Love Astrology : ఈ రాశి వారికి ఆఫీస్‌లోనే లవర్‌ దొరకవచ్చు.. అపార్థాలు కూడా తొలగిపోతాయి.. మరి మిగిలిన రాశివారికి ఎలా ఉందంటే?

ప్రేమంటే పెదాలు పలికే పదాలు కాదు.. పెదాలు సైతం పలకలేని భావాలని చెబుతుంటారు ప్రేమికులు. ఇక పవిత్రమైన ప్రేమ చుట్టూ కూడా కొన్ని నమ్మకాలు పెన వేసుకోని ఉన్నాయి. కొంతమంది లవ్‌ అస్ట్రాలజీని నమ్ముతారు. మరి ఇవాళ ఏ రాశి వారి ప్రేమ ఎలా ఉందో తెలుసుకోవడానికి ఆర్టికల్‌లోకి వెళ్లండి.

New Update
Love Astrology : ఈ రాశి వారికి ఆఫీస్‌లోనే లవర్‌ దొరకవచ్చు.. అపార్థాలు కూడా తొలగిపోతాయి.. మరి మిగిలిన రాశివారికి ఎలా ఉందంటే?

Love Horoscope March 2 : ప్రేమ(Love) కు అవధులు ఉండవు. ఎల్లలు లేనిది, సరిహద్దులు లేనిదే ప్రేమ. అయితే కొంతమంది రాశిచక్రాలను బాగా నమ్ముతారు. తమ రాశుల బట్టే ప్రేమ జీవితం కూడా ఆధారపడి ఉంటుందని భావిస్తారు. ఎవరి నమ్మకం వారిది కావొచ్చు. ఇలా ప్రేమని, వైవాహిక జీవితాన్ని(Marriage Life) కూడా రాశితో ముడిపెట్టేవారు ప్రతి రోజూ రాశిచక్రాలు ఎలా ఉన్నాయో చెక్‌ చేసుకుంటారు. ఇవాళ(మార్చి 2)శనివారం. అంటే వికేండ్‌లో బెస్ట్‌ డే(Weekend Best Day) గా చెప్పవచ్చు. శనివారం ప్రేమ జంటలు ఎక్కువగా షికారుకు వెళ్తాయి. పార్కులకు, సినిమాలకు వెళ్తాయి. మంచి రొమాంటిక్‌ మూడ్‌లో రోజును గడుపుతాయి. ఇక మీ ప్రేమ కూడా ఇలానే ఆనందంగా, ఆహ్లందంగా సాగిపోతుందా లేదా ఎవరైనా శనిగాడు తగులుతాడా అన్నది రాశిచక్రాల(Zodiac) ద్వారా తెలుసుకోవచ్చు.

publive-image

మేష రాశి: మీరు మీ మనసు చెప్పిందే వినాలి. మీ భాగస్వామి భావాల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ప్రేమికుల మధ్య అపార్థాలు తొలగిపోతాయి. ఈ రోజు ఈ రాశిలోని లవర్స్‌కు డే అంతా రొమాంటిక్ గా ఉంటుంది.

వృషభ రాశి : ఈ రోజు మీరు మీ భాగస్వామిని కనుగొంటారు. కానీ తమ భాగస్వామి(Partner) తో పెళ్లి గురించి కలలు కనే ప్రేమికులకు ఈ రోజు అనుకూలంగా ఉండదు.

మిథున రాశి: ఈ రోజు మీ మనస్సు శక్తితో నిండి ఉంటుంది. ప్రేమ సంబంధాలు బలంగా ఉంటాయి. కొత్త సంబంధాలు(New Relations) ఏర్పడతాయి. మీ వైవాహిక జీవితంలో మీరు మంచి ఫీల్‌ టచ్‌ను అనుభవిస్తారు.

కర్కాటక రాశి : ఈ రోజు ప్రేమ వ్యవహారాల పరంగా మంచి రోజు. మీరు మీ భాగస్వామితో మంచి శృంగారాన్ని అనుభవించగలుగుతారు. అటు మీ ప్రేమకష్టానికి తగిన ప్రతిఫలం తప్పకుండా లభిస్తుంది.

సింహం: భార్యాభర్త(Wife &Husband) ల మధ్య సంబంధ బాంధవ్యాల్లో ఉద్రిక్తత నెలకొంటుంది. ఈ రోజు మీ కోపాన్ని నియంత్రించుకోండి. ఆఫీసులో, కాలేజీలో స్నేహితులతో సఖ్యత పెరుగుతుంది.

publive-image

కన్యా రాశి : ఈ రోజు మీరు మీ ప్రేమికుడికి ప్రేమను వ్యక్తపరుస్తారు. ప్రయాణాలు కూడా సాధ్యమే. ప్రేమ సంబంధాలకు ఈ రోజు అదృష్టకరమైన రోజు.

తుల రాశి: మీరు జీవిత భాగస్వామి కోసం చూస్తున్నట్లయితే.. మీరు మీ ఆఫీస్‌లోనే లవర్‌(Office Lover) ని కనుగొంటారు. ఈ రోజు మీ బంధానికి సంబంధించి కుటుంబ కలహాలు ఏవైనా ఉంటే అవి సమసిపోతాయి.

వృశ్చిక రాశి : ఉద్యోగం చేసే భార్య కావాలనుకునే వారి కోరికలు నెరవేరుతాయి. మీకు ఆఫీస్‌లోనే లవర్‌ దొరకవచ్చు.

ధనుస్సు రాశి: మీ నిరంకుశత్వం వల్ల కుటుంబంలో విభేదాలు తలెత్తుతాయి. ఎవరైనా మోసం చేయవచ్చు. ఆర్థిక కారణాల వల్ల భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తుతాయి.

మకర రాశి: ఈ రోజు మీ లవర్‌ మీ మాట వింటారు. ప్రేమ సంబంధాలు దృఢంగా ఉంటాయి. ఈ రోజు ఈ రాశి వారికి రొమాంటిక్ డే.

publive-image

కుంభం: మనస్సులో విస్మయం కలుగుతుంది. మీరు మీ లవర్‌ను విశ్వసించరు. దానివల్ల మనసు కాస్త విచారంగా ఉంటుంది.

మీన రాశి: ఈ రోజు మీరు మీ భాగస్వామిని కనుగొంటారు. ఇక ఆఫీస్ ఫ్రెండ్ తో ఎక్కువ సమయం గడపవచ్చు.

ముఖ్యగమనిక: ఈ ఆర్టికల్‌ ఇంటర్‌నెట్‌లో ఉన్న సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. ఇది నిజమని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రియ ఆధారాలు లేవు.

Also Read: శనిదోషం వదలట్లేదా? ఇలా చేస్తే విముక్తి పొందుతారు!

Advertisment
Advertisment
తాజా కథనాలు