Actress Madhavi Latha: భగవంత్‌ కేసరి సినిమా పై నటి సంచలన కామెంట్లు!

నటి , రాజకీయ నాయకురాలు మాధవీ లత..బాలకృష్ణ తాజా చిత్రం భగవంత్‌ కేసరి గురించి సంచలన వ్యాఖ్యాలు చేసింది. సినిమాలో చెప్పిన మాటలు నిజ జీవితంలో కూడా ఆచరించాలంటూ బాలకృష్ణ మీద సెటైర్లు వేసింది.

New Update
కాంగ్రెస్ పాలనలో మీకు దక్కేవి ఇవే..నటి మాధవీలత వైరల్ పోస్ట్

బాలకృష్ణ  హీరోగా , కాజల్‌, శ్రీలీల నటించిన సినిమా ''భగవంత్‌ కేసరి''. గత నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్‌ తెచ్చుకుని హిట్‌ ని సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని అనిల్‌ రావిపూడి డైరెక్షన్లో తెరకెక్కించారు. తాజాగా ఈ సినిమా గురించి, అందులోని హీరో గురించి సంచలన కామెంట్లు చేసింది హీరోయిన్‌ మాధవీ లత.

ఈ సినిమాలో హీరో చేత గుడ్‌ టచ్‌, బ్యాడ్ టచ్‌ ల గురించి వివరించడం బాగానే ఉంది. అలా చెప్పించడం కూడా చాలా మంచి విషయం అని ఆమె పేర్కొంది. ఈ సినిమాలో హీరోయిన్‌ ని గ్లామర్‌ పాత్రకి పరిమితం చేసి హీరో చేత ఇలాంటి డైలాగులు చెప్పించడం ఆలోచించాల్సిన విషయం అంటూ మాధవీ లత పేర్కొంది.

Also read: ఏం చేస్తున్నార్రా మీరు అసలు..ఇంతకంటే దరిద్రం ఉంటుందా !

ఈ సినిమా లో శ్రీలీల పాత్ర బాగుందని విన్నానని ఆమె వివరించారు. ఆమెతో కూడా అలాంటి పాత్ర కాకుండా గ్లామర్‌ పాత్ర చేయిస్తే..చేసేది శివపూజ దూరేది ఇంకేక్కడో అన్నట్లు గా ఉంటుందని ఆమె పేర్కొంది. అంతేకాకుండా..ఆమె మాట్లాడుతూ..డైలాగులు చెప్పవడం వరకే కాదు.. ఆ డైలాగులు చెప్పే వారు నిజ జీవితంలో కూడా పాటిస్తే మంచిది అంటూ ఓ బాంబ్‌ పేల్చింది.

ప్రస్తుతం ఆమె వేసిన ఈ సెటైర్‌ హాట్‌ టాపిక్‌ గా మారింది. ఆమె నేరుగా ఎవరినీ విమర్శించకపోయినా బాలకృష్ణను పరోక్షంగా విమర్శించినట్టు అనిపిస్తోందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

మాధవీలత స్నేహితుడా, నచ్చావులే వంటి సినిమాలలో హీరోయిన్‌ గా నటించింది. ఆ తరువాత మాత్రం ఆమె సినిమాలు చేయలేకపోయింది. కొంతకాలం క్రితం ఆమె బీజేపీలో చేరి ఎమ్మెల్యేగా పోటీ చేసి డిపాజిట్లు కోల్పోయింది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Priyanka Jain: అబ్బా! బ్లూ శారీలో ప్రియాంక భలే ఉందిగా.. ఫొటోలు చూశారా

బిగ్ బాస్ బ్యూటీ, బుల్లితెర నటి ప్రియాంక జైన్ నీలిరంగు చీరలో ఆకట్టుకుంటోంది. స్టన్నింగ్ ఫోజులతో నెటిజన్లను ఫిదా చేస్తోంది. ఈ ఫొటోలను మీరు కూడా చూసేయండి. Short News | Latest News In Telugu | సినిమా

New Update
Advertisment
Advertisment
Advertisment