India - Maldives : 28 దీవులను భారత్‌ కి అప్పగించిన మాల్దీవులు!

చైనాకు చెక్‌ పెట్టేందుకు భారత్‌ మాల్దీవుల అస్త్రాన్ని ప్రయోగించింది. కేంద్ర దౌత్య ప్రయత్నాల ఫలితంగా మాల్దీవులు 28 దీవులపై నియంత్రణను భారత్‌ కు అప్పగించింది. విదేశాంగ మంత్రి జై శంకర్‌ మాల్దీవుల పర్యటనలో పలు అవగాహన ఒప్పందాల మీద ఇరు దేశాల నాయకులు సంతకాలు చేశారు.

New Update
Maldives: మాల్దీవులతో భారత్ ఒప్పందం..

Maldives Handover 28 Islands To India : గతేడాది ప్రధాని మోదీ (PM Modi) లక్షద్వీప్‌లో పర్యటించిన సందర్భంలో ఆయనపై మాల్దీవుల అధ్యక్షుడు అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో మాల్దీవులకు వ్యతిరేకంగా సోషల్‌మీడియా లో పెద్ద ఎత్తున ట్రోలింగ్‌ జరిగింది. భారత్‌ నుంచి చాలా మంది పర్యాటకులు మాల్దీవులను సందర్శించడానికి వెళ్లకపోవడంతో ఆ దేశ ఆర్థిక స్థితిగతులు దాదాపు తారుమారు అయ్యాయి. దీంతో దెబ్బకి మాల్దీవుల ప్రభుత్వం దిగి వచ్చింది.

ఈ క్రమంలోనే మాల్డీవుల అధ్యక్షుడు మహహ్మద్‌ ముయిజ్జూ ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరిచేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. విదేశాంగ మంత్రి జై శంకర్‌ (Jaishankar) సోమవారం మాల్దీవుల పర్యటనను ముగించారు. ఈ సమయంలో పలు అవగాహన ఒప్పందాల మీద ఇరు దేశాల నాయకులు సంతకాలు చేశారు.

ఆరు హై ఇంపాక్ట్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌లను ప్రారంభించారు. పరస్పరం చేసుకున్న అవగాహన ఒప్పందాలలో భారతదేశంలో అదనంగా 1,000 మంది మాల్దీవుల సివిల్ సర్వెంట్ల సామర్థ్యాన్ని పెంపొందించడానికి, మాల్దీవులలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ ప్రవేశానికి సంబంధించిన ఒప్పందాలు ఉన్నాయి. ఆరు HICDPలు, భారతీయ గ్రాంట్ అసిస్టెన్స్‌తో మద్దతినిచ్చాయి, మానసిక ఆరోగ్యం, ప్రత్యేక విద్య, స్పీచ్ థెరపీ, స్ట్రీట్ లైటింగ్ వంటి రంగాలను కవర్ చేస్తాయి.

భారత్‌ కి 28 దీవులు ఒప్పందం

మాల్దీవులలోని 28 దీవులలో నీరు, పారిశుద్ద్య ప్రాజెక్టులను మెరుగుపరిచేందుకు భారత్‌ (India) కి అప్పగించింది..మాల్దీవుల ప్రభుత్వం. జులై 23న సమర్పించిన యూనియన్ బడ్జెట్ 2024 మునుపటి సంవత్సరంతో పోలిస్తే 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఈ ద్వీప దేశానికి సహాయంలో గణనీయమైన 48 శాతం తగ్గింపును వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక కేటాయింపులు మాల్దీవులకు రూ. 400 కోట్లను "గ్రాంట్స్"గా నిర్దేశించాయి, గత సంవత్సరం అందించిన రూ.770 కోట్లతో పోలిస్తే ఇది గణనీయంగా తగ్గింది. ఈ కేటాయింపు కూడా ఫిబ్రవరి 2024లో సమర్పించిన మధ్యంతర బడ్జెట్‌లో ప్రతిపాదించిన దానికంటే రూ.200 కోట్లు తక్కువ.

ముయిజ్జు భారతదేశాన్ని అభినందించారు

అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు మాల్దీవులకు భారతదేశం నిరంతర అభివృద్ధి సహాయాన్ని ప్రశంసించారు. భారతదేశం-మాల్దీవుల సంబంధాన్ని మరింత లోతుగా చేయడానికి ప్రయత్నిస్తామని తెలిపారు.

Also Read: మాజీ మంత్రి జోగి రమేష్‌ కొడుకు అరెస్ట్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Trump-China: ఆ నిర్ణయం వెంటనే వెనక్కి తీసుకోండి..లేదంటే...చైనాకు ట్రంప్ హెచ్చరికలు!

