Nails: చేతి గోళ్లు పెంచుకుంటున్నారా? ఏం జరుగుతుందో తెలిస్తే మళ్లీ ఆ పని చేయరు!

పొడవాటి గోళ్లలో అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. పొడవాటి గోళ్లలోకి మురికి, బ్యాక్టీరియా ఈజీగా ఎంట్రీ ఇస్తుంది. అవే చేతులతో మనం ఫుడ్‌ తింటాం. పొడవాటి గోళ్ల కింద దుమ్ము, ధూళి ఈజీగా ట్రాప్‌ అవుతాయి. పొడవాటి గోళ్లతో కీబోర్డు టైప్ చేయడం కష్టం. ఇది మీ వర్క్‌పై నెగిటివ్‌ ఎఫెక్ట్ చూపిస్తుంది.

New Update
Nails: చేతి గోళ్లు పెంచుకుంటున్నారా? ఏం జరుగుతుందో తెలిస్తే మళ్లీ ఆ పని చేయరు!

ఈ మధ్య చాలా మంది చేతి గోళ్లను పెంచుకుంటున్నారు. ఫ్యాషన్‌ అని చెబుతూ గోళ్లను ఇలా చేసే వారి సంఖ్య పెరుగుతోంది. కొంతమంది 5 ఫింగర్స్‌లో ఏదో ఒక దాన్నే పెంచుతుంటారు. మరికొందరు అన్నీ ఫింగర్స్‌ గోళ్లను పెంచుతుంటారు. ఇది అసలు మంచిది కాదంటున్నారు వైద్య నిపుణులు. ఇలా గోళ్లను పెంచుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు.

కింది కారణాల వల్ల గోళ్లను అతిగా పెంచకూడదు:

పరిశుభ్రత: పొడవాటి గోళ్లలో మురికి, బ్యాక్టీరియా ఈజీగా పేరుకుపోతుంది. దీని వల్ల ఇన్ఫెక్షన్లు రావచ్చు. ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని ఇది పెంచుతుంది. మన గోళ్లలో చాలా చెత్త ట్రాప్‌ అవుతుంది.

ఇలా పొడవాటి గోళ్లలోని మురికి, బ్యాక్టీరియాతో మీరు మీ ముఖాన్ని తాకినప్పుడు అది మీ ఫేస్‌పై కూడా అంటుకుంటుంది. ఫుడ్‌ తినే సమయంలో కూడా మీ చేతి గోళ్లలోని మురికి ఆ ఆహారంలో కలిసిపోతాయి. అవే మన నోటి ద్వారా శరీరంలోకి ఎంట్రీ ఇస్తాయి. ఇది అనారోగ్యాలకు దారి తీస్తుంది.

ఫంగల్ ఇన్ఫెక్షన్లు: పొడవాటి గోళ్లు ఒనికోమైకోసిస్ లాంటి ఫంగల్ ఇన్ఫెక్షన్లను పెంచే అవకాశం ఉంటుంది.

డస్ట్: దుమ్ము, ధూళి పొడవాటి గోళ్ల కింద ఈజీగా ట్రాప్‌ అవుతాయి. ఇది సూక్ష్మజీవులకు సంతానోత్పత్తి చేసుకునేలా ప్లేస్‌ను క్రియేట్ చేస్తుంది.

స్కిన్ హెల్త్: పొడవాటి గోళ్లు చర్మ సమస్యలను కలిగిస్తాయి. గోళ్ల చుట్టూ ఉన్న చర్మాన్ని కూడా పాడు చేస్తాయి.

విరిగిపోవడం: పొడవాటి గోళ్లు విరిగిపోయే అవకాశం ఉంది. దీని వల్ల దెబ్బ తగిలి నొప్పి పుడుతుంది. ఈ నొప్పి భరించడం కష్టం.

పొడవాటి గోళ్లతో కీబోర్డు టైప్ చేయడం కష్టం. దీని వల్ల మీ వర్క్‌ ప్రొడక్టవిటీ తగ్గిపోతుంది. వంట చేయడం కూడా ఇబ్బంది. దాని వల్ల ఉప్పు కాస్త ఎక్కువ లేదా తక్కువ కూడా వేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీ చేతి గోళ్లలోనే ఉప్పు ట్రాప్‌ అవొచ్చు. మొత్తానికి రోజువారీ పనుల సామర్థ్యానికి ఇవి ఆటంకం కలిగిస్తాయి.

నిర్వహణ: పొడవాటి గోళ్లకు ఎక్కువ శ్రద్ధ అవసరం. ఇది మీ టైమ్‌ని కిల్ చేస్తుంది.

పొడవాటి గోళ్లలో అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. పొడవాటి గోళ్లలోకి మురికి, బ్యాక్టీరియా ఈజీగా ఎంట్రీ ఇస్తుంది. అవే చేతులతో మనం ఫుడ్‌ తింటాం. పొడవాటి గోళ్ల కింద దుమ్ము, ధూళి ఈజీగా ట్రాప్‌ అవుతాయి. పొడవాటి గోళ్లతో కీబోర్డు టైప్ చేయడం కష్టం. ఇది మీ వర్క్‌పై నెగిటివ్‌ ఎఫెక్ట్ చూపిస్తుంది.

Also Read: మీ పిల్లలు పదేపదే ఫోన్‌ చూస్తున్నారా? సైంటిస్టుల షాకింగ్‌ ప్రకటన..!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

TGSRTC: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. త్వరలో ఆర్టీసీలో 3,038 పోస్టుల భర్తీ

తెలంగాణ ఆర్టీసీ నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది. త్వరలో 3,038 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఆర్టీసీ సంస్థ వైస్‌ ఛైర్మన్, ఎండీ సజ్జనార్‌ ప్రకటించారు. దీనికి ప్రభుత్వం నుంచి పర్మిషన్ కూడా వచ్చిందని తెలిపారు.

New Update
RTC MD VC Sajjanar

RTC MD VC Sajjanar

తెలంగాణ ఆర్టీసీ నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది. త్వరలో 3,038 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఆర్టీసీ సంస్థ వైస్‌ ఛైర్మన్, ఎండీ సజ్జనార్‌ ప్రకటించారు. దీనికి ప్రభుత్వం నుంచి పర్మిషన్ కూడా వచ్చిందని తెలిపారు. వీటి భర్తీ తర్వాత కార్మికులు, ఉద్యోగులపై పనిభారం తగ్గుతుందని పేర్కొన్నారు. సోమవారం అంబేద్కర్  జయంతి సందర్భంగా ఆర్టీసీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ బాగ్‌లింగంపల్లిలో ఆర్టీసీ కళాభవన్‌లో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.  

Also Read: తెలంగాణ రాజకీయాల్లో పదవుల పంచాయితీ..పేలుతున్న మాటల తూటాలు!

అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించిన తర్వాత ఆయన మాట్లాడారు. కొత్తగా భర్తీ చేయనున్న పోస్టులకు ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామని కూడా చెప్పారు. సంస్థలోని ఉద్యోగులు, సిబ్బంది సంక్షేమానికి యాజమాన్యం కట్టుబడి ఉందని తెలిపారు. మరోవైపు ఎన్నికల్లో ఇచ్చిన జాబ్ క్యాలెండర్ హామీ ప్రకారం మరో 18వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.     

Also Read: అయోధ్య రామాలయంపై కీలక నిర్ణయం.. చుట్టూ 4 కి.మీ. రక్షణ గోడ ఏర్పాటు !

గ్రూప్​1,2,3,4 పోస్టులతోపాటు పోలీసు, గురుకుల రిక్రూట్మెంట్ బోర్డుల నుంచి కూడా నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. అలాగే మహిళా శిశు సంక్షేమ శాఖలో14,236 అంగన్ వాడీ, హెల్త్​ డిపార్ట్​మెంట్​లో 4 వేలకు పైగా పోస్టులకు ఏప్రిల్ చివరిలోగా నోటిఫికేషన్ రిలీజ్​ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. మరిన్ని శాఖల ఖాళీలపై స్పష్టత రాగానే  జాబ్​క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్స్ విడుదలకానున్నాయి. ఇక ఫిబ్రవరిలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్  నోటిఫికేషన్‌ను షెడ్యూల్​ చేసినప్పటికీ ఎస్సీ వర్గీకరణ కోసం వాయిదా వేశారు. గురుకుల ఉద్యోగాలు, సింగరేణి కాలరీస్, ఇంజినీరింగ్ పోస్టుల నోటిఫికేషన్స్ కూడా రిలీజ్ కావాల్సివుంది. 

Also Read: అమెరికా.. శాన్ డియాగోలో 5.1 తీవ్రతతో భూకంపం

 rtv-news | rtc | jobs

 

Advertisment
Advertisment
Advertisment