మనిషి కాదు రాక్షసి.. ఏడుస్తోందని చిన్నారిని చిదిమేసింది.. ఎక్కడ జరిగిందంటే.. జబల్ పూర్‌లో దారుణం జరిగింది. పదే పదే ఏడుస్తూ తన నిద్రను పాడు చేస్తోందని ఆగ్రహంతో రెండేళ్ల చిన్నారిని గొంతు నులిమి చంపేసింది పిన్ని. By Shiva.K 18 Oct 2023 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Madhya Pradesh: మనుషుల్లో మానవత్వం రోజు రోజుకు నశించిపోతోంది. తాజాగా అబంశుభం తెలియని చిన్నారిని ఓ మహిళ గొంతు పిసికి చంపేసింది. ఆ చిన్నారి ఏడవటమే.. ఈ దారుణానికి కారణమట. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని(Madhyapradesh) జబల్‌పూర్‌లో(Jabalpur) చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఓసారి తెలుసుకుందాం.. జబల్ పూర్‌లో దారుణం జరిగింది. పదే పదే ఏడుస్తూ తన నిద్రను పాడు చేస్తోందని ఆగ్రహంతో రెండేళ్ల చిన్నారిని గొంతు నులిమి చంపేసింది పిన్ని. పిన్ని అంటే ఆ చిన్నారికి ఇష్టం. ఆ ఇష్టంతోనే.. అమ్మను సైతం కాదని పిన్ని వద్దకు పడుకుంది. అయితే, ఆ అహిళ తనకు నిద్ర వస్తుందని, చిన్నారిని తన తల్లి వద్దకు వెళ్లాలని చెప్పింది. చిన్నారి వినకుండా అక్కడే ఉండటంతో చెంపమీద కొట్టింది. దాంతో చిన్నారి గుక్కపట్టి ఏడ్చింది. మరింత ఆగ్రహించిన మహిళ.. చిన్నారిని గొంతు పిసికి చంపేసింది. ఈ విషయం ఎవరికీ తెలియకుండా ఉండేందుకు.. చిన్నారి మృతదేహాన్ని సోఫా కింద దాచి పెట్టింది. చిన్నారి కనిపించకపోవడంతో ఆమె తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. ఎక్కడ వెతికినా కనిపించలేదు. దాంతో.. వారు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇంటి చుట్టు పక్కన ఉన్న సీసీ కెమరాలన్నీ పరిశీలించారు. చిన్నారి ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆనవాళ్లే కనిపించలేదు. దాంతో పోలీసులు ఇంట్లో గాలించారు. అప్పుడు మ్యాటర్ తెలిసింది. అనుమానాస్పదంగా ప్రవర్తిస్తుండటంతో మహిళను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు పోలీసులు. దాంతో ఆ పిన్న మొత్తం వివరాలను చెప్పేసింది. హత్యగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆమెను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. Also Read: Gold Rates Today: అతివలకు అదిరిపోయే న్యూస్.. తగ్గిన బంగారం ధరలు.. ఇవాళ ఎంతంటే.. Hyderabad: బాబోయ్.. బంగారు కొండలు, వెండి గుట్టలు.. మ్యాటర్ తెలిస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే.. #madhya-pradesh #jabalpur మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి