వైసీపీలోకి జేపీ..క్లారిటీ ఇచ్చిన లోక్‌సత్తా ఏపీ అధ్యక్షుడు!

లోక్‌ సత్తా పార్టీ వ్యవస్థాపకుడు జయప్రకాశ్‌ నారాయణ మరి కొద్ది రోజుల్లో వైసీపీలో చేరతారనే మాటలు జోరుగా వినిపిస్తున్నాయి. కొద్దిరోజుల క్రితం విజయవాడలో జరిగిన ఆప్కాబ్‌ వజ్రోత్సవ వేడుకల్లో జగన్‌ తో కలిసి జేపీ వేదిక పంచుకున్నారు.

New Update
వైసీపీలోకి జేపీ..క్లారిటీ ఇచ్చిన లోక్‌సత్తా ఏపీ అధ్యక్షుడు!

Jayaprakash Narayana : లోక్‌ సత్తా పార్టీ (Lok Satta Party) వ్యవస్థాపకుడు జయప్రకాశ్‌ నారాయణ మరి కొద్ది రోజుల్లో వైసీపీలో చేరతారనే మాటలు జోరుగా వినిపిస్తున్నాయి. కొద్దిరోజుల క్రితం విజయవాడలో జరిగిన ఆప్కాబ్‌ వజ్రోత్సవ వేడుకల్లో జగన్‌ (YS Jagan) తో కలిసి జేపీ వేదిక పంచుకున్నారు. జగన్‌ జేపీ పక్కనే కూర్చుని, ఇద్దరు నవ్వుకుంటూ మాట్లాడుకోవడం మీడియా దృష్టిని ఆకర్షించింది.

దీంతో జేపీ వైసీపీలో చేరతారని, విజయవాడ ఎంపీగా ఆయన పోటీ చేస్తారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ఊహాగానాలకు లోక్‌ సత్తా ఏపీ అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి స్పందించారు. దీని గురించి ఆయన మాట్లాడుతూ..అసలు జేపీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయరని తెలిపారు. ఇక వైసీపీలో చేరతారు అనే దాని మీద కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు.

జేపీ వైసీపీలో చేరతారు అనే ప్రచారం పూర్తిగా అవాస్తవం. గతంలో జేపీ ఆప్కాబ్‌ (APCOB) ఎండీగా పని చేశారు కాబట్టి ఆయనను జగన్‌ మర్యాద పూర్వకంగా ఆ వేడుకకు ఆహ్వానించారు. అందుకే ఆ వేడుకకు జేపీ హాజరయ్యారు. ఆప్కాబ్‌ ఎండీగా పని చేస్తున్నప్పుడు తీసుకున్న చర్యలు, ఆప్కాబ్‌ ను మరింత బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి చెప్పడానికి మాత్రమే ఆ కార్యక్రమానికి హాజరైనట్లు బాబ్జీ వివరించారు.

అసలు జేపీ (Jayaprakash Narayana) జగన్‌ సూచనలతో వైసీపీలో చేరతారని, విజయవాడ పార్లమెంట్‌ నుంచి బరిలో నిలుస్తారని దుష్ప్రచారం చేయడం సరైన పద్దతి కాదని బాబ్జి అన్నారు. జేపీ గొప్ప వ్యక్తి అని, ఆయన ఎప్పుడూ రాజకీయ పార్టీలను ప్రేమించరు. జేపీ ఒక శక్తిగా ఎదిగి అనేక రాజ్యాంగ సవరణలు తీసుకుని వచ్చిన వ్యక్తి అని ఆయన కొనియాడారు.

అలాంటి వ్యక్తి పై తప్పుడు ప్రచారం చేయడం సరైన పద్దతి కాదు. ఈ విషయాన్ని ప్రజలందరూ గమనించాలి. వేరే పార్టీలో చేరాల్సిన అవసరం ఆయనకు లేదు. దేశ, రాష్ట్ర అభివృద్ది కోసం జేపీ పనిచేస్తూనే ఉన్నారని, సలహాలు, సూచనలు ఇస్తారని చెప్పారు. జేపీ వైసీపీలో చేరతారనే ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని పిలుపునిచ్చారు.

Also Read: ముందు ఈ మూడింటికి సమాధానం చెప్పండి: అంబటి!

Advertisment
Advertisment
తాజా కథనాలు