Ap: రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం..ఏపీలో ఆ జిల్లాలకు భారీ వర్ష సూచన!

ఏపీ, యానాంలో నైరుతి దిశగా బలమైన గాలులు వీస్తున్నాయి. దీంతో బుధవారం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖాధికారులు అంటున్నారు. ఈ అల్పపీడనం బలపడుతూ..ఉత్తర దిశగా ప్రయాణించే అవకాశాలున్నట్లు వాతావరణశాఖాధికారులు తెలిపారు.

New Update
Ap: రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం..ఏపీలో ఆ జిల్లాలకు భారీ వర్ష సూచన!

Ap: ఏపీ, యానాంలో నైరుతి దిశగా బలమైన గాలులు వీస్తున్నాయి. దీంతో బుధవారం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖాధికారులు అంటున్నారు. ఈ అల్పపీడనం బలపడుతూ..ఉత్తర దిశగా ప్రయాణించే అవకాశాలున్నట్లు వాతావరణశాఖాధికారులు తెలిపారు. బుధవారమే అల్పపీడనం ఏపీ తీరాన్ని తాకనుంది.

ఈ అల్పపీడనం ప్రభావంతో బుధవారం సాయంత్రం నుంచి ఏపీలో మోస్తరు వర్షాలు కురవనున్నాయి.దీని వల్ల ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో ముసురు ఏర్పడనుంది. ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఏపీలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి. జూన్‌ 27, 28 తేదీల్లో పలు చోట్ల విస్తారంగా వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.

తెలంగాణలో కూడా రానున్న 2, 3 రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. రానున్న ఐదు రోజులు వాతావరణం మేఘావృతమై మోస్తరు వర్షాలు కురవనున్నాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

Also read: ఘోర అగ్ని ప్రమాదం..ఇన్వర్టర్‌ లో మంటలు రేగి..నలుగురు ఊపిరాడక..!

Advertisment
Advertisment
తాజా కథనాలు