New Year : కొత్త సంవత్సరంలో ఈ చిన్న మార్పు చేయండి.. రమ్, విస్కీకి బదులు ఇది తాగండి..!! న్యూఇయర్ సెలబ్రేషన్స్ లో ఇతర ఆల్కాహాల్ కు బదులుగా వైన్ తాగడం మంచిది.రెడ్ వైన్లో తక్కువ క్యాన్సర్ కారకాలు ఉంటాయి. అన్ని రకాల ఆల్కహాలిక్ డ్రింక్స్‌తో పోలిస్తే, బీర్‌లో ఎక్కువ హానికరమైన పదార్థాలు ఉంటాయి.రెడ్ వైన్ ఆరోగ్యానికి మంచిదని ఎన్నో అధ్యయనాల్లో నిరూపితమైంది. By Bhoomi 28 Dec 2023 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Change Habits @2024 : కొత్త సంవత్సరం(New Year) వేడుకలకు అంతా రెడీ అవుతున్నారు. పెద్ద పెద్ద ఈవెంట్లు ప్లాన్ చేస్తుంటారు. ఈవెంట్లలో యూత్ పెద్దెత్తున పాల్గొంటుంది. ఈ క్రమంలో ఇప్పటి నుంచే ప్లాన్స్ వేసుకుంటున్నారు. ఈనేపథ్యంలో చాలా మంది అతిగా మద్యం సేవిస్తుంటారు. ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. ఆల్కహాల్(Alcohol) నిరంతరం తీసుకోవడం వల్ల ఆల్కహాల్ పాయిజనింగ్, డీహైడ్రేషన్, నిద్రలేమి, తక్కువ రక్తపోటు మొదలైన దుష్ప్రభావాలకు దారి తీస్తుంది. రోజు గడిచే కొద్దీ శరీర బరువు పెరగడం, అధిక రక్తపోటు , నిద్రలేమి సమస్య రావడం, శారీరక, మానసిక సమస్యలు కనిపిస్తాయి. దీనికి తోడు రోగనిరోధక శక్తి తగ్గడం, గుండె జబ్బులు, కాలేయ సమస్య, స్ట్రోక్ వంటి సమస్యలను ఎదుర్కొవల్సి వస్తుంది. న్యూ ఇయర్ సందర్భంగా మీరు మీ ఈ ఒక్క అలవాటులో ఈ చిన్న మార్పు చేసుకోవచ్చు. అంటే ఆల్కహాల్‌కు దూరంగా ఉండటం లేదా రమ్, విస్కీ, బ్రాందీ, బీర్ వోడ్కాకు బదులుగా వైన్‌ని ఎంచుకోవడం మంచిది. వైన్ ఎందుకు మంచిది? నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఇతర మద్య పానీయాలకు బదులుగా వైన్ తాగడం మంచిది. వైన్ లేదా రెడ్ వైన్ ఇతర ఆల్కహాల్ కంటే ఆరోగ్యానికి తక్కువ హానికరం. ఎందుకంటే ఇందులో తక్కువ క్యాన్సర్ కారకాలు ఉంటాయి. అన్ని రకాల ఆల్కహాలిక్ డ్రింక్స్‌తో పోలిస్తే, బీర్‌లో ఎక్కువ హానికరమైన పదార్థాలు ఉంటాయి.మీరు త్రాగే రెడ్ వైన్ ఆరోగ్యానికి మంచిదని ఎన్నో అధ్యయనాల్లో నిరూపితమైంది. ఎందుకంటే ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. యాంటీఆక్సిడెంట్లు మన శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుండి రక్షిస్తాయి. రెడ్ వైన్‌లో పాలీఫెనాల్స్ అని పిలువబడే యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి మన లిపిడ్ ప్రొఫైల్‌ను మెరుగుపరచడమే కాకుండా రక్తపోటు, ఇన్సులిన్ నిరోధకతను కూడా నియంత్రిస్తాయి. Also Read : ఆల్కహాల్ కొంచెం తాగొచ్చు అని చెబితే నమ్మకండి.. అసలు నిజాలు తెలుసుకోండి! రెడ్ వైన్ తాగడం వల్ల మీ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. అంతేకాకుండా రక్తం గడ్డకట్టడం తగ్గి గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీని వల్ల మన గుండె చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ఇందులో ఉపయోగించే ద్రాక్షపండు తొక్కలో అధిక మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ ఉంటుంది, ఇది రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. మితమైన మోతాదులో రెడ్ వైన్‌ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అనేక రకాల క్యాన్సర్‌లను నివారించవచ్చు.రెడ్ వైన్‌లో ఉండే పాలీఫెనాల్స్‌లో ప్రీబయోటిక్స్ ఉన్నాయని పరిశోధనలు చెబుతున్నాయి. ఇవి కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.రెడ్ వైన్ తాగడం వల్ల ఆయుష్షు పెరుగుతుందని పలు పరిశోధనల్లో తేలిది. ఎందుకంటే ఇది కొన్ని వ్యాధులను నయం చేస్తుంది. మన శరీరం యొక్క DNA ఆరోగ్యంగా ఉంచడం ద్వారా, అది మన జీవితకాలాన్ని పెంచుతుంది. సాధారణ వైన్ కంటే రెడ్ వైన్ చాలా మంచిది: రెడ్ వైన్ సాధారణంగా పర్పుల్ ద్రాక్షతో తయారు చేస్తారు. ఇందులో పాలీఫెనాల్స్ పుష్కలంగా ఉంటాయి. కానీ వైట్ వైన్ కాదు. ఇందులో ద్రాక్ష పండు తొక్క తొలగిపోతుంది. కానీ ద్రాక్ష తొక్కలు, విత్తనాలను రెడ్ వైన్‌లో ఉపయోగించడం వల్ల మన ఆరోగ్యానికి ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయి.మీరు ఏ వైన్ తాగినా అది ఆల్కహాల్ అని గుర్తుంచుకోండి. కాబట్టి తీసుకోవడంలో మితంగా ఉండండి. మద్యం ఆరోగ్యానికి హానికరం అని గుర్తుంచుకోండి. ఇది కూడా చదవండి: నటుడు విజయకాంత్ కన్నుమూత #alcohol #healthy-habits #new-year #wine మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి