Mahesh babu vs Teja Sajja: గుంటూరు కారం vs హను-మాన్ . పోటీపై ఆసక్తికర పోస్ట్ పెట్టిన తేజ

బాలనటుడిగా యువరాజు సినిమాలో మహేష్ బాబు తో నటించిన తేజ సజ్జ .. ఇప్పుడు మహేష్ బాబుకే గట్టి పోటీ ఇస్తున్నాడు. ఈక్రమంలో పోటీని ఉద్దేశించి తేజ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది

New Update
Mahesh babu vs Teja Sajja: గుంటూరు కారం vs హను-మాన్ . పోటీపై ఆసక్తికర పోస్ట్ పెట్టిన తేజ

Guntur Kaaram Vs Hanu-Man :సంక్రాతి అంటేనే తెలుగు సినిమాకు అసలైన పండగ.ఈ సీజన్ కోసమే చాలా రోజుల నుంచి ప్లాన్స్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఈ సంక్రాంతి సీజన్ లో 5 సినిమాలు రిలీజ్ కానున్నాయి. అందులో మొదటి రోజు అంటే జనవరి 12 న రిలీజ్ అవ్వబొయె సినిమాలు సూపర్ స్టార్ మహేష్ గుంటూరు కారం, తేజ సజ్జా హను - మాన్ చిత్రాల గురించి ప్రస్తుతం ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ నడుస్తోంది.

మమ్మల్ని చులకన గా చూడొద్దంటూ ఆవేదన
బాలనటుడిగా దాదాపు థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అనుభవం ఉన్న తేజ సజ్జ సినిమా సూపర్ స్టార్ మహేష్ తో తలపడుతున్నారంటూ చాలా కామెంట్స్ వచ్చాయి/ హను-మాన్ సినిమాను సంక్రాంతి బరిలోనించి తప్పుకోమని సలహాలు కూడా ఇవ్వడం జరిగింది. అయినా సరే .. ఈ సినిమాకు ఓవర్సెస్ లో ఉన్న క్రేజ్ దృష్ట్యా తప్పకుండా జనవరి 12 న రిలీజ్ చెయ్యాలని ఫిక్స్ అయిపోయారు. ధీంతొ ఏ సినిమా ప్రమోషన్స్ కు వెళ్లినా మహేష్ బాబు తో పోటీపడటం  అవసరమా అంటూ తేజపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అయినా ఎక్కడా బ్యాలన్స్ తప్పకుండా సమాధానం  ఇస్తున్నాడు తేజ. ఒకానొక టైంలో మమ్మల్ని చులకన గా చూడొద్దంటూ ఆవేదన కూడా వ్యక్తం చేశారు తేజ .

యువరాజు మూవీలో మహేష్ కొడుకుగా అలరించిన తేజ
బాలనటుడిగా తేజ సజ్జ స్టార్ హీరోల సరసన నటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మహేష్బాబు నటించిన యువరాజు మూవీలో మహేష్ కొడుకుగా అలరించిన తేజ ఇప్పుడు నంటే దాదాపు 23 ఏళ్ల తరువాత గుంటూరు కారం మూవీతో పోటీ పడతున్నారు అని ట్వీట్ చేయగా .. ఆ ట్వీట్ కు చాలా తెలివైన రిప్లయ్ ఇచ్చారు తేజ . తమ సినిమా ‘గుంటూరు కారం’తో పాటుగా వస్తోంది అంటూ మహేష్‌ ఫ్యాన్స్ మనసులు గెలుచుకున్నాడు.ఈ తెలివైన పోస్ట్ కు మహేష్ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

11 భాషల్లో రిలీజ్ 

ఇక.. హను- మాన్ సినిమా ఇండియాతో పాటు శ్రీలంక, జపాన్, చైనా, అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీ, స్పెయిన్ సహా వివిధ దేశాల్లో మొత్తం 11 భాషల్లో రిలీజ్ కానుంది. . ఇక ‘గుంటూరు కారం’ మూవీకి ఉన్న క్రేజ్ తెలిసిందే. మరి..ఈ రెండు సినిమాలల్లో ఎవరు సంక్రాంతి బోణీ లో సూపర్ సక్సస్ సాధిస్తారో చూడాలి.

ALSO READ:Venky-Nani Multi-Starrer: త్రివిక్రమ్ డైరెక్షన్లో వెంకీ, నాని మల్టీస్టారర్ మూవీ!!

Advertisment
Advertisment
తాజా కథనాలు