Viral Video : తోపుడు బండి మీద మ్యాగీ.. ఇదేం విడ్డూరం.

జనాలు వింతగా తయారవుతున్నారు. కొత్త కొత్త ఆలోచనలతో ఇదేం బుర్రరా అనిపిస్తున్నారు. మ్యాగీతో రకరకాల రెసిపీలు తయారు చేయడం చేశాం కానీ...నూడుల్స్‌ను కూరలు అమ్మినట్టు తోపుడు బండి మీద అమ్మడం ఎక్కడైనా చూశారా. అసలు ఇలా కూడా ఉంటుందా అని అనుకుంటున్నారా...అయితే ఇది చదివేయండి.

New Update
Viral Video : తోపుడు బండి మీద మ్యాగీ.. ఇదేం విడ్డూరం.

Selling Noodles Like Vegetables :  ఆ... నూడుల్స్ అండీ... త్వరగా రావాలండీ... అని వీధుల్లో అరుపు వినిపిస్తే మీరేం చేస్తారు. అవాక్కయి పోయి చూస్తారు కదా. ఈ వీడియో చూసి నెటిజన్లు కూడా అదే అవుతున్నారు. ఎక్కడో తెలియదు కానీ ఓ వ్యక్తి నిజంగానే కూరల బండి మీద నూడుల్స్(Noodles) రాసిలా పోసి అమ్ముతున్నాడు. తోపుడు బండి మీద పెద్ద ఎత్తున ఐపెన్‌గా బ్యాగీ నూడుల్స్ వేసుకుని లూజ్‌గా అమ్ముతున్నాడు. అదొక్కటే కాదు నూడుల్స్‌తో పాటూ మసాలా ప్యాకెట్లు(Masala Packets) కూడా ఇస్తున్నాడు. కానీ ఇతని దగ్గర ఒక ప్యాకెట్ మ్యాగీ అని అడగకూడదు... పావు కిలో, అరకిలో.. కిలో.. ఇలా అడగాలి. ఎందుకంటే అతను తూకం పెట్టుకుని... కూరగాయలను తూచినట్టు అలానే నూడుల్స్‌ను తూచి ఇస్తున్నాడు.

ఇలాంటివి తింటే ఇంకేమైనా ఉందా..

మామూలుగానే మ్యాగీ ఆరోగ్యానికి హానికరం(Maggi Is Injurious To Health) అంటారు. అందులో మైదా ఉంటుంది తినొద్దు అని చెబుతారు. మసాలా ప్యాకెట్లలో ప్రిజర్వేటివ్స్ ఉంటాయి... పిల్లలకు పెట్టోద్దు అని కూడా అంటారు. అలాంటిది ఇతనెవరో తోపుడు బండి(Tofu Cart) మీదనే ఏకంగా నూడుల్స్ పెట్టి అమ్మేస్తున్నాడు. దాని మీద మూత లేదు... రోడ్డు మీద దుమ్ము, ధూళి అంతా పడుతూనే ఉంది. కానీ వింత ఏంటంటే జనాలు ఇవేమీ ఆలోచించడం లేదు. ఆ బండి అతని దగ్గరకు వచ్చి మ్యాగీ కొనుక్కుని మరీ వెళుతున్నారు.

లక్షల్లో వ్యూస్..

ప్రస్తుతం ఈ మ్యాగీ సెల్లింగ్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇదే చోద్యం అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. మరి కొంతమంది అయితే ఇలా ఓపెన్‌గా బండి మీద నూడుల్స్ అమ్మితే ప్రజల ఆరోగ్యాలు ఏం కావాలి అని కామెంట్లు పెడుతున్నారు. కానీ ఈ వీడియోకి అయితే వ్యూస్ లక్షల్లో వస్తున్నాయి.

Also Read : Movies: తేజ సజ్జా కోసం మిరాయ్ స్క్రిప్ట్‌లో మార్పులు

Advertisment
Advertisment
తాజా కథనాలు