Andhra Pradesh: శాంతి వ్యవహారంలో కీలక మలుపు.. ఢిల్లీలో ధర్నా చేయనున్న మదన్‌మోహన్

మాజీ సీఎం జగన్‌, వైసీపీ నేతలు బుధవారం ఢిల్లీలో నిరసన చేయనున్నారు. దేవాదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్ శాంతి వ్యవహారానికి సంబంధించి.. మదన్‌మోహన్‌, ఆయన మద్దతుదారులు కూడా వారికి సమీపంలో ధర్నా చేయాలని నిర్ణయించుకున్నారు.

New Update
Andhra Pradesh: శాంతి వ్యవహారంలో కీలక మలుపు.. ఢిల్లీలో ధర్నా చేయనున్న మదన్‌మోహన్

Shanti: దేవాదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్ శాంతి వ్యవహారంలో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ వ్యవహారానికి సంబంధించి బుధవారం ఢిల్లీలో నిరసన చేయాలని మదన్‌మోహన్‌ (Madan Mohan), ఆయన మద్దతుదారులు నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు మాజీ సీఎం జగన్‌ (YS Jagan), వైసీపీ నేతలు కూడా చంద్రబాబు పాలనకు వ్యతిరేకంగా బుధవారం ఢిల్లీలో నిరసన చేయనున్నారు. దీంతో వైసీపీ ధర్నాకు సమీపంలోనే నిరసన చేయాలని మదన్‌మోహన్ మద్దతుదారులు నిర్ణయించుకున్నారు.

Also read: బడ్జెట్‌లో జనగణనకు తక్కువ కేటాయింపులు.. ఈ ఏడాది కూడా జరగనట్లేనా ?

వైఎస్‌ జగన్‌ను కూడా కలవాలని మదన్‌మోహన్‌ నిర్ణయించుకున్నారు. ఇప్పటికే విజయసాయి రెడ్డి డీఎన్‌ఏ టెస్టు చేయించుకోవాలని డిమాండ్ చేశారు. డీఎన్‌ఏ టెస్టుకు సిద్ధంగా లేకపోతే వైసీపీ నుంచి విజయసాయిని సస్పెండ్‌ చేయాలని జగన్‌ను మదన్‌మోహన్‌ కోరనున్నట్లు తెలుస్తోంది. ఇరువర్గాల మధ్య పోటాపోటీ ధర్నాలతో ఢిల్లీలో ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయో అనేదానిపై ఉత్కంఠ నెలకొంది.

Also read: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్.. ఆ 6గురు ఎమ్మెల్యేలు జంప్?

Advertisment
Advertisment
తాజా కథనాలు