అమెరికా ప్రతీకార సుంకాల నేపథ్యంలో ..ఆ దేశం నుంచి దిగుమతి అయ్యే వస్తువుల పై 34 శాతం అదనపు సుంకం విధించాలని చైనా నిర్ణయించింది.దీని పై భగ్గుమన్న అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్‌ ...ఏప్రిల్‌ 8 లోగా డ్రాగన్‌ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు.

New Update
Trump

Trump

అమెరికా ,చైనా ల మధ్య వాణిజ్య యుద్ధం మరింత ముదిరేలా కనిపిస్తోంది. అమెరికా ప్రతీకార సుంకాల నేపథ్యంలో ..ఆ దేశం నుంచి దిగుమతి అయ్యే వస్తువుల పై 34 శాతం అదనపు సుంకం విధించాలని చైనా ఇటీవల నిర్ణయించిన విషయం తెలిసిందే.దీని పై భగ్గుమన్న అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్‌ ...ఏప్రిల్‌ 8 లోగా డ్రాగన్‌ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సూచించారు.

Also Read: Madhya Pradesh:క్షమించండి..దొంగతనం చేయాలనుకోలేదు..ఆరు నెలల్లో తిరిగి ఇచ్చేస్తాను..!

లేదంటే ఏప్రిల్‌ 9 నుంచి 50 శాతం ప్రతీకార సుంకాలు విధిస్తామని హెచ్చరించారు. ఆ దేశంతో చర్చలు కూడా నిలిపివేస్తామని తేల్చి  చెప్పారు.అమెరికా పై చైనా 34 శాతం అదనపు సుంకాలను ప్రకటించింది.ఆ దేశం ఇప్పటికే పెద్ద ఎత్తున టారిఫ్‌ లు విధిస్తోంది.కంపెనీలకు అక్రమ రాయితీలు,దీర్ఘకాలికంగా కరెన్సీ అవకతవకలకు పాల్పడుతోంది.

Also Read: Maoists surrender : పోలీసులకు లొంగిపోయిన 26 మంది మావోయిస్టులు

నేను హెచ్చరించినప్పటికీ..అదనపు సుంకాల ద్వారా అమెరికా పై ప్రతీకారం తీర్చుకునేందుకు ఏ దేశమైనా యత్నిస్తే వెంటనే మరిన్ని టారిఫ్‌ లు ఎదుర్కోవాల్సి ఉంటుంది.ముందు ప్రకటించిన దానికంటే పెద్ద ఎత్తున్న విధిస్తాం. అందువల్ల ..ఏప్రిల్‌ 8 నాటికి చైనా తన 34 శాతం అదనపు సుంకం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి.

లేకపోతే..ఏప్రిల 9 నుంచే ఆ దేశం పై 50 శాతం అదనపు టారిఫ్‌ లు విధిస్తాం.  ఆ దేశంతో అన్ని చర్చలూ రద్దు చేస్తాం అని సామాజిక మాధ్యమాల వేదికగా ట్రంప్‌ హెచ్చరించారు.అంతకు ముందు ట్రంప్‌ చైనాపై 34 శాతం ప్రతీకార సుంకాలను ప్రకటించారు. దీనికి డ్రాగన్‌ సైతం దీటుగా స్పందించింది.

రెండువిధాలా వాడుకునేందుకు అవకాశం ఉన్న వస్తువులను అమెరికాకు చెందిన 16 సంస్థలకు ఎగుమతి చేయడం పై నిషేధం విధించాలని నిర్ణయించింది. అమెరికాలోని రక్షణ, కంప్యూటర్‌,స్మార్ట్‌ ఫోన్ల పరిశ్రమలను దెబ్బతీసే రీతిలో కొన్ని రకాల అరుదైన ఖనిజాల ఎగుమతుల పై నియంత్రణలు ప్రకటించింది. దీంతో పాటు ప్రతీకార సుంకాల పై ప్రపంచ వాణిజ్య సంస్థలో వ్యాజ్యం దాఖలు చేసింది.

ఈ  విషయంలో ఇప్పటికే బీజింగ్‌ తీరుఉ,తప్పుపట్టిన ట్రంప్‌..తాజాగా ప్రతీకార సుంకాలను మరింత పెంచతానంటూ స్పష్టం చేశారు.

Also Read: Delhi: ఢిల్లీలో భానుడి భగభగ.. సీజన్‌లో ఆల్ టైం రికార్డు స్థాయి టెంపరేచర్

Also Read: TRUMP Tariffs: టారీఫ్‌ల విషయంలో వెనక్కి తగ్గిన ట్రంప్.. ఈ దేశాలపై సుంకాలు రద్దు..!

china | america | tarriffs | beijing | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates

Advertisment
Advertisment
Advertisment