NTR Devara: దేవర కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు పండగే

ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం దేవర. గత కొద్దిరోజులుగా ఈ సినిమా రిలీజ్ వాయిదా పడినట్లు సోషల్ మీడియాలో అనేక ప్రచారాలు జరిగిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మేకర్స్ కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించారు. 2024 అక్టోబర్ 10న విడుదల కానున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు.

New Update
NTR Devara:  దేవర కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు పండగే

NTR Devara: 2024 లో ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఎన్టీఆర్ దేవర ఒకటి. కొరటాల శివ,యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా పై ఇప్పటికే విపరీతమైన హైప్ క్రియేట్ అయ్యింది. ఇక ఇటీవలే రిలీజైన గ్లింప్స్ తో సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే గత కొద్దిరోజులుగా.. ఏప్రిల్ 5న విడుదలకు ప్లాన్ చేసిన ఈ సినిమా వాయిదా పడినట్లు సోషల్ మీడియాలో అనేక ప్రచారాలు జరిగాయి. ఇక ఇప్పుడు మేకర్స్ రిలీజ్ చేసిన ప్రకటనతో ఇదే నిజమని తేలిపోయింది.

దేవర కొత్త రిలీజ్ డేట్

తాజాగా దేవర చిత్ర బృందం కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ.. ఎన్టీఆర్ పోస్టర్ ను రిలీజ్ చేసింది. 2024 అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలిపింది. న్యూ రిలీజ్ డేట్ రావడంతో ఎన్టీఆర్ అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. కానీ కొంత మంది అభిమానులు మాత్రం.. సినిమా మరీ ఇంత వెనక్కి వెళ్లిపోయిందేంటి అని నిరాశ చెందగా... మరి కొంత మంది.. ఎంత లేట్ అయిన పర్వాలేదు అవుట్ ఫుట్ మాత్రం అదిరిపోవాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఎన్టీఆర్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని యువసుధ, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్నారు. ముందుగా ఈ సినిమాను ఒక భాగంగానే రిలీజ్ చేయాలనుకున్న కొరటాల శివ.. ఆ తర్వాత రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నట్లు తెలిపారు. బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఈ సినిమాలో కథానాయికగా నటిస్తుంది. సైఫ్ అలీ ఖాన్, ప్రకాష్ రాజ్ శ్రీకాంత్, మురళీ శర్మ, అభిమన్యు సింగ్, నారాయణ్ ప్రధాన పాత్రలు పోషించారు.

Also Read: Paayal Raajput Video: బాటిల్ తో ప్రియుడి తల పగలగొట్టిన పాయల్.. వైరలవుతున్న వీడియో

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pahalgam Terror Attack: ఉగ్రదాడిలో 28 మంది మృతి.. తనికెళ్ల భరణి కన్నీటి కవిత

పహల్గాం టెర్రరిస్టు అటాక్‌పై సినీ నటుడు తనికెళ్ల భరణి స్పందించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక కన్నీటి కవితను షేర్ చేసారు. కాశ్మీరంలోనే కుంకం పువ్వెందుకు పూస్తుందో నా కర్ధమైపోయింది! అంటూ ఆ కవిత సాగుతుంది. ప్రస్తుతం అది నెట్టింట వైరల్‌గా మారింది.

New Update
Pahalgam Terror Attack

Pahalgam Terror Attack

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. అందమైన ప్రదేశాలను చూసేందుకు వచ్చిన టూరిస్టులపై కాల్పులు జరిపారు. ఈ దాడిలో దాదాపు 28 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ముస్లిమేతరులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులకు పాల్పడినట్లు సాక్ష్యులు చెబుతున్నారు. 

ఇది కూడా చూడండి: PM Modi: సౌదీ పర్యటన మధ్యలోనే ముగించుకుని వెనక్కు వచ్చేసిన ప్రధాని మోదీ

అమాయక ప్రజల మృతిపై ఇప్పటికే సినీ సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు, వ్యాపార వేత్తలు సంతాపం తెలిపారు. ఈ చర్యలకు పాల్పడిన వారిని అస్సలు వదలకూడదని.. కఠినంగా శిక్షించాలంటూ భారతీయులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ సీనియర్ యాక్టర్ తనికెళ్ల భరణి స్పందించారు. ఈ మేరకు ఒక కవితతో ఉన్న పోస్టర్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 

ఇది కూడా చూడండి: Pahalgam: పహల్గామ్ లో నంబర్ ప్లేట్ లేని బైక్..ఉగ్రవాదులదేమోనని అనుమానం

కన్నీటి కవిత

కాశ్మీరంలోనే కుంకం పువ్వెందుకు పూస్తుందో నా కర్ధమైపోయింది!
అక్కడ ఉన్నట్టుండి పాకే పాకే పసిబిడ్డ నెత్తురు ముద్దై పోతుంది. 

సామగానం చేసే కాశ్మీరీ పండితుల కంఠాల్లోంచి వేదం ఆగి- రుధిరం బైటికొస్తుంది.

అక్కడ రేపు పల్లకీ లెక్కి ఊరేగాల్సిన పెళ్ళికొడుకులు ఇవాళే పాడెక్కుతారు...

ఆ లోయలో హిమాలయాలు సైతం మూర్తీభవించిన వైధవ్యాల్లా ఉంటాయ్

భరతమాత కిరీటం వొరుసుకునీ నిరంతరం అక్కడ నెత్తురోడుతూ ఉంటుంది !

బుద్ధుడు కూడా కళ్ళూ నోరూ మూసుకుని మళ్ళీ అంతర్ముఖుడౌతాడు !!

ఎప్పుడో 40 ఏళ్ళ క్రితం రాసిన కవిత, ఇంకా తడిగానే ఉంది!! అంటూ తనికెళ్ల భరణి ఒక కవితను పంచుకున్నారు. ఇప్పుడది నెట్టింట వైరల్‌గా మారింది. 

 

pahalgam | Pahalgam attack | pahalgam breaking news | tanikella-bharani | latest-telugu-news | telugu-news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు