Lokesh: యాదవులను బీసీ-బీలో చేర్చుతాం.. లోకేష్ కీలక వ్యాఖ్యలు!

టీడీపీ నేత లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాంధ్ర యాదవులను బీసీ-బీలో చేర్చేందుకు కృషి చేస్తామని వెల్లడించారు. టీడీపీ పార్టీ అధికారంలోకి రాబోతుందని అంగన్వాడీల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రోడ్లు వేస్తామని అన్నారు.

New Update
Lokesh: యాదవులను బీసీ-బీలో చేర్చుతాం.. లోకేష్ కీలక వ్యాఖ్యలు!

TDP Lokesh: ఈ రోజు మునగపాకలో అంగన్వాడీల శిబిరానికి వెళ్లారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. అధికారంలోకి వచ్చాక అంగన్వాడీల సమస్యలు పరిష్కరిస్తాం అని వారికి హామీ ఇచ్చారు. బెదిరింపు వ్యాఖ్యలు సీఎం జగన్‌ (CM Jagan) నియంతృత్వ పోకడలకు నిదర్శనం అని అన్నారు. వాలంటీర్లతో నడిపించుకుంటామని మంత్రులు చెప్పడం దుర్మార్గం అని అన్నారు. త్వరలో ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ పార్టీ (TDP) అధికారంలోకి రాబోతుందని.. అంగన్వాడీల ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడొద్దని కోరారు.

ALSO READ: రేవంత్ సంచలన నిర్ణయం.. మేడిగడ్డ, అన్నారంపై విచారణ

వ్యవసాయ రంగం పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయింది: లోకేష్

వైసీపీ ప్రభుత్వంలో ఏపీలో రైతులు కష్టాల్లో ఉన్నారని లోకేష్ అన్నారు. అనకాపల్లి జిల్లాలో యువగళం (Yuvagalam) పాదయాత్ర చేపట్టారు లోకేష్. ఈ పాదయాత్రలో తమ సమస్యలు చెప్పుకోడానికి గంగాదేవిపేట రైతులు లోకేష్ ను కలిశారు. పంటలకు గిట్టుబాటు ధరలు లేక నష్టపోతున్నామని రైతులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. వ్యవసాయ రంగం పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయిందని లోకేష్ మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా ఇరిగేషన్‌ కాల్వల నిర్వహణ గాలికొదిలేశారని ఫైర్ అయ్యారు. అధికారంలోకి రాగానే శారద కాలువ పూడిక తీయిస్తాం అని హామీ ఇచ్చారు.

ALSO READ: కేసీఆర్‌ ఫ్యామిలీ పాస్ పోర్టులు గుంజుకోండి .. బండి సంజయ్ సంచలన డిమాండ్

ఉత్తరాంధ్ర యాదవులను బీసీ-బీలో చేర్చుతాం..

విశాఖలో జీవీఎంసీ 82వ వార్డులో యాదవులతో నారా లోకేష్ భేటీ అయ్యారు. యాదవులకు ఆర్థిక, రాజకీయ స్వాతంత్ర్యం ఇచ్చింది టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. టీడీపీ హయాంలో యాదవులకు 90 శాతం రాయితీతో పరికరాలు అందించాం అని గుర్తు చేశారు లోకేష్. గొర్రెలు, మేకల కొనుగోలుకు కార్పొరేషన్‌ ద్వారా రుణాలు అందించాం అని అన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే యాదవులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌, విదేశీ విద్య అమలు చేస్తాం అని హామీ ఇచ్చారు. టీడీపీ ప్రభుత్వం వచ్చాక పాడైన అన్నిచోట్లా కొత్త రోడ్లు వేస్తాం అని అన్నారు. ఉత్తరాంధ్ర యాదవులను బీసీ-బీలో చేర్చేందుకు కృషి చేస్తామని వెల్లడించారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

TTDలో నిజంగానే 100 ఆవులు చనిపోయాయా?: చైర్మన్ బీఆర్ నాయుడు కీలక ప్రకటన!

TTD ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గోశాలలో 100 ఆవులు చనిపోయాయన్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని చైర్మన్ BR నాయుడు స్పష్టం చేశారు. భూమన కరుణాకర్ రెడ్డి కల్పిత ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఇతర ప్రాంతాల్లో చనిపోయిన గోవుల ఫోటోలను ఇక్కడివిగా చిత్రీకరిస్తున్నారన్నారు.

New Update
TTD Cows Death

TTD Chairman Reaction Over Cows Death

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని నిర్వహించబడుడున్న ఎస్వీ గోశాలలో దాదాపు 100 గోవులు మృతి చెందాయని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి నిన్న ఆరోపించిన విషయం తెలిసిందే. అత్యంత దయనీయ పరిస్థితుల్లో ఆ ఆవులు చనిపోతున్నాయని.. ఇది మహా అపచారం అని ఆవేదన వ్యక్తం చేశారు. మృతి చెందిన ఆవులకు సంబంధించిన ఫొటోలను సైతం కరుణాకర్ రెడ్డి విడుదల చేశారు. ఈ అంశంపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు స్పందించారు. కరుణాకర్ రెడ్డి అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారన్నారు. ఇలాంటి కల్పిత ఆరోపణలు అత్యంత విషాదకరమన్నారు. శ్రీవారి సేవలో నిమగ్నమై, హిందూ ధర్మ పరిరక్షణకు అంకితభావంతో టీటీడీ ట్రస్ట్ బోర్డు చేపడుతున్న పుణ్య కార్యక్రమాల పట్ల కంటకింపుతో ఈ తరహా చర్యలకు దిగడం చాలా బాధాకరమనర్నారు.

Also Read :  గుజరాత్‌కు మరో షాక్.. టోర్నీ నుంచి ఆల్‌రౌండర్ ఔట్!

Also Read :  వీరు పొరపాటున పాలు తాగారో.. పైకి పోవడం ఖాయం

గోమాతకు హిందూ ధర్మంలో ఉన్న ప్రాముఖ్యత అనన్య సాధారణమన్నారు. వేదకాలం నుంచే గోమాతను దేవతలతో పూజిస్తూ వస్తున్నామన్నారు. ఏ ఒక్క గోవు యొక్క మృతి కూడా సామాన్యంగా తీసుకోలేమన్నారు. కానీ సహజంగా తప్పని అనారోగ్యం, వృద్ధాప్యం, ప్రమాదాలు వంటి కారణాల వల్ల  గోవుల మృతి జరిగే అంశాన్ని రాజకీయంగ, అబద్ధ ప్రచారానికి వాడుకోవడం అత్యంత అధర్మమని ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read :  మాస్ మహారాజ్ 'మాస్ జాతర' షురూ.. మనదే ఇదంతా.!

ఇతర ప్రాంతాల్లోని ఫొటోలను ఇక్కడివిగా..

ఇంకా దుర్మార్గంగా, ఇతర ప్రాంతాల్లో చనిపోయిన గోవుల ఫోటోలను టీటీడీ గోశాలకు చెందినవిగా  చిత్రీకరించి ప్రజలను మోసగించేందుకు చేస్తున్న కుట్ర బాధాకరమన్నారు. ఇలాంటి వదంతులను ప్రజలు గుర్తించి, అవాస్తవాలపై నమ్మకం కలిగి మోసపోవద్దని కోరారు. గోసేవా అంటేనే గోదేవి సేవ అని అన్నారు. ఈ పవిత్రమైన సేవను రాజకీయ లబ్ధి కోసం మచ్చలేసే ప్రయత్నాలను భక్తులందరూ తిరస్కరించాలన్నారు. శ్రీవారి ఆశీస్సులతో, హిందూ ధర్మ పరిరక్షణలో టీటీడీ చేపడుతున్న గోరక్షణ, గోపోషణ కార్యక్రమాలపై భక్తుల విశ్వాసం మరింత బలపడాలని ఆకాంక్షించారు. 

Also Read :  'జైలర్ 2' లోకి మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ కమ్ డైరెక్టర్ ఎంట్రీ..!

 

(telugu breaking news | latest-telugu-news | br naidu ttd chairman | today-news-in-telugu | andhra-pradesh-news)

Advertisment
Advertisment
Advertisment