఏది ఏమైనా కచ్చితంగా వచ్చే తీరుతుందని బల్లగుద్ది మరీ చెప్పారు టెడ్రోస్. 

నిజానికి 2 కోట్ల మంది..

డబ్ల్యూహెచ్ వో డైరెక్టర్ టెడ్రోస్ కోవిడ్ మహమ్మారి నాటి సంగతులను గుర్తు చేసుకున్నారు. అధికారికంగా 70 లక్షల మంది చనిపోయారని ఉంది..కానీ నిజానికి ఆ సంఖ్య 2 కోట్ల వరకూ ఉంటుందని డబ్ల్యూహెచ్ వో అంచనా అని ఆయన చెప్పారు.  ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నుంచి 10 ట్రిలియన్‌ డాలర్ల కంటే ఎక్కువ ఆర్థిక నష్టాన్ని కలిగించిందని టెడ్రోస్ తెలిపారు. ఇప్పటివరకు జరిగిన విధ్వంసం మీదనా, రాబోయే మహమ్మారి మీదన కూడా  ఒప్పందంపై ప్రస్తుతం జరుగుతున్న చర్చల్లో సభ్యదేశాల మధ్య ఏకాభిప్రాయం రావచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.

 today-latest-news-in-telugu | who | covid

Also read: Waqf Amendment Act: అమలులోకి వక్ఫ్ బోర్డ్ సవరణ చట్టం 2025.. నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్రం

Advertisment
Advertisment
Advertisment