Ananth Sriram: గేమ్ చేంజర్ సాంగ్ ట్రోల్స్ పై అనంత్ శ్రీరామ్ రియాక్షన్..! నెక్స్ట్ రామ్ చరణ్ ఇంట్రో సాంగ్

గేమ్ చేంజర్ 'జరగండి జరగండి' సాంగ్ ట్రోల్ల్స్ పై లిరిసిస్ట్ అనంత్ శ్రీరామ్ స్పందించారు. "ఒకరి దృష్టిని ఆకర్షిస్తుంది అంటే అది గొప్ప హిట్ అయినట్లే. ఈ మధ్యకాలం మీమ్స్, ట్రోల్స్ లేకుండా ప్రజల దృష్టిని ఆకర్షించడం కష్టమవుతుందని అన్నారు."

New Update
Ananth Sriram:  గేమ్ చేంజర్ సాంగ్ ట్రోల్స్ పై అనంత్ శ్రీరామ్ రియాక్షన్..! నెక్స్ట్ రామ్ చరణ్ ఇంట్రో సాంగ్

Ananth Sriram: RRR తర్వాత రామ్ చరణ్ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ 'గేమ్ చేంజర్'. శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ భారీ అంచనాలు ఉన్నాయి.
ఇటీవలే ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తి చేసుకున్నాడు చరణ్. ప్రస్తుతం ఈ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పనుల్లో బిజీగా ఉంది గేమ్ చేంజర్. ఈ చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఇటీవలే గేమ్ ఛేంజర్ నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్ 'జరగండి జరగండి' మెగా ఫ్యాన్స్ ను కాస్త డిసప్పాయింట్ చేసింది. ఈ సాంగ్ పై సోషల్ మీడియాలో రకరకాల ట్రోల్స్, మీమ్స్ వచ్చాయి.

ట్రోల్స్, మీమ్స్ పై అనంత్ శ్రీరామ్ కామెంట్స్

అయితే తాజాగా ఈ ట్రోల్స్, మీమ్స్ పై స్పందించారు లిరిసిస్ట్ అనంత్ శ్రీరామ్. ఆయన మాట్లాడుతూ.. ఒకరి దృష్టిని ఆకర్షిస్తుంది అంటే అది గొప్ప హిట్ అయినట్లే. ఈ మధ్యకాలం మీమ్స్, ట్రోల్స్ లేకుండా ప్రజల దృష్టిని ఆకర్షించడం కష్టమవుతుంది. అన్ని మీమ్స్, ట్రోల్స్ వచ్చాయంటే ప్రజల నుంచి విజయం వచ్చినట్లే అర్థం అని అన్నారు. అలాగే గేమ్ చేంజర్ నుంచి నెక్స్ట్ రామ్ చరణ్ ఇంట్రో సాంగ్ కూడా ఉండబోతుందని తెలిపారు. అనంత్ శ్రీరామ్ సంభాషణ కోసం ఈ కింది వీడియోను చూడండి.

Also Read: Javed Akhtar: దానికి బానిసనై.. పదేండ్ల సమయాన్ని వృథా చేశా! జావేద్‌ అక్తర్‌ కామెంట్స్ - Rtvlive.com

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు