ఇచ్చిన పైసలు అడిగాడనే కోపంతో.. ఫ్రెండ్ ను అలా చేసిన యువకుడు

ఇద్దరు స్నేహితుల మధ్య చిచ్చురేపిన డబ్బు చివరికి ఒకరి ప్రాణం తీసింది. అప్పుగా ఇచ్చిన పైసలు అడుగుతున్నాడనే కోపంతో సాయికిరణ్‌ అనే యువకుడిని కత్తితో పొడిచి చంపేశాడు మహేంద్ర. ఈ దారుణమైన ఘటన కడప చిన్నచౌకు ఠాణా పరిధిలో జరిగింది.

New Update
ఇచ్చిన పైసలు అడిగాడనే కోపంతో.. ఫ్రెండ్ ను అలా చేసిన యువకుడు

స్నేహం పేరుతో అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగిన పాపానికి ఫ్రెండ్ అని చూడకుండా దారుణంగా చంపేశాడు ఓ యువకుడు. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేస్తున్న క్రమంలో ఏర్పడిన పరిచయంతో తీసుకున్న పైసలు పెట్టిన గడువులోగా చెల్లించకపోగా తిరిగి అప్పు ఇచ్చిన వాడినే బెదిరించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో అనుకోకుండా ఎదురుపడిన అతడిని బాకీ ఇచ్చిన యువకుడు నిలదీశాడు. అయితే ఈ విషయాన్ని అవమానంగా భావించి కత్తితో పొడిచి బాధితుడిని చంపేశాడు.

Also read : దీపావళి రోజే దారుణం.. ప్రేమించి పెళ్లాడిన భార్యను ఏం చేశాడంటే

ఈ మేరకు కడప చిన్నచౌకు ఠాణా పరిధికి చెందిన సీఐ నరసింహారెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వైయస్‌ఆర్‌ జిల్లా ఒంటిమిట్ట మండలం మంటపంపల్లెకు చెందిన పి.సాయికిరణ్‌ (25) బీటెక్‌ చదివారు. కొద్ది రోజులు బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేసి జాబ్ మానేశారు. అయితే ఉద్యోగంలో భాగంగా పరిచయమైన కడప నగరానికి చెందిన మహేంద్ర అనే స్నేహితుడికి రూ.50 వేలు అప్పు ఇచ్చారు సాయి. వాటిని మూడు నెలల్లో తిరిగి ఇస్తానన్న మహేంద్ర గడువు తీరినా ఇవ్వలేదు. వాయిదాల మీద వాయిదాలు వేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి టీ దుకాణం వద్ద వారిద్దరూ కలిశారు. డబ్బుల గురించి మరోసారి వాగ్వాదానికి దిగారు. ఈ నేపథ్యంలో సాయికిరణ్‌ దుర్భాషలాడారు. దీంతో కోపోద్రిక్తుడైన మహేంద్ర తన వద్ద ఉన్న కత్తితో సాయికిరణ్‌ కడుపులో పొడవడంతో ఆయన కుప్పకూలిపోయారు. ఆ వెంటనే మహేంద్ర తన కారులోనే సాయికిరణ్‌ను నగరంలోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లాడు. వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించడంతో మృతదేహాన్ని అదే కారులో నేరుగా చిన్నచౌకు ఠాణాకు తీసుకొచ్చి విషయాన్ని పోలీసులకు చెప్పి లొంగిపోయినట్లు పోలీసులు తెలిపారు. దీంతో మహేంద్రపై కేసు నమోదు చేసి మరిన్ని వివరాలకోసం విచారణ జరపుతున్నట్లు వెల్లడించారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

ముంబై నుంచి హీరోయిన్‌ని తీసుకొచ్చి.. అరెస్టైన ఆ IPS చేసిన పని ఇదేనా..?

సీనియర్ IPS ఆంజనేయులు YCP హయాంలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. జైత్వానీని 42రోజు జుడ్యీషియల్ కస్డడీలో చిత్ర హింసలు పెట్టారని ఆమె ఆరోపించారు.YCP లీడర్ కుక్కల విద్యాసాగర్ పెట్టిన తప్పుడు కేసులో ఆమెను వేధించారని తెలిసింది.

New Update
Kadambari Jatwani Case

ఆంధ్రప్రదేశ్ సీనియర్ IPS అధికారి పి.ఎస్.ఆర్.ఆంజనేయులుని ఏపీ పోలీసులు మంగళవారం హైదరాబాదులో అరెస్ట్ చేశారు. ఆయన వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ ఇంటిలిజెన్స్ చీఫ్‌గా కూడా పని చేశారు. నటి జెత్వానీ కేసులో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనే కేసులో పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు. ఓ భూవివాదంలో వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్‌ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు పెట్టి కాదంబరి జైత్వానీని 42 రోజులపాటు జ్యూడీషియన్ కస్టడీలో ఉంచారు.

Also read : Official బిగ్ బ్రేకింగ్: యూపీలో అఘోరీ అరెస్ట్

కుక్కల విద్యాసాగర్‌ భూమిని జైత్వానీ ఫోర్జరీ సంతకాలతో వేరే వ్యక్తులకు అమ్మాలని యత్నించారని ఆమెతోపాటు ఆమె తల్లిదండ్రులపై ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో 2024 ఫిబ్రవరి 2న కేసు పెట్టారు. దానికి 2 రోజులు ముందే (జనవరి 31) అప్పటి విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్ కాంతి రానా టాటా, డీసీపీ విశాల్ గున్నిలను పిలిపించిన పీఎస్ఆర్ ఆంజనేయులు, ముంబయిలో ఉన్న జత్వానీని అరెస్టు చేసి తీసుకురావాల్సిందిగా ఆదేశించారు. దాదాపు 40 రోజులు కస్టడీలో మానసిక, శారీరక వేధింపుల ఎదుర్కొన్నట్లు ఆమె తెలిపారు. 2024 మేలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారాన్ని దక్కించుకుంది. వైసీపీ ప్రభుత్వం హయాంలో అధికార దుర్వినియోగానికి పాల్పడిన జత్వానీ కేసు ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. 

Also read: మోదీకి సౌదీ పర్యటనలో ఫైటర్ జెట్ల ఎస్కార్ట్.. 6 విమానాలతో స్వాగతం (VIDEO)

తనతోపాటు తన తల్లిదండ్రులపై తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేసి చిత్రహింసలకి గురి చేశారని జత్వానీ 2024 ఆగస్టు 30న విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులోనే ఆమె ముగ్గురు ఐపీఎస్ అధికారుల పేర్లను ప్రస్తావించారు. తనను ఇబ్బంది పెట్టిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. ఈ వ్యవహారంపై విచారణ తర్వాత నివేదిక ప్రభుత్వానికి అందింది. ప్రభుత్వం ఈ కేసును సీఐడీకి అప్పగించింది.

Also read: New Pope: కొత్త పోప్ ఎన్నికలో కీలకంగా నలుగురు ఇండియన్ కార్డినల్స్

ఆ నివేదిక ఆధారంగానే గత సెప్టెంబర్‌లో ఆ ముగ్గురు ఐపీఎస్ అధికారులు సస్పెండ్ అయ్యారు. ఆ కేసులో ప్రధాన నిందితుడైన కుక్కల విద్యాసాగర్‌ను కూడా అరెస్ట్ చేశారు. అప్పటి ఏపీ ఇంటిలిజెన్స్ చీఫ్‌ ఆంజనేయులు ఆధారాలు లేకుండా అసంపూర్తిగా ఉన్న ఫిర్యాదుతో ఉన్నత హోదాను అడ్డుపెట్టుకొని తప్పుడు ఆదేశాలు జారీ చేశారని తేలింది. ఈ ఆరోపణపై కూటమి ప్రభుత్వంలో ఆంజనేయులును సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఆర్డర్స్‌ జారీ చేసింది. ఏప్రిల్ 22న హైదరాబాద్‌లో ఏపీ పోలీసులు ఐపీఎస్ అధికారి ఆంజనేయులును అరెస్ట్ చేశారు.

( Kadambari Jatwani Case: | actress-jatwani | IPS officer Anjaneyulu | IPS Anjaneyulu | latest-telugu-news)

Advertisment
Advertisment
Advertisment