Police crime: తండ్రి చేసిన నేరానికి.. తల్లీకొడుకును చావబాదిన పోలీసులు: వీడియో
మధ్యప్రదేశ్ రాష్ట్రం కట్నిలో దారుణం చోటుచేసుకుంది. తండ్రి దొంగతనం కేసులో 15ఏళ్ల బాలుడితో పాటు అతడి నానమ్మను పోలీసులు లాఠీలతో చితకబాదారు. తలుపులు మూసి మూకుమ్మడిగా చిత్రహింసలు పెట్టారు. దాడి వీడియో వైరల్ అవుతుండగా.. SP రంజన్ దీనిపై విచారణకు ఆదేశించారు.
Madhya Pradesh: మధ్యప్రదేశ్ రాష్ట్రం కట్నిలో 15 ఏళ్ల దళిత బాలుడితో పాటు అతడి నానమ్మను పోలీసులు దారుణంగా కొట్టిన వీడియో వైరల్ అవుతోంది. GRP పీఎస్ లో CI అరుణ వహానే తలుపులు మూసి వారిని లాఠీతో చితకబాదారు. తర్వాత పలువురు పోలీసులు వారిద్దరినీ చిత్రహింసలకు గురిచేశారు. బాలుడి తండ్రిపై పలు దొంగతనాల కేసులు ఉండటంతో వీరిద్దరినీ తీసుకొచ్చి కొట్టినట్లు తెలుస్తోంది. ఈ ఘటన గతేడాది జరిగినట్లు గుర్తించిన జిల్లా SP రంజన్ విచారణకు ఆదేశించారు.
BIG BREAKING: ‘సింగపూర్‌లో పవన్ కళ్యాణ్ కొడుక్కి ప్రధాని మోదీ సాయం’
అగ్ని ప్రమాదంలో పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ గాయపడినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. మార్క్ శంకర్‌ను కాపాడిన సింగపూర్ స్కూల్ సిబ్బందికి కృతజ్ఞతలు చెప్పారు. పవన్‌తో మోదీ మాట్లాడి.. అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చినట్లు మంత్రి తెలిపారు.
సింగపూర్‌లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు చదువుతున్న స్కూల్‌లో అగ్ని ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ఈ సంఘటనపై ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారిక సమాచారాన్ని వెల్లడించారు. ప్రధాన మంత్రి మోదీ కూడా పవన్ కళ్యాన్‌కు ఫోన్ చేసి మాట్లాడారని ఆయన చెప్పారు. ప్రమాదం గురించి, బాబు ఆరోగ్య పరిస్దితి గురించి మోదీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ఆరా తీశారు. చికిత్స పొందుతున్న పవన్ కుమారుడు త్వరగా కోలుకోవాలని మోదీ ఆకాంక్షించారు. ప్రమాదంలో పవన్ కుమారుడు మార్క్ శంకర్ గాయపడినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
సింగపూర్‌లో పవన్ కుమారుడు గాయపడ్డారు, ప్రమాదంలో ఒకరు మృతి చెందారు, 15 మందికి గాయాలయ్యాయి..
మార్క్ శంకర్‌ను కాపాడిన సిబ్బందికి కృతజ్ఞతలు, ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది..
ప్రమాదంపై పవన్‌తో మోదీ మాట్లాడారు, అవసరమైన సహాయం అందిస్తామని మోదీ చెప్పారు. -నాదెండ్ల మనోహర్.… pic.twitter.com/9gxRk7j4P5
స్కూల్ అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న పవన్ చిన్న కొడుకు మార్క్ శంకర్‌ను కాపాడిన సిబ్బందికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం ఆస్పత్రిలో బాలుడికి చికిత్స కొనసాగుతోందని జనసేన లీడర్ తెలిపారు. జరిగిన ప్రమాదంపై పవన్ కళ్యాణ్‌తో మోదీ మాట్లాడారని ఆయన చెప్పారు. అవసరమైన సహాయం అందిస్తామని ప్రధాని మోదీ చెప్పారని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.