Mahesh Babu : మహేష్ బాబుది విగ్గా? ఒరిజినల్ హెయిరా?.. ఒక్క వీడియోతో క్లారిటీ వచ్చేసిందిగా! మహేష్ బాబు తాజాగా హైదరాబాద్ లో జరిగిన ఓ పెళ్లికి కూతురు సితారతో కలిసి వెళ్ళాడు. ఈ వేడుకకు మహేష్ సోదరి మంజుల కూడా హాజరవగా.. వీళిద్దరి మధ్య జరిగిన సరదా సంభాషణ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. By Anil Kumar 29 Apr 2024 in సినిమా ట్రెండింగ్ New Update షేర్ చేయండి Magesh Babu - Manjula Funny Video : సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) ప్రస్తుతం రాజమౌళి(Rajamouli) సినిమా కోసం రెడీ అవుతున్న విషయం తెలిసిందే. త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ లోపు మహేష్ తన లుక్ ని మార్చే పనిలో పడ్డాడు. జక్కన్న సినిమా కోసం మహేష్ లాంగ్ హెయిర్ మైంటెన్ చేస్తున్నాడు. ఇక షూటింగ్ కి ఇంకా టైం ఉండటంతో ప్రెజెంట్ తన ఫ్యామిలీతో కలిసి సరదా సమయాన్ని గడుపుతున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా హైదరాబాద్(Hyderabad) లో జరిగిన ఓ పెళ్లికి మహేష్ కూతురు సితారతో కలిసి వెళ్ళాడు. ఈ వేడుకకు మహేష్ సోదరి మంజుల కూడా హాజరవగా.. వీళిద్దరి మధ్య జరిగిన సరదా సంభాషణ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. మహేష్ ని ఆట పట్టించిన మంజుల మహేష్ సోదరి మంజుల ఈ వేడుకలో తమ్ముడిని సరదాగా ఆట పట్టించింది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియా(Social Media) లో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో మంజుల మహేష్ జుట్టుని లాగుతూ.. "ఏంట్రా జుట్టు ఇంత పెరిగింది. కొంపతీసి ఇది విగ్గా? అని మహేష్ ని సరదాగా ఆట పట్టించింది. దానికి మహేష్.."ఇది ఒరిజినల్ హెయిర్" అని అక్కకు చెప్పాడు. అలా ఈ ఇద్దరి మధ్య జరిగిన ఫన్ మూమెంట్స్ మహేష్ ఫ్యాన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. Cutest video on the internet today#MaheshBabu with his sister Manjula pic.twitter.com/ZkwXXp6mZL — KLAPBOARD (@klapboardpost) April 29, 2024 మహేష్ తో ప్రభాస్ పెద్దమ్మ మహేష్ బాబు అటెండ్ అయిన ఈ పెళ్ళికి ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి కూడా వచ్చారు.ఇందులో భాగంగానే శ్యామలా దేవి మహేష్ ని పలకరించారు. అనంతరం కూతురు సితారతో కలిసి ఫోటో దిగారు. ఈ వీడియో కూడా సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారింది. Also Read : వామ్మో.. ‘కూలీ’ కోసం రజినీకాంత్ రెమ్యునరేషన్ వందల కోట్లా? #mahesh-babu #mahesh-babu-hair #manjula-ghattamaneni మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి