/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-13-4.jpg)
Mahesh Babu - Balakrishna : టాలీవుడ్‌లో ప్రస్తుతం మళ్లీ మల్టీస్టారర్ ట్రెండ్ కొనసాగుతోంది. రీసెంట్ టైమ్స్ లో 'RRR' సినిమాలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ స్క్రీన్‌ని షేర్ చేసుకోగా.. 'వాల్తేరు వీరయ్య'లో మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహరాజా రవితేజ కలిసి నటించారు. అలాగే 'బ్రో' మూవీలో పవన్ కళ్యాణ్, సాయి తేజ్ సందడి చేశారు.ఇక తాజాగా ఎవరూ ఊహించని కాంబోలో కొత్త మల్టీస్టారర్ తెరకెక్కనుంది.
ఈ విషయాన్ని మ్యూజిక్ డైరెక్టర్ థమన్ స్వయంగా లీక్ చేయడం విశేషం. తాజాగా తెలుగు ఇండియన్ ఐడల్ ప్రోగ్రాంలో సింగర్ శ్రీరామచంద్ర మహేష్ బాబు, బాలకృష్ణ ఇద్దరి సినిమాల్లో ఒకేసారి అవకాశం వస్తే ఏ సినిమా చేస్తారు? అని తమన్ ని అడగ్గా.. ఇందుకు తమన్ బదులిస్తూ..' బాలకృష్ణ, మహేష్ బాబు గారు కలిసి చేసే సినిమాకు చేస్తాను. బాలకృష్ణ – మహేష్ బాబు గారి మల్టీస్టారర్ సినిమా రావొచ్చు.
Balayya Mahesh Babu iddaru multistarer ga chestharu oka katha kuda vinnanu -@MusicThaman 🔥
Ee combo set ithey okka record kuda migaladu 🥵🔥#NandamuriBalakrishna @urstrulyMahesh pic.twitter.com/Mizmw2guPF
— NBK Cult 🦁 (@iam_NBKCult) September 8, 2024
Also Read : నెట్టింట హాట్ టాపిక్ గా మారిన ‘పుష్పరాజ్’ గణేశుడు.. తిట్టిపోస్తున్న నెటిజన్లు
ఆల్రెడీ నేను కథ కూడా విన్నాను' అని చెప్పారు. దీంతో తమన్ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. బాలయ్య, మహేష్ ఫ్యాన్స్ ఈ వ్యాఖ్యలని షేర్ చేస్తూ ఈ ఇద్దరి కాంబోలో సినిమా పడితే థియేటర్స్ దద్దరిల్లడం ఖాయం అంటున్నారు. మరి ఈ ఇద్దరి కాంబోను బిగ్ తెరకెక్కించే డైరెక్టర్ ఎవరు? ఆయన ఎలాంటి కథ రాసుకున్నారు? అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.