Malawi Vice President: మరో ఘోర విమాన ప్రమాదం.. దేశ ఉపాధ్యక్షుడి దుర్మరణం!

మలావీ ఉపాధ్యక్షుడు 'సౌలస్ షిలిమా' ప్రయాణించే విమానం తప్పిపోయిన కథ విషాందాంతమైంది. అందులో ఉన్న 10 మంది దుర్మరణం చెందినట్లు ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది. విమానం పర్వత ప్రాంతాల్లో కూలిపోయింది. అందులో ఎవరూ ప్రాణాలతో లేరు' అని మలావీ దేశాధ్యక్షుడు లాజరస్‌ చక్వేరా వెల్లడించారు.

New Update
Malawi Vice President: మరో ఘోర విమాన ప్రమాదం.. దేశ ఉపాధ్యక్షుడి దుర్మరణం!

Plane crash: ఆఫ్రికా దేశమైన మలావీ ఉపాధ్యక్షుడు సౌలస్ షిలిమా... మరో తొమ్మిది మంది కలిసి వెళ్లిన విమానం అదృశ్యం కథ విషాదాంతమైంది. సౌలస్ షిలిమాతో సహా అందులో ఉన్న 9 మంది దుర్మరణం చెందినట్లు ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది. విమానం పర్వత ప్రాంతాల్లో కూలిపోయింది. గల్లంతైన విమానం శకలాలను గుర్తించాం. అందులో ఎవరూ ప్రాణాలతో లేరు' అని మలావీ దేశాధ్యక్షుడు లాజరస్‌ చక్వేరా వెల్లడించారు.\

ఈ మేరకు మలావీ రాజధాని లిలోంగ్వే నుంచి బయలుదేరిన ఆ విమానం 370 కిలోమీటర్ల దూరంలోని జుజు అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగాల్సి ఉంది. ప్రయాణ సమయం 45 నిమిషాలు. అయితే, ప్రతికూల వాతావరణం కారణంగా అక్కడ దిగవద్దని, తిరిగి లిలోంగ్వేకు వెళ్లిపోవాలని ఏటీసీ సూచించింది. ఈ క్రమంలోనే రాడార్‌తో విమానం సంబంధాలు తెగిపోయాయి. గల్లంతైన విమానం కోసం మలావీ సైన్యం భారీ సెర్చ్‌ ఆపరేషన్‌ చేపట్టింది. ప్రతికూల వాతావరణం ఉన్నప్పటికీ వందల మంది సైనికులు, పోలీసులు, అటవీ అధికారులతో ముమ్మరంగా గాలించింది. పొరుగు దేశాల హెలికాప్టర్లు, డ్రోన్లను రంగంలోకి దించింది. అంగోలా దేశ అంతరిక్ష కేంద్రం సహాయాన్ని కోరింది. అమెరికా, బ్రిటన్‌, నార్వే, ఇజ్రాయెల్‌ కూడా సహాయం అందించేందుకు ముందుకువచ్చాయని మలావీ ప్రభుత్వం వెల్లడించింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